Breaking News

ప్రపంచం లో ఇంకెక్కడా ఏ దారుణాలు జరగటం లేదా

Feb 27, 2018 19:09 by Siddhu Ch
ప్రపంచం లో ఇంకెక్కడా ఏ దారుణాలు జరగటం లేదా

ప్రపంచం లో ఇంకెక్కడా ఏ దారుణాలు జరగటం లేదా? సిరియా లో 400 పైగా పిల్లలు చనిపోయారు, ఎవరో కార్ ఎక్కించి 9 మంది చావుకు కారణం అయ్యాడు, మన దేశం లోనే 200 కోసం చనిపోయిన వ్యక్తి, ఇవేమీ వార్తలు కావా? ఇవి కనిపించటం లేదా చెత్త చానెల్స్ కి? 3 రోజుల నుంచి రకరకాల సొంత అనుమానాలు, అభిప్రాయాలు, ఇష్టమైనట్లు బాత్ టబ్ లలో pose లు పెట్టి ఒకరు, వైన్ గ్లాస్ బాత్ టబ్ మీద పెట్టి ఇంకొకరు, ఏ కార్ ఎక్కిన సమయం లో జనం ఎలా చనిపోయారో చచ్చి చూపించాల్సింది. ఇటువంటి చానెల్స్ ను నిషేధిస్తే కానీ trp పడిపోతే కానీ వీరికి తెలిసి రాదు. కొంచెం వారి పిల్లల పైన కుటుంబం పైన ఎలాంటి ప్రభావము చూపిస్తుందో ఆలోచించండి. డైట్ వల్ల అని కొందరు, మద్యం అని ఒకరు, ఈ trp కోసం తపించకుండా, నిరావ్ మోడీ బాంక్ స్కాం, హిట్ అండ్ రన్ 9 మంది పిల్లలు బలి, సిరియా లో చచ్చిపోతున్న పిల్లలు, రైతుల చావులు, ఇవి కూడా పట్టించుకోండి. చనిపోయిన ఆవిడ ఆత్మకు శాంతి లేకుండా చేయకండి. అమ్మ కోసం విలపిస్తున్న పిల్లలని మీ చెత్త అనుమానాలతో బాధ పెట్టకండి, చనిపోయిన శ్రీదేవిని అవమానించకండి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇకనైనా టీవీ చానెల్స్ భాద్యతగా మెలగాలని ఆసిస్తూ May her soul rest in peace ఓం శాంతి

Facebook like
Google Plus Circle
Youtube Subscribe