Breaking News

Rain wreaks havoc in Hyderabad

Apr 22, 2019 18:13 by Ch S R
Rain wreaks havoc in Hyderabad

రోడ్లు భవనాలపై తెగిపడిన తీగల పట్ల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని.. వాటిని తాకకుండా వెంటనే విద్యుత్‌శాఖకు సమాచారం ఇవ్వాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి తెలిపారు. వర్షం ఈదురు గాలు ల నేపథ్యంలో హైదరాబాద్‌లో విద్యుత్ పరిస్థితిని సోమవారం రాత్రి ఆయన సమీక్షించా రు. స్తంభాలపై చెట్లు కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు పనిచేస్తున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్టు వివరించారు. విద్యు త్ సరఫరాలో అంతరాయాలు ఉంటే.. 23431178/ 23431179/ 9491056 410/ 1912/ 100/ 21111111 నంబర్లలో ఫిర్యాదుచేయాలని సూచించారు. దాదాపు 760 మంది సిబ్బంది అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని వివరించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe