Breaking News

  • User Profile Pic What's on Your Mind as a Journalist?

KLM Fashion Mall (Keep Loving More) opened its 13th fashion mall at A.S. Rao Nagar Hyderabad

She is so adorable. Priceless expression when the headset dropped from her ears....

వానా కాలము - ప్రకృతి మనకు నీటిని ఇచ్చే సమయము ప్రకృతి మనకు నీటిని ఎక్కువగా ఇచ్చే సమయము - 4 నెలలు. మనకు నీరు కావలసిన సమయము - ప్రతి రోజూ లేక 12 నెలలూ. తెలంగాణా ఆంద్రప్రదేశ్ లలో సంవత్సరానికి పడే సగటు వర్షపాతము 800 m.m . అనగా ప్రతి చదరపు మీటరు స్థలము మీద ఒక సంవత్సర కాలములో 800 లీటర్ల వాన నీరు పడుతుంది. అలానె ఒక ఎకరంలో ఒక సంవత్సర కాలములో పడే వాన నీరు 3236800 లీటర్లు. ఈ నీరు పొలము విడిచి పోకుండా ఆవిరి గా మారకుండా నిల్వ పెట్టుకొనేందుగా వివిధ ప్రయత్నములు చేయాలి. 200 గజాల విస్తీర్ణములో వున్న ఒక ఇంటి పై కప్పు మీద ఒక సంవత్సర కాలములో పడే వాన నీరు 133760 లీటర్లు. 1000 గజాల విస్తీర్ణములో వున్న అపార్టుమెంటు మీదన ఒక సంవత్సర కాలములో పడే వాన నీరు 668800 లీటర్లు. ఈ నీరు డ్రైనేజీల ద్వారా బయటకి పోకుండా మన ఇంటి దగ్గరే వాడుకొనేటట్లు లేక మన ఇంటిదగ్గరే భూమిలోకి ఇంకేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రకృతి మనకి శుద్ధమైన నీటిని మనము ఎక్కడికో వెళ్లి తెచ్చుకొనే అవసరము లేకుండా నేరుగా మన ఇంటిమీదకే లేక మన పొలములోనికే పంపిస్తుంది. కానీ మొత్తము 12 నెలలకు కావలసిన నీటిని 4 నెలల కాలములోనే ఇస్తుంది. ఒక్కసారే ఎక్కువ నీరు రావడము వలన మనము ఈ నీటిని నిల్వ పెట్టుకొని తిరిగి వాడుకోవాలి. ప్రతి ఇంటి యందు వాన నీటిని దాచుకొనే ట్యాంక్ / సంప్ ను మొదట నిర్మించుకోవాలి. ట్యాంక్ నిండితే మిగిలిన నీరు భూమిలోకి పోవడానికి వాన నీటి ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి. ఇవి రెండూ నిండినాకనే డ్రైనేజీలోకి వాన నీరు పోవాలి. ఇటువంటి పద్దతులను మనము అందరమూ ఇంటి దగ్గర పొలముల దగ్గర ఆచరించడము వలన ప్రభుత్వము మనకి ఉచితముగా ఇచ్చే నీటి మీద లేక విద్యుత్తూ మీద ఒత్తిడి తగ్గుతుంది. నీరు అందరికీ సంవృద్ధిగా అందుతాయి. వాన నీటిని నిల్వ పెట్టుకొనే తిరిగివాడుకొనే పద్ధతులు I) ఇంటి దగ్గరనే వాన నీటిని దాచుకొనే పద్ధతులు: 1). భూగర్భములో ట్యాంక్ లేదా సంప్ ను నిర్మించి నీటిని నిల్వ ఉంచుకొని తిరిగి ఇంటి అవసరముల కోసము వాడుకోవచ్చ్చును. అదే నీటిని ఫిల్టర్ చేసుకొని లేదా మరగబెట్టుకొని లేదా రెండు పద్దతుల ద్వారా శుద్ధి చేసుకొని తాగు నీటికోసము వాడుకొనవచచ్చును. లేదా నీటిని శుద్ధి చేసి తాగడము కోసము పిడకలు కాల్చిన బూడిదను నీటికి కలిపి ఇంకా 4 లేదా 5 చిల్ల గింజలను నీటిని ఉంచే బిందె లేదా కుండ యందు రాత్రి అంతా ఉంచి ఆ నీటిని త్రాగుటకు వాడ వచ్చును. 2) బోరు బావి కి దగ్గర లో ఇంకుడు గుంతను నిర్మించి ఎక్కువ నీటిని భూమిలోకి పంపవచ్చుఁను.. దీనివలన ఆ నీరు మరలా బోరు బావి ద్వారా తరువాతి కాలములో మనకు అందుతూ ఉంటుంది. 3) బోరుబావి వున్నా లేకున్నా ప్రతి ఇంటి అందు / ఆఫిసు యందు ఇంకుడు గుంత ను నిర్మించవలెను. అంతే కాకుండా అపార్టుమెంటు యందు/ వాణిజ్య సముదాయము లందు ఇంకా రహదారులకు ఇరువైపులా ఇంకుడు గుంత ను నిర్మించవలెను. దీనివలన ఎక్కువ వాన వచ్చినప్పుడు డ్రైనేజీ లు / కాలువలు పొంగి పొరలవు. రహదారులు జలమయము కావు.ట్రాఫిక్ జాములు కావు. ఎక్కువ వాన నీటిని ఇంకుడు గుంతల ద్వారా ఎక్కడికి అక్కడ భూమిలోకి ఇంకించడము వలన భూగర్భ జలములలో వుండే ఉప్పు తనము కొంత వరకు తగ్గుతుంది. దీని వలన భూగర్భ జలాల రుచి పెరుగుతుంది. II) పొలముల దగ్గర వాన నీటిని నిల్వ ఉంచుకొనే పద్ధతులు : 1) పొలములోని మొత్తము భూభాగములో 5 నుండి 10 శాతము భూమిని చెరువులు / కుంటలు నిర్మాణానికి వదులుకోవాలి. పొలములోను పొలము చుట్టుపక్కల పడిన వర్షపు నీరు చెరువులోకి కుంతలలోకి పోయే విధముగా ఏర్పాట్లు చేసుకోవాలి. బావి ఉంటే అందులోకి వాన నీరు పోయేవిధముగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇటువంటి నిర్మాణాలు కోస్తా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా రాష్ట్రములోని కొన్ని ప్రాంతములకు అనుకూలము. 2) ప్రతి పావు ఎకరం చుట్టూ ఒక ట్రెంచ్ ను తవ్వాలి. 1 ఆడుకు వెడల్పు అర అడుగు లోతు తో ప్రతి పావు ఎకరం చుట్టూ తవ్వుకోవాలి. ఇటువంటి విధానము రాయలసీమ తెలంగాణా రాష్ట్రాలలో సాగుచేసే ఉద్యానవన పంటలకు కొన్ని పొలాలకు ఎక్కువ ఉపయోగము. 3) ప్రకృతి వ్యవసాయ విధానములో వున్న భూములు అన్నీ 2 లేక 3 సంవత్సరములలో వాన నీటి ఇంకుడు గుంతలుగా మారిపోతాయి. ప్రకృతి వ్యవసాయము చేయడము వలన భూమిలోపల సహజముగా వుండే వానపాముల సంచారము బాగా పెరుగుతుంది. అటువంటి భూమిలో మట్టి బాగా గుల్లగా (Porous ) మారుతుంది. రెండు లేక మూడు సంవత్సరములలో యంతైనా నీటిని పీల్చుకొనే స్థితిని ఆ మట్టి కణాల అమరిక కలిగివుంటుంది. అందువలన యెంత పెద్ద వాన పడినా ఆ పొలములో పడిన నీరు అంతా అక్కడనే ఇంకిపోతుంది. అదే నీరు మరలా ఆవిరి రూపములో మొక్కకు తేమగా అందుతూ ఉంటుంది. ఇటువంటిభూమిలో మొక్కలు కొన్ని రోజులు పాటు నీరు లేకపోయినా తట్టుకొని జీవిస్తాయి. ఇంకా అతి తక్కువ నీటితో పంటలు పండించవచ్చును. అందువలన భూగర్భమునుండి నీటిని తోడి వాడే పరిస్థితి తగ్గుతుంది.

Recent News

భారత్‌ విజేతగా నిలిచింది

భారత్‌-న్యూజిలాండ్‌ మూడో టీ20 అభిమానులకు అసలుసిసలు పొట్టి క్రికెట్‌ మజా అందించింద&# ...

అమ్మాయిలతో సోషల్ మీడియా ద్వార వలపు వల

భారత భద్రతా రహస్యాలను తెలుసుకునేందుకు కేంద్ర భద్రతా బలగాలకు చెందిన జవాన్లపై ఫేస& ...

సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర మంత్రిగా శివసేన నుంచి సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రమా ...

భారతదేశంలోని 130 కోట్ల మంది హిందువులే

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరా& ...

నటుడు గొల్లపూడి కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ నటుడు, గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ ...

బహుముఖ ప్రయోజనాలు

గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతున్నా వాటిద్వారా చెప్ప ...

శ్రియ‌పై తుపాకీ ఎక్కుపెట్టి ప్ర‌శ్న‌ల వ‌ర్షం

సండ‌కారి అనే త‌మిళ చిత్రంలో శ్రియ న‌టిస్తుండ‌గా, ఈ మూవీ ప్ర‌స్తుతం లండ‌న్‌లో షూటిం ...

టీమ్‌ఇండియా చాంపియన్‌

ఆఖరి పోరాటంలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలుత టాస్‌ గెలిచిన వెస్టిండీస్&z ...

పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించిన రాజ్యసభ

‘పౌరసత్వ సవరణ బిల్లు-2019’ (క్యాబ్‌) పార్లమెంట్‌ ఆమోదం పొందింది. లోక్‌సభ ఆమోదించిన బిల ...

ఛపాక్‌ చిత్రం ట్రైలర్‌ విడుదల

బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ఛపాక్‌. యాసిడ్‌ దాడి బాధ&# ...

సూర్యుడివో... చంద్రుడివో.

మహేశ్‌బాబును ‘సూర్యుడివో... చంద్రుడివో...’ అంటున్నారు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి.  ...

ప్లాస్టిక్‌ ద్వారా శరీరంలోకి విష రసాయనాలు

అన్నం తినే ప్లేటు ప్లాస్టిక్‌.. నీళ్లు తాగే బాటిల్‌ ప్లాస్టిక్‌.. బయట ఏమన్నా తెచ్చుక ...

పరిమితుల్ని ఎత్తివేసిన ఎయిర్‌టెల్‌ వొడాఫోన్‌ ఐడియా

మళ్లీ ఉచిత కాల్స్‌ వచ్చేశాయి. ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ వినియోగదారుల కోసం భారతీ ఎయిర్‌ ...

వాతావరణ మార్పులపై చర్చ జరగాలి: నోబెల్‌ విజేతలు

 స్టాక్‌హోం: వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగాలని నోబె ...

దిశ ఘటనలో పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా

దేశంలోనే అత్యుత్తమ పోలీస్ వ్యవస్థ తెలంగాణలో ఉన్నదని, దిశ ఘటనలో పోలీసుల నిర్ణయాన్ ...

దుండగులను పరుగెత్తించి మరీ కాల్చి చంపాలి

ఉన్నావ్‌ లైంగికదాడి బాధితురాలి మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ& ...

దిశ నిందితులు రాళ్లు రువ్వుతూ పారిపోతుండగా

దిశ కేసులో నిందితులైన నలుగురు నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు సం&# ...

తప్పంతా అభిమానులదే

‘తప్పంతా ఈ దరిద్రపు అభిమానులదే. 100% అభిమానులదే. వాళ్ల అభిమాన హీరో బాధపడుతుంటే.. అభిమాన ...

IPL 2020. 2 కోట్ల క్లబ్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే

కోల్‌కతాలో 19th Dec 2019 ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. మొత్తం 971 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వ&# ...

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని

దేశంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని టీఆర్ఎస్ ఎం&# ...

నిఖిల్ తన కొత్త చిత్రానికి పచ్చజెండా

నిఖిల్ తన కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపాడు. కుమారి 21ఎఫ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్ ...

జీవిత బీమా సంస్థలో ఉచిత శిక్షణా

జీవిత బీమా సంస్థలో అసిస్టెంటు ఉద్యోగాల నియామకాలకు ఉద్దేశించిన మెయిన్స్ పరీక్షక&# ...

మూడో తరాన్నీ వీడని 35 ఏళ్ల విషాదం

ఆలియా వయసు 12 ఏళ్లు. వీల్‌చైర్‌లోనే ఆ అమ్మాయి జీవితం గడిచిపోతోంది. పుట్టుకతోనే శారీ ...

రిలీజయిన కొద్ది సేపటికే పైరసీ

ఏం చేసినా పైరసీని ఆపడం సైబర్‌ పోలీసుల వల్ల కావడం లేదు. తాజాగా హిందీ సినిమా 'హొటల్‌ మ ...

కేదారినాథ్‌ మంచు దుప్పటి కప్పుకుంది

కేదారినాథ్‌ మంచు దుప్పటి కప్పుకుంది. శీతాకాలం కావడంతో గుడి పరిసర ప్రాంతాలన్నీ మం& ...

రిపోర్టులో గుండె చెరువయ్యే విషయాలు

వైద్యురాలి Priyanka Reddy హత్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘాతుకానిక ...

ఈ ఘటన మానవత్వాన్ని మంట కలిపేలా ఉంది . అనుష్క

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి మృతికి పలువురు సినీ  ప్రముఖులు దిగ్భ్రాంతి వ్య ...

నలుగురు కామాంధులు నలిగిన ప్రియాంక

ప్లాన్‌లో భాగంగానే స్కూటీ పంక్చర్.. ముక్కు, నోరుమూసి సామూహిక లైంగిక దాడి ఊపిరాడక ప ...

700 కోట్లతో స్కైవర్త్ ఉత్పత్తుల తయారీ యూనిట్

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ స ...

సాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 41 లక్షల ఎకరాల ఆయకట్టులోని యాసంగి పంటలకు సĹ ...

పవన్‌ కల్యాణ్‌ పర్యటన ఖరారు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ పర్యటన ఖరారైనట్లు ఆ పార్టీ కడప జిల్లా నాయక&# ...

ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

రిపబ్లిక్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రిపబ్లిక్ సమ్మిట్‌’లో ప్రధాని మోదీ త ...

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe