Breaking News

రక్తంతో తడిచి ముద్దవుతున్న సిరియా పేరు

Mar 02, 2018 17:56 by Chaitanya Ch
రక్తంతో తడిచి ముద్దవుతున్న సిరియా పేరు
రక్తంతో తడిచి ముద్దవుతున్న సిరియా పేరు
రక్తంతో తడిచి ముద్దవుతున్న సిరియా పేరు
రక్తంతో తడిచి ముద్దవుతున్న సిరియా పేరు

రక్తంతో తడిచి ముద్దవుతున్న సిరియా పేరు తలుచుకొంటుంటేనే మనసంతా ఏదోలా అయిపోతోంది. అక్కడి పసిపిల్లలను చూస్తుంటే చాలా బాధాకరం, ఎవరికైన కంట్లో నీళ్ళు కారిపోవాల్సిందే. అలా కారలేదు అంటే వాళ్ళు తప్పకుండా ఐసిస్ కు సంబంధించిన వారై ఉండాలి. ప్రపంచంలోని ప్రతి దేశంలోను గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. టైం దొరికితే చాలు ఎవరి గొప్పలు వారు చెప్పుకొంటు దేశ దేశాలు తిరుగుతూ అంత బాగున్న టైంలో శాంతి దూతలమంటూ ప్రసంగాలతో దంచి పారేస్తారు. అన్ని దేశాల నాయకుల్లారా దయచేసి ఆ చిన్న పిల్లల ముఖలు చూసైన కాస్తాయిన జాలి కలిగితే ఈ మారణహోమలు వెంటనే ఆపే ప్రయత్నం చేయండి. సరే ఇది మనదేశం కాదు, వీళ్ళు మన ప్రజలు, మన పిల్లలు కారు అని సరిపెట్టుకుందామా..?! అసలు ఎటుపోతోంది మనుషుల్లోని మానవత్వం. ఈ ప్రపంచంలో మానవత్వం అంటు ఉందా లేదా..?! ఏంటి ఆ పసిపిల్లలు చేసిన తప్పు. అసలు ఐక్యరాజ్య సమితి ఎందుకుంది, ఇలాంటి సమస్యలను పరిష్కరించటంలో ప్రతిసారి విఫలం అవుతోందనే చెప్పాలి. దీనిని వెంటనే ఇకనైనా ఆపకపోతే ప్రపంచంలో మానవత్వం అనేది పూర్తిగా చనిపోయింది అని అనుకోవలసి ఉంటుంది. ఇలాగే మరికొంత కాలం జరిగితే సిరియాలో చివరికి మిగిలేది స్మశానమే. ప్రపంచం మొత్తం ముక్త కంఠంతో సిగ్గుపడి ఇకనైనా ఏకతాటిగా పైకి వచ్చి ఈ మారణ కాండను సామూహికంగా కండించకపోతే రేపటి నాడు ఇలాంటి సంఘటనలే ప్రతి దేశంలోను జరిగే ప్రమాదం ఉందని అందరు గమనించాలి. కళ్ళముందు పిల్లలు బలి అవుతుంటే పట్టించుకోని వాళ్ళని ఏం అనాలి. ఒక దేశం అంతర్గత విషయాల్లో ఇతర దేశాలు జోక్యం కలిగించుకోకూడదు కాని, సిరియా పరిస్థితి అదికాదు కదా. ముఖ్యంగా ఈ వైమానిక దాడుల లక్ష్యం ప్రజలు కాదు, కానీ వీటిల్లో సామాన్య ప్రజలు, చిన్న చిన్న పిల్లలు చనిపోవడం దారుణమైన విషయం కదా. ఇది తప్పని ప్రశ్నించే ధైర్యం ఎవరికుంది. యుద్ధం కంటే బాంబుల కంటే మతం కంటే చర్చలు అత్యంత ప్రభావంతమైనవి కదా అయిన ముఖ్యంగా అక్కడ అధికార దాహాంతో ఉన్న అసద్ కి ఎలాగైన అధికారం కావాలి. అక్కడ శాంతి నెలకొనాలి అంటే చర్చలు జరిపే ప్రపంచ దేశాల ఐఖ్య కమిటి ఒక్కటి కావాలి. కానీ అది ఐసిస్ ఉండగా ఎటువంటి పరిస్ధితిలోను సాధ్యపడదు. ఇప్పుడు జరుగుతున్నది చూస్తే వారికి ఏ ఒప్పందాలతోను చివరికి ఎవరి తోను పని లేదు. ఒక్కటి మాత్రం నిజం ఇలా అందరిని చంపుకొంటు పోతూ అధికారంను, దేశంను హస్తగతం చేసుకోవాలనుకునే వారిని ఎవరు ఎంత ప్రయత్నించిన శాంతి మార్గంలో చర్చల్లో కూర్చోపెట్టడం అంటే అసాధ్యమనే చెప్పాలి. ఎప్పుడైన ఎక్కడైన చిన్న పిల్లలను ఏడిపించటం, భయపెట్టటం అంత మంచిది కాదు ఎవరికైన. అలాంటిది ఏకంగా అంతమందిని ఇంతలా చంపటం అంటే ప్రపంచం మొత్తం ఇది చూస్తూ ఊరుకున్న పాపానికి తప్పక తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇది తధ్యం. మాలాంటి ఎందరో మీకోసం కన్నీళ్ళు పెట్టటం తప్పా ఇంకేం చేయాలని మా స్ధితిని తలుచుకొంటూ సిగ్గుతో తలదించుకొని మా ఇష్ట ధైవంను మా ఆత్మ సాక్షిగా మీ కష్టాలు అతి త్వరగా తొలగిపోవాలని కోరుకుంటున్నాము.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe