Breaking News

వేంకటేశ్వారాలయం లో అద్భుతం చోటు చేసుకుంది

Dec 23, 2018 14:42 by Venkatesh
వేంకటేశ్వారాలయం లో అద్భుతం చోటు చేసుకుంది

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అతిపురాతన వేంకటేశ్వారాలయం లో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. ధనుర్మాస ఉత్సావాల్లో భాగంగా తిరుప్పావై సేవాకాలం ఆళ్వార్ తిరుప్పావై కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులు గుడి నుంచి ఆరుబయటకు వెళ్లే క్రమంలో గుడ్లగూబ లాంటి పక్షి భక్తులకు కనిపించింది. దేవాలయ ప్రాగణంలోకి వచ్చిన పక్షి వెంకన్న పాదాల చెంతకు చేరుకుంది. విషయం తెలిసిన పట్టణవాసులు ఆలయానికి తండోపతండాలు చేరుకొని పక్షిని వీక్షించారు. ఆలయంలో అర్చకులు భీర్నంది నర్సింహాచార్యులు పక్షికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఇది గుడ్లగూబ జాతికి చెందిన రకం పక్షి అనీ ఆలయ గోపురంపై పిల్లలు ఉండగా వాటిలో ఒకటి కింద పడి ఆలయ ఆవరణలోకి వచ్చి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe