Breaking News

అమ్మను మించిన ఆలయం లేదు...

Oct 23, 2018 09:43 by Ramya Ravilla
అమ్మను మించిన ఆలయం లేదు...

స్త్రీ నాభి రొమ్ము తొడ వీపు‌ పెదవులు ఇలా ఒక్కొక్క అవయవం వంకా రెప్ప వాల్చకుండా నీచమైన దృష్టితో చూసే కొందరు వ్యక్తులకోసం ఈ కొన్ని మాటలు.... నాభి - నువ్వీ ప్రపంచానికి జెండా ఊపి స్వాగతించిన పేగుబంధ స్థావరం రొమ్ము - నువ్వీ ప్రపంచంలో బతకడానికి సేవించిన అమృతబిందువులున్న చోటది నడుము - నువ్వెక్కి కూర్చోవడానికి అలవాటు చేసుకున్న తొలి స్థావరమది పెదవి - నువ్వు మొట్టమొదటగా అమ్మతో ముద్దులు పొందిన చోటది తొడ - నువ్వు మొట్టమొదటగా కూర్చుని స్నానం చేయించుకోవడానికి అలవాటు చేసిన చోటది జననాంగం - నువ్వీ ప్రపంచానికి వచ్చిన ప్రవేశ ద్వారం చెంపలు - నువ్వు బుగ్గలతో బుగ్గలు కలిపి ఆడుకుని ఆనందించిన చోటు వీపు - అమ్మ నిన్ను సరదాగా ఉప్పు బస్తాగా ఊహిస్తూ ఆడించిన చోటది ఇలా స్త్రీలోని ఒక్కో అవయవం నువ్వు జీవించడానికి అలవాటు చేసుకున్న స్థావరాలవి ఎంతైనా అమ్మ అమ్మే అమ్మను మించిన ఆలయం లేదు.....

Facebook like
Google Plus Circle
Youtube Subscribe