Breaking News

జగన్మాతృకామూర్తి అని సంభా వించి వారిద్దరి పెళ్ళి జరిపిస్తాడు.

Nov 26, 2018 19:54 by Ramya Ravilla
జగన్మాతృకామూర్తి అని సంభా వించి వారిద్దరి పెళ్ళి జరిపిస్తాడు.

దళితేతర నవలల్లో దళిత స్త్రీ జీవితం ఒకవైపు స్త్రీని దేవతగా కొలుస్తూనే మరోవైపు ఆమె పుట్టుకే గిట్టని వైరుధ్య సమాజంలో మనం ఉన్నాం. ముఖ్యంగా భారతదేశంలో తరతరాలుగా వేదాలు ఉపని షత్తులు మత గ్రంథాలు స్మృతులు ముఖ్యంగా మను స్మృతి వంటివి స్త్రీకి కనీసం గౌరవం ఇవ్వవలసిన స్థానా న్ని ఇవ్వలేదు. మరొక వైపు సమాజాన్ని వివిధ వర్ణాలుగా విభజించింది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే ప్ర ధాన వర్గీకరణతో పాటు ఈ నాలుగు వర్ణాలకు మరొక వర్ణం చేరి పంచమవర్ణమైంది. మొదటి మూడువర్ణాల స్త్రీలకే కనీస హక్కులు లేనప్పుడు మిగతావర్ణాల స్త్రీల ప రిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. చాతుర్వర్ణాల్లో మొదటి మూడువర్ణాల స్త్రీలు తరతరా లుగా ఇంటిలో భోగవస్తువుగానే ఉన్నప్పటికీ సమాజంలో కొంత గౌరవనీయమైన హోదా దక్కింది. అది మిగతా వర్ణాల స్త్రీలకు లేదు. మొదటి మూడువర్ణాల స్త్రీలు కొన్ని యేండ్ల పాటు ఇంటిలోనే ఉండవలసిన నిర్భంధ పరిస్థితి ఉంటే మరొకవైపు మిగతావర్ణాల స్త్రీలకు ఇంటా బయ టా ఉండకపోతే బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వర్గా నికి చెందిన స్త్రీలకు ఇంటిలోనే ఉండటం రక్షణగా అనిపిం చినా అంతర్గతంగా అదే స్వేచ్ఛను హరించింది. మరొక వర్గానికి చెందిన స్త్రీలకు ఇంటా బయటా తిరగడంలో స్వేచ్ఛ ఉన్నా అది మిద్యాస్వేచ్ఛగా మారింది. తమకు చారిత్రకంగా లభించని సామాజిక రక్షణ తమని బలహీ నులుగా మార్చడం వల్ల అత్యాచారాలకు హత్యాచారాల కు గురవ్వడమే కాకుండా శ్రమదోపిడికి కూడా గురికావ లసి వచ్చింది. అందువల్ల మొదటి మూడువర్ణాల్లోనూ పితృస్వామ్యం మిగతావర్ణాల్లో మాతృస్వామ్య ఛాయలు కనిపిస్తాయి. తెలుగు నవలల్లో దళిత స్త్రీవాద తత్త్వం తెలుగులో నవల అనేది నరహరి గోపాల కృష్ణమశెట్టి ‘శ్రీ రంగరాజ చరిత్రము’ (సోనాబాయి పరిణయం) 1872 లోను 1878లో కందుకూరి వీరేశలింగం ‘శ్రీ రాజశేఖర చరిత్రము’ రాశారు. వీటి తర్వాతనే తెలుగులో ‘నవల’ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అనేక సామాజిక పరిణామాల్ని గమనించిన తెలుగు నవలల్లో దళితుల గురించి కూడా అక్కడక్కడా ప్రస్తావన కనిపిస్తుంది. భార త రాజ్యాంగం ప్రకారం ఒక్కొక్క రాష్ట్రంలోను ఒక్కొక్క వృత్తికి చెందిన వాళ్ళు షెడ్యూల్డు కులాలుగా షెడ్యూల్డు తెగలుగా వర్గీకరించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ నాటి నుం డి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా పునర్విభజన జరిగే వరకూ దళితుల జీవితాలను ప్రస్తావిస్తూ అనేక నవలలు వస్తూనే ఉన్నాయి. అయితే సామాజిక పరిణా మాన్ని బట్టి సాహిత్యంలోనూ కొన్ని ధోరణులు వాదాలు సిద్ధాంతాలు బయలుదేరాయి. భావ అభ్యుదయ విప్లవ దిగంబర స్త్రీవాద దళిత ముస్లిం మైనారిటీలుగా వీటిని పేర్కొంటున్నారు. ఈ రకమైన వర్గీకరణ చేయడానికి ప్ర దానంగా కులం జెండర్ మతం కారణాలయ్యాయి. స్త్రీవాదంలో చర్చనీయాంశాలు సాధారణంగా స్త్రీవాదంలో ప్రధానమైన భావనలుగా స్త్రీ పురుష సమానత్వం స్వేచ్చ (లింగవివక్ష) స్త్రీని భోగ వస్తువుగా చూసే దృష్టి పట్ల వ్యతిరేకత స్త్రీ పునరుత్పత్తి స్వేచ్చ పితృస్వామ్య వ్యవస్థ పట్ల వ్యతిరేకత ఆర్ధిక స్వా తంత్య్రం అన్నింటిలోనూ సమానావకాశాలు ఆధిక్యతా భావాన్ని వ్యతిరేకించడం కొన్ని పనులు ఆడవాళ్ళకే చెం దుతాయనే భావనల పట్ల వ్యతిరేకత సాహిత్యంలో ప్ర యోగించే భాషాధిపత్యం పురుషులకు మాత్రమే గుర్తిం పు కలిగించే ప్రయోగాలు స్త్రీలను కించపరిచే ప్రయో గాలు సామెతలు పలుకుబడులు మొదలైన వాటి పట్ల వ్యతిరేకత పిల్లల పెంపకం కేవలం స్త్రీలకే చెందిందనే భావనను వ్యతిరేకించడం స్త్రీ స్వతంత్రంగా ఆలోచించ లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందనే వాదనలను వ్యతిరేకించడం స్త్రీ శారీరక స్థితిగతులను బట్టి అస్పృశ్య తను పాటించడం కొన్ని కార్యక్రమాల్లో దేవాలయ ప్రవే శాలను నిషేధించడాన్ని వ్యతిరేకించడం దేవాలయాల్లో పూజారులుగా పనికిరారనడం స్త్రీ పునర్వివాహం మొద లైనవన్నీ స్త్రీవాదంలో కనిపించే భావనలు. దళిత స్త్రీవాదంలో ప్రత్యేకాంశాలు దళిత స్త్రీలు కూడా ఈ భావనలు చాలావరకూ అను భవిస్తున్నా వీటిలో కొన్నింటి పట్ల వీరికి స్వేచ్ఛ ఉంది. మరికొన్ని కేవలం దళిత స్త్రీలకు మాత్రమే పరిమితమవు తున్నాయి. దళిత స్త్రీలనే దేవదాసి మాతంగులుగా కొన సాగిస్తున్నారు. మిగతా స్త్రీలతో పోల్చి చూసినప్పుడు మా నం ప్రాణం విషయంలో దళిత స్త్రీల పట్ల మరింత పీడన కొనసాగుతోంది. దళిత స్త్రీలకు పునర్వివాహం పెద్ద అవ రోధం కాదు. అయినప్పటికీ చాలామంది పునర్వి వాహాన్ని చేసుకోవాలో వద్దో వాళ్ళ స్వేచ్ఛ మీదే ఆధార పడి ఉంటుంది. ఇలాంటి విషయాలు సాధారణ స్త్రీవాదం లో సరిగ్గా ప్రతిఫలించలేదనే వాదన కూడా ఉంది. ప్రసవ వేదనలో కూడా దళిత స్త్రీల ప్రసవ వేదనను స్త్రీవాదం నిర్లక్ష్యం చేసిందనే విమర్శ ఉంది. చదువుకున్న దళితుల దళిత స్త్రీల విషయంలో అటు స్త్రీవాదులు ఎదుర్కొనే సమస్యలతో పాటు చదువుకోని దళిత స్త్రీలు ఎదుర్కొనే సమస్యల మధ్య నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దళిత నవలల్లో స్త్రీవాద తత్వం ‘స్త్రీవాద తత్త్వం’ అనే పారిభాషిక పదాన్ని స్త్రీవాదం లో కనిపించే స్వభావచిత్రణనూ లేదా భావజాలాన్ని అది కొనసాగిన దృక్పథంలో గల విలువల మూల్యాంక నాన్ని గుర్తించడంగా భావిస్తున్నాను. ‘తత్త్వం’ అనే పదా నికి ‘పరమాత్మ’ ‘స్వభావం’ అనే అర్థాలున్నాయి. ఇక్కడ ‘స్వభావం’ అనే అర్థాన్నే స్వీకరించాలి. అంటే సత్యం వాస్తవం బుద్ధి వివేకం పరిపూర్ణత్వం భావజాలం మొదలైన అర్ధాలు ఉన్నాయి. ఒక వస్తువు లేదా ఏదైనా ఒక విషయాన్ని గాని సత్యమైన స్వభావాన్ని గుర్తించడమే తత్త్వం. సహజమైన వివిధ ప్రభావాల్ని వివరించడంపై ఆధారపడే ఊహా పరికల్పన సిద్ధాంతం లేదా వ్యవస్థ గా వివరించారు. ఇలా తత్త్వం గురించి ఆలోచించినప్పుడు ‘దళిత స్త్రీవాద యొక్క సత్య స్వరూపాన్ని లేదా దాని స్వభావాన్ని లేదా దాని వాస్తవిక దృక్పథాన్ని గుర్తించ డమే దళిత స్త్రీవాదతత్త్వంగా భావించవచ్చు. దళితుల భావజాలాన్ని వారి దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకొని దళిత నవలల్లో స్త్రీవాద భావనల చిత్రణ జరుగుతుందో లేదో విశ్లేషించుకోవడం లేదా దాన్ని గుర్తించడం’గా భావిస్తున్నాను. దళిత వాదానికి లేదా దళిత ఉద్యమానికి ‘తాత్త్విక భావజాలం’ అంతా జోతిరావు బాఫూలే(1827-1890) పెరియార్ రామస్వామి (1879-1973) డా.బి.ఆర్. అంబేడ్కర్ (1891-1956) కాన్షీరామ్ (1934-2006) సాహు మహరాజ్ (1874-1922) నీగ్రో సాహిత్యంలోని తిరుగుబాటు తత్త్వం మొదలైన వారందరి ఆలోచనల స మాహారమే దళిత తాత్త్వికత. కారల్ మార్క్స్ (1818- 1883) భావజాలాన్ని కూడా కలిపి దేశీయ మార్క్సిజ అనే భావజాలం కూడా దళిత సాహిత్యంలో చర్చనీ యాంశంగానే కొనసాగుతుంది. కానీ అంబేడ్కర్ తన రచనల్లో చార్వాకం బౌద్ధంతో పాటు చారిత్రక గతితా ర్కిక భౌతికవాదాన్నీ దాని పరిణామాల్ని విశ్లేషించి భారతదేశానికి కులాన్ని ప్రధానం చేసుకోవాలనే సిద్ధాం తాన్ని ప్రతిపాదించారు. ‘నా తాత్త్విక దృక్పథానికి పోరా టం గమ్యం ఉన్నాయి. నా తాత్విక సిద్ధాంతం పౌరులకు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తుంది’అని అంబేద్కర్ వ్యాఖ్యానించారు (కత్తి ప ద్మారావు దళిత దర్శనం పుట:28). అంబేడ్కర్ మతపర మైన తాత్త్వికాంశాల పట్ల కూడా స్పష్టతనే ప్రదర్శించాడు. తనకు ముగ్గురు గురువులనీ వారు బుద్ధుడు కబీరు జోతీరావు బాఫూలే అని అంబేడ్కర్ ప్రకటించాడు. కనుక అంబేడ్కర్ ఆలోచనా విధానంతో పాటు మిగతా పైన పే ర్కొన్నవారి భావజాలాన్ని కలిపి దళితతాత్త్వికతగా గుర్తి స్తున్నారు. వీరి ఆలోచనా విధానం ప్రకారం దళిత స్త్రీవా దం చిత్రితమైతే అది నిజమైన దళిత స్త్రీవాద తాత్త్వికత అవుతుంది. కొన్ని పరిస్థితుల్లో వీరి ఆలోచనలను మించి స్వీయానుభవంతో దళితులు వర్ణించిన భావనలు కూడా దళిత తాత్త్వికతలో భాగమే అవుతాయి. రచయితలు వ్యక్తీ కరించే జీవితానుభవాల్ని వివిధ సంఘటనలు పాత్రలు సన్నివేశ కల్పనల ద్వారా వర్ణించేది సాహిత్యంలో తాత్త్విక త అవుతుంది. తెలుగు నవలల్లో దళిత జీవితం : తెలుగులో 1872లో వెలువడిన ‘శ్రీరంగ రాజ చరిత్ర ము’లో రాజవంశానికి చెందిన ఒక అమ్మాయి కారణాం తరాల వల్ల సోనాబాయి ఒక గిరిజన మహిళగా పెరుగు తుంది. 1878 నాటి శ్రీరాజశేఖర చరిత్రములో రాజశేఖరు డు మార్గమధ్యలో పడిపోయినప్పుడు దాహం కోసం నీ ళ్ళు తాగమంటే దళితుడు పోసిన నీళ్ళ పట్ల వ్యతిరేకతతో దళిత ప్రస్తావన కనిపిస్తుంది. తర్వాత కాలంలో దళితుల జీవితాలను దళితేతరులు చాలామంది రాశారు. 1913లో ‘హేలావతి’ నవలలో తల్లాప్రగడ సూర్యనారాయణ రావు దళితుల పేదరికాన్ని వారి ప్రేమను ఆదరణను ఊరికి దూరంగా బతకవలసి వచ్చే దుర్భరజీవితాన్ని చిత్రించే ప్రయత్నం చేశారు. అలాగే ఒక ముస్లిం చక్రవర్తికి సహా యం చేయడం వల్ల కలిగిన ధనం వల్ల ధనవంతుడైన దళితుడికి కూతురు పుడుతుంది. ఆమె పేరు హేలావతి. ఆమె అందంగా ఉంటుందనీ సుగుణాలతో శోభిల్లుతుం దనీ ఎట్టి పరిస్థితుల్లోను తన దళితుణ్ణి వివాహం చేసుకో కూడదని నిర్ణయించుకున్నదట. అలా ఒక ముస్లిం మంత్రి కుమారుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకోవడానికి ఆ ముస్లిం చక్రవర్తి సహాయం చేసినట్లు వర్ణించాడు రచయిత. కు లాంతర మతాంతర వివాహాల్ని చర్చించినా మతాంతీ కరణ పట్ల రచయిత సవ్యమైన దృక్పథాన్ని ప్రదర్శించ గలిగినా కులాంతర వివాహాల పట్ల ఆయన దృక్పథం దళితుల ఆలోచనా విధానానికి దూరంగా ఉంటుంది. రెం డు మనసులు కలయిక వల్ల కుల మత భేదాలు నశించి పోవడం దళితులు ఆశించే కులాంతర వివాహాలు. అంతే కానీ తమ సంస్కృతి హీనమైనదని అంగీకరిస్తూ తన జాతిని ఈసడించుకుంటూ పరజాతి లేదా పరాయి కుల సంస్కృతిని ఉన్నతీకరించి మనసుపడ్డం అనేది జరగదు. ఈ నవల్లో హేలావతి తన కులం వాళ్ళను చేసుకోకూడ దనుకోవడంలో ఇదే భావం స్ఫురిస్తుంది. ‘హేలావతి’ నవల తర్వాత కూడా ఇలాగే చాలామం ది దళిత జీవితాన్ని తీసుకొని నవలలు రాశారు. వేంకట పార్వతీశ్వర కవులు ‘మాత మందిరం‘ (1919)లో దళితు డైన అప్పడి కూతురు ముత్యాల్ని గౌరిపతి శాస్త్రి కుమారు డు రంగడు పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ముత్యాలుకి ఆతడు బ్రాహ్మణుడని తెలిసి భయపడి వివాహానికి వెన కాడుతుంది. అప్పుడు మాతృ మందిరంలోని ప్రబోధా నంద స్వామి ముత్యాల్ని జగన్మాతృకామూర్తి అని సంభా వించి వారిద్దరి పెళ్ళి జరిపిస్తాడు. - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు (హెచ్‌సీయు)

Facebook like
Google Plus Circle
Youtube Subscribe