Breaking News

LeaderOftheMonthBhagathSingh

Dec 18, 2017 10:01 by Remove The Reservations
LeaderOftheMonthBhagathSingh

#LeaderOfTheMonth #BhagatSingh సర్దార్ భగత్ సింగ్ ఆరవ భాగం ఆనాడు 8 డిసెంబరు 1929 ఢిల్లీ అసెంబ్లీ (పార్లమెంట్ అనే పదం. ఇది ఒక్కటే నాడు) లో రెండు బిల్స్ ప్రవేశబెట్టబోతున్నారు. 1. Public Safety Bill (ప్రజా రక్షణ చట్టం) 2. Trade Dispute Bill (కార్మికుల హక్కుల రద్దు చట్టం) వాటిలో మొదటిది ప్రజల హక్కులను హరించేది రెండవది కార్మికుల సమ్మె చేసే హక్కులను హరించేది. విప్లవవీరులు ముందుగానే వెళ్లి ప్రేక్షకుల స్థానంలో కూర్చున్నారు గ్యాలరీలలో. వెంటవెంటనే రెండు బాంబు పేలుల్లు. ప్రభుత్వ పక్షపు పార్ నాయకుడైన జాన్ భయపడి పిల్లిలా బల్లవెనుక దాక్కున్నాడు. అందరు సభ్యులు దడతో పరుగులెత్తారు. తమ స్థానం నుంచి కదలని వారు విఠల్ భాయ్ పటేల్, మోతీలాల్ నెహ్రూ, మహమ్మదాలీ జిన్నా. హాలు నిండా పొగ కమ్మింది. ఆ పొగలు చీల్చుకుని విప్లవం వర్దిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి అంటూ కరపత్రాలు పరచుకుంటున్నాయి. ఇక అక్కడినుండి అందరూ పారిపోయారు. కాని ఇద్దరు వ్యక్తులు మాత్రం అక్కడే నిలబడి వున్నారు. ఈ పని చేసింది మేమే అని అక్కడ దాక్కున్న పోలీసులకు తెలిపారు. మా లక్ష్యం బ్రిటిష్ వాల్లు కాదు, బ్రిటిష్ ప్రభుత్వం. దానిపైనే మా వ్యతిరేకత. భగత్ సింగ్, బటుకేశ్వరదత్తు చేతులకు సంకెళ్లు వేసి తీసుకువెలుతుంటే అభ్యంతరపెట్టకుండా వెంటనడిచారు. భగత్ సింగ్ గన్ లో అప్పటికే 6 గుండ్లు వున్నాయి. కాని ఎవ్వరినీ ఏమీ చేయలేదు భగత్. నిరసన ప్రదర్శించడమే మా సంస్థ వుద్దేశ్యం కాదు అని తెలిపారు తమ గంభీర ప్రవర్తనతో. జైలుకు తీసుకువెళ్లారు ఇరువురుని. 8 డిసెంబరు 1929 స్కాండర్స్ హత్య, అసెంబ్లీ బాంబు ప్రయోగం రెండూ చేసింది ఒక్కరే అని కరపత్రాల ద్వారా తేలిపోయింది. ఇక్కడ భగత్ తనను తాను ఒక నిరసనకారుడిగా మాత్రమే తెలిపాడు. మా దగ్గర ఆయుధాలున్నా మేము ఎవ్వరిని చంపకపోవడమే దానికి నిదర్శనం అంటూ చెప్పినా క్రూర పాలకులు వినిపించుకుంటారా.. కానీ భగత్ న్యాయ వాదన అమోఘం ఆ క్షణం. అటువైపు భగత్ మిత్రులను విడిపించడానికి ఆజాద్ చంద్రశేఖర్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు తన రహస్య జీవితం గడుపుతూనే. ఇటు జైల్లో మిగతా వారిని విడిపించడానికి, తప్పించడానికి భగత్ సింగ్ ఆలోచిస్తున్నాడు. సింగ్ అరెస్టు అనంతరం అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో J. P. సాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు మరియుసుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు హత్యా నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు. విచారణ సమయంలో HSRA సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు. తద్వారా సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో ఆయన మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు. ఖైదీలు మరియు విచారణ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు జైలులోనే నిరాహారదీక్ష చేపట్టారు. చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటీష్ హంతకులు మరియు దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది. రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, టాయిలెట్ ఇతర దైనందిన సదుపాయాలు కల్పించడం వారి డిమాండ్లు. అలాగే కార్మిక లేదా హోదాకు తగని పనిచేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని సింగ్ డిమాండ్ చేశాడు. 63 రోజుల పాటు కొనసాగిన నిరాహారదీక్ష సింగ్ డిమాండ్లకు బ్రిటీష్ ప్రభుత్వం తలొగ్గడం ద్వారా ముగిసింది. తద్వారా ఆయనకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది. దీక్షకు ముందు ఆయన ప్రాభవం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది. కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగినప్పుడు అక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన మహ్మద్ అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతి తెలిపాడు. నిరాహారదీక్షపై మాట్లాడుతూ నిరాహారదీక్ష చేసే వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మతోనే తను ముందుకు సాగుతాడు. తన పోరాటానికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాడు అని వ్యాఖ్యానించాడు. సింగ్ చర్యలపై మాట్లాడుతూ, ఏదేమైనప్పటికీ, వారిని ఎక్కువగా నిందించినా మరియు ఎక్కువగా చెప్పినా వారు తప్పుదోవ పడుతారు. తద్వారా ఏర్పడే పాలనా ధిక్కార వ్యవస్థను ప్రజలు చీదరిస్తారు అని అన్నాడు. డైరీని వ్రాసే అలవాటు ఉన్న భగత్ సింగ్‌ చివరకి 404 పుటలను నింపాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలు మరియు వారి గొప్ప వాక్యాలకు సంబంధించి సింగ్ తన డైరీలో పలు సూచనలు చేశాడు. 23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే షహీద్ లేదా అమరవీరుడుగా ప్రకటించారు. సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీసేవారు. అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని నిర్ణయించారు...సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్‌ జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయానికి అది సంకేతమయింది. అయితే అవకాశమున్నా కూడా అప్పటి పెద్దలు భగత్ సింగ్ ను విడిపించలేకపోయారని చరిత్రకారులు చెబుతారు. ఏది ఏమయినా ఒక గొప్ప క్రాంతి కారుల నిరసనను దోషంగా పరిగణించి దయ లేకుండా ఉరితీశార. కానీ ఈ అమరుల తుది శ్వాసలు యావత్ భారతీయులకు బలమైన సందేశాలు పంపాయి. విప్లవ జ్వాలలు పెరిగాయ్. మరికొన్ని నిజాలు తదుపరి పోస్టలో #SwamiParipoornanandaPatriotism #LeaderOftheMonthBhagathSingh#AStoryOfBhagathSingh

Facebook like
Google Plus Circle
Youtube Subscribe