Breaking News

ప్లాస్టిక్‌ తినేస్తున్నాం

Jun 12, 2019 20:57 by Siddhu Ch
ప్లాస్టిక్‌ తినేస్తున్నాం

మనం రోజూ తీసుకుంటున్న ఆహారంతో ప్లాస్టిక్‌ కూడా తినేస్తున్నామా? అతిసూక్ష్మమైన పరిమాణంలో ఉండే ప్లాస్టిక్‌ను వివిధ రూపాల్లో తెలియకుండానే తినేస్తున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. కుళాయి ద్వారా వచ్చే తాగునీరు బాటిల్‌ వాటర్‌ షెల్‌ ఫిష్‌ బీర్‌ ఉప్పు తదితర ఆహార ద్రవ పదార్థాల ద్వారా ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ పొట్టలోకి చేరుతున్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన న్యూకాస్టిల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి రమారమి పావుకిలో ప్లాస్టిక్‌ తినేస్తున్నామని శాస్త్రవేత్తలు తేల్చారు. గాలిలో కూడా కంటికి కనిపించని విధంగా ప్లాస్టిక్‌.. రేణువుల మాదిరి కలిసి పోయింది. గాలి పీల్చినప్పుడు అవి ముక్కుద్వారా లోపలికి వెళ్తున్నట్లు చెబుతున్నారు. మన నోటి ద్వారా ఎంత ప్లాస్టిక్‌ తినేస్తున్నామో.. అంతే మోతాదులో ముక్కు ద్వారా శరీరంలోకి చేరుతున్నట్లు వెల్లడిస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe