Breaking News

వాటి పూర్వవైభవ స్థితికి కారకం కావాలని.

Oct 06, 2018 12:03 by Venkatesh
వాటి పూర్వవైభవ స్థితికి కారకం కావాలని.

ఒకప్పుడు "నదీతీరముల వెంబడి వెలుగొందిన దేవాలయాలు" నేడు "ఆలనా పాలనా లేక దీనావస్థలో ఉన్నాయనటానికి ఈ దేవాలయమే" తార్కాణం.
"వనవాస సమయములో,ఈ దండకారణ్యములో" "శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై " ఇక్కడ సేద తీరి, ఆశ్రమమును ఏర్పరచుకుని అనేక రాక్షసులను తుదముట్టించిన ప్రదేశం.
ఈ "రామ్ లఖన్ పూర్."తరువాత నిజాం ల హయాం నుండి "సయీద్ పూర్" గా పిలవబడుతున్నది.
ఇక్కడి "అద్భుతమైన రామాలయం,హనుమాన్ దేవాలయం,సాత్నాలా నదీ సుందర పరీవాహక ప్రదేశాలు,నదిలో ఉన్న అబ్బురపరిచే విభిన్న ఆకృతులతో ఉండే రాళ్ళు(Stone bergs) ఇలా అన్నీ అద్భుతాలే.
కావున ఓ "రామ్ లఖన్ పూర్ గ్రామ,బేల మండల,అదిలాబాద్ జిల్లా యువ సింహాల్లారా..."
మీ "గ్రామ అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేయండి.మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండేట్టు ఆ "రామలక్ష్మణులు చూసుకుంటారు."

ఇలా ఈ ఒక్క గ్రామమే కాదు ప్రతి గ్రామమున మన ఆలయాలు మరుగున పడిపోతున్నాయ్..
నీ గ్రామం,,, నీ ఆలయం,,, నీ బాధ్యతగా ముందుకు వచ్చి
వాటి వివరాలను అందరికీ చేరవేసి 
వాటి పూర్వవైభవ స్థితికి కారకం కావాలని...
సనాతన ధర్మం రక్షణ ఈ విధంగా జరగాలని కోరుకో...

Facebook like
Google Plus Circle
Youtube Subscribe