Breaking News

ఈ తరం కుర్రవాళ్ళకి డిప్రెషన్ -యాంగ్ఙయిటీ ఎక్కువ

Oct 01, 2017 22:30 by Ramya Ravilla
ఈ తరం కుర్రవాళ్ళకి డిప్రెషన్ -యాంగ్ఙయిటీ  ఎక్కువ

ఎందుకంటే ?మనం ఎక్కువ కృత్రిమ కాల్పనిక వినియోగ కోరికలమార్కెట్ లో జీవిస్తున్నాం కదా! అంధమైన అమ్మాయి కోసం ఏళ్ళ తరబడి సంభంధాలు వెతుకుతూ వుండటం , దాని కోసం కెరీర్ లో బాగా స్థిరపడాలనే తపన దొరక్క చివరికీ ఏదో ఒక అమ్మాయిని చేసుకోవడం , దొరికిన అమ్మాయిని ప్రేమించకపోవడం ప్రక్కవాడు అంధమైన అమ్మాయిని చేసుకుంటే భాధపడటం ఇదంతా సినిమా మార్కెట్ అందగత్తెల ప్రభావం అంత తేలికగా వదలదు . కోరికల మీద ప్రేమ ఒక్కసారి ఏర్పరుచుకుంటే జీవితాంతం వదలదు ఇక అమ్మాయిలూ అంతే , టీనేజ్ లో సినిమాల ప్రభావంతో భర్త నుంచి కోరుకొనే కిక్ ఇచ్చే అతి ప్రేమలు నిజ జీవితంలో కోరుకుంటే అందరికీ జరుగవు ఇక ముసలివారు యవ్వనంలో ఇప్పటి వరకు అన్నీ రుచులు తిని ఇక నుంచీ అవి తినకూడదు అంటే ? వారు అడ్జస్ట్ మెంట్ కాలేక ,మందులు మ్రింగుతూ కోరిక చంపుకొని అందరికీ వేదాంతం చెపుతూ భాధపడుతూ , భయపడుతూ బ్రతికేస్తుంటారు ఇంతకు ముందు ముసలివారు ఇన్ని రుచులూ తినలేదు . వ్యామోహమూ లేదు అంత వత్తిడితో చావలేదనుకుంటా! కృష్ణా ,రామా అంటూ ప్రకృతికే చావును కూడా వదిలేసేవారు . ఇదంతా అభివృద్ది పేరుతో మనకు మనమే తెచ్చుకున్న అంధమైన కలల మార్కెట్ లోని జీవితం , దానికి రెండవ కోణం కూడా భయంకరంగా వుంటుంది . ఏమంటారు?

Facebook like
Google Plus Circle
Youtube Subscribe