Breaking News

స్వామియే శరణం అయ్యప్ప..

Sep 28, 2018 19:12 by Venkatesh
స్వామియే శరణం అయ్యప్ప..

మన భారతవనిలోని హిందు ఆలయాల్లో ఒక్కో ఆలయం దగ్గర ఒక్కో సంప్రదాయం ఉంటుంది. అది కోట్ల భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉంటుంది. నిజానికి అవి రాజ్యాంగాలకు అతీతం. అవి విశ్వాసాలకు సంప్రాదాయాలకు సనాతన ధర్మాలకు సంబంధించినవిగా ఉంటాయి. కొన్ని తరాలుగా కోట్ల మంది భక్తులు విశ్వసించే నమ్మకాలు కూడా ముఖ్యమే కదా. ఒక దగ్గర ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అసభ్య వస్త్రధారణ వద్దంటుంది ఓ గుడి చొక్కా తీసేసి రమ్మంటుంది ఓ గుడి హిందుత్వాన్ని విశ్వసిస్తేనే గుడిలోకి ప్రవేశం అంటుంది మరో గుడి. ఇవన్నీ కాదనగలమా.. అవన్నీ ఆయా గుళ్ల సంప్రదాయాలు విశ్వాసాలకు అనుగుణంగా కాలపరీక్షలో నిలిచిన అంశాలే కదా. ప్రతి గుడిలో ఎలా పూజ చేయాలో ఏ మంత్రాలు చదవాలో తీర్థప్రసాదాల సమయంలో ఏ మంత్రాలు పఠించాలో ఏ ఆగమశాస్త్రం మేరకు పూజలు చేయాలో అసలు హారతి ఎలా ఇవ్వాలో దండ ఎలా వేయాలో కూడా చెప్తారా ఎవరైనా. ఒక గిరిజన ఆలయంలో కల్లు సార పోయటం అది అక్కడి విశిష్ట పూజావిధానంలో ఒక భాగం. కోడిని గొర్రెని బర్రెని కోసేస్తారు అలా చేయోద్దని చెప్పగలరా చెబితే వారు పాటిస్తారా.. మరి అప్పుడు ఏమిటి..? ఫలానా మంత్రపుష్పం ఫలానా మంత్రం మాత్రమే పఠించాలి అంటాడు రేప్పొద్దున పెద్ద తెలిసినట్లుగా ఒకాయన. గుడిలో ఫలానా ప్రసాదం పెట్టొద్దు కేవలం శనిగె బొండెలు మాత్రమే పెట్టాలి మధుమేహం పెంచే ఆ లడ్డూలేమిటి..? అసలు ఆ పులిహోర ఏమిటి..? వడలేమిటి..? ఈ జైనుల్లో ఈ నగ్న సంప్రదాయం ఏమిటి..? వెంటనే మానేయండి నాన్సెన్స్ అంటూ పరమతస్ధుడు అన్నాడనుకో రేప్పొద్దున కేసు వేస్తే స్వీకరించటం కరెక్టేనా.. అసలు పరాయి మతవిశ్వాసాల్లో జోక్యం చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అది ముస్లిం అయిన హిందువైన మరే మతమైన. ఎవరి ధర్మాలు ఆచారాలు వారివే కదా. మన రెగ్యులర్ సామాజిక జీవనానికి భిన్నంగా ఉండే జైనుల సంప్రదాయాల్లో వేలు పెట్టగలరా ఎవరైనా శబరిమల గుడిలోకి ప్రవేశం లేదంటే నచ్చనివాళ్లు వెళ్లడం మానేస్తారు. అంతే తప్ప సమాజానికి స్థూల నష్టం ఏమి ఉండదు. దయచేసి అందరు గమనించండి ఒక హిందువుగా మన దేవాలయాలకు ఒక సంప్రదాయం ఉంటుంది దాన్నీ తరతరాలుగా మన పెద్దలు గౌరవించారు. మనం కూడా పాటిద్దాం. హిందువుగా శబరిమల ఆలయ సంప్రదాయంను గౌరవిద్దాం. స్వామియే శరణం అయ్యప్ప..

Facebook like
Google Plus Circle
Youtube Subscribe