Breaking News

ఏమిటేమిటీ చంద్రుడులో సాయిబాబా

Sep 26, 2018 00:04 by Chaitanya Ch
ఏమిటేమిటీ చంద్రుడులో సాయిబాబా

ఏమిటేమిటీ ---, చంద్రుడులో సాయిబాబా కనబడుతున్నాడా ? ఏమా చిత్రమూ ? ఏళ్ళ తరబడి ఆయనకు భజన్లు,పూజలు చేస్తున్నవారికి కనబడలేదు బాబా గుడి ముందు బిచ్చం ఎత్తుకుంటున్న వారికి కనబడలేదు అర్థం కాని సంస్కృత మంత్రాలు చదువుతున్న పూజారులకు కనబడలేదు ఇదేం చిత్రం ? చంద్రుడిపై 20 జూలై 1969 పై మొదటిగా కాలు పెట్టిన , నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కి కనబడలేదు నాసా వారికి కనబడలేదు ఇస్రో వారికీ కనబడలేదు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తకూ కనబడలేదు ఇది నిజంగా విచిత్రంగానే వుంది అయినా --- ఏ రాకెట్ లేకుండా బాబా చంద్రుడి మీదకు ఎలా వెళ్ళాడబ్బా ? బాబా చనిపోయింది 1919 లో అప్పటికి ఆయన వయసు 70 లేక 75 సం||లు వుంటాయని అంచనా ! తను ఎక్కడ పుట్టాడో తెలీదు - తల్లిదండ్రుల పేర్లు తెలియవు భక్తలు మాత్రం ఆయన్ని దేవుడ్ని చేసేశారు ప్రపంచంలో అన్ని దేశాలకు చంద్రుడు కనబడతాడు చంద్రుడిలో వున్న ఆ మరకల్ని( నీడల్ని ) అనుసరించి క్రిస్టియన్స్ జీసస్ గానూ భావించుకోనూవచ్చు చైనా,జపాన్ దేశాలు బుద్దుడు బోది వృక్షం క్రింద కూర్చున్నాడు అనుకోవచ్చు ఎవరికీ తోచిన విధంగా వారు అనుకోవచ్చు ఈ దేశంలో -- మత స్వేఛ్చ, అందునా బాబాలకు,స్వామీజీలకు మరింత అతిగా వుంది ఈ భూమి ఆవిర్భారించి కోట్ల యుగాలు గడిచి పోయాయి కేవలం -- 70,80 మాత్రమే జీవించిన ఓ బాబా ప్రజల కోర్కెల్నిఎలా నెరవేర్చగలడు ? ఇప్పుడు చంద్రుడిలో బాబా వున్నాడు అని నమ్ముతున్న వారు .., రేపు వెంకన్న ,శివుడు సత్యనారాయణ, నరశింహుడు ,కనకదుర్గ, కాళిక,, వైష్ణవిదేవి కనబడుతున్నారంటే ..., నమ్ముతారా ? ( * హెచ్చరిక --- TV వాళ్ళు ఇటువంటి డిబేట్లు , ప్రచారాలు మానుకుంటే మంచిది ... సమాజానికి మేలు చేసిన వారౌతారు )

Facebook like
Google Plus Circle
Youtube Subscribe