Breaking News

వైద్య ఖర్చులు భరిస్తూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా

Nov 25, 2019 12:11 by Siddhu Ch
వైద్య ఖర్చులు భరిస్తూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా

ఆమె పేరు సరఫినా నాన్స్‌.. ఫిజిక్స్‌ అన్నా కాస్మాలజీ అన్నా ఆమెకు ఎంతో ఇష్టం. ఇప్పుడు ఒక అత్యున్నతమైన ఆస్ట్రోఫిజిక్స్‌ పి.హెచ్‌డీ ప్రోగ్రాంలో ఆమె భాగస్వామి. రెండు పరిశోధన పత్రాలు కూడా వెలువరించింది. కానీ నాలుగేళ్ల క్రితం ఆమె పరిస్థితి ఏంటో తెలుసా? క్వాంటమ్‌ ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌లో ఆమెకు సున్నా మార్కులు వచ్చాయి! ఆమె ఆందోళన చెంది తన ఫిజిక్స్‌ ప్రొఫెసర్ని కలిసి మొత్తం ఫిజిక్సే వదిలేద్దామనుకుంది. కానీ ... ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కష్టపడి ఇప్పుడు ఆమె ఉన్న స్థానానికి వచ్చింది. పైగా ఆమెకు బ్రెస్ట్‌ కాన్సర్‌ అని తెలిసింది. కానీ బతికే ఛాన్స్‌ 85 శాతం ఉందని చెప్పారు. అనారోగ్య బాధ అనుభవిస్తూ జీవిస్తుందో లేదో తెలీని టెన్షన్‌ ఎదుర్కొంటూ మరో పక్క వైద్య ఖర్చులు భరిస్తూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా - తను అనుకున్న విద్యలో ఎక్సలెన్సీ సాధించింది ఆ అమ్మాయి. ఈ విషయం గురించి ఆమె ట్వీట్‌ చేసినప్పుడు - గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఆమెను మెచ్చుకున్నారు. సున్నా మార్కులు వచ్చినా నిరాశలోకి పోనందుకు జీవితమే శూన్యం కాబోయినా ధైర్యంగా పోరాడుతున్నందుకు ఆమెను ప్రశంసిస్తూ - Well said and so inspriring అన్నారు. మరి సుందర్‌ పిచాయ్‌ కి మాత్రమే కాదు.. ఎందరికో స్ఫూర్తినివ్వగలిగిన ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసం నిజంగా చాలా గొప్పది కదూ?

Facebook like
Google Plus Circle
Youtube Subscribe