Breaking News

స‌రికొత్త ఫ్యాకేజీ

Mar 07, 2016 19:29
 స‌రికొత్త ఫ్యాకేజీ

షిర్డీ టూర్‌లో ప్ర‌త్యేక‌త‌లు

షిర్డీ, శ‌నిసింగాపూర్‌, నాసిక్‌, (త్ర‌యంబ‌కేశ్వ‌రం, ముక్తిధామ్‌, పంచ‌వ‌టీ) దీంతో పాటు ఔరంగాబాద్‌, అజంతా & ఎల్లోరా గుహ‌ల‌కు సంబంధించిన ఫ్యాకేజీ క‌ల‌దు.

 తిరుప‌తి టూర్ ప్ర‌త్యేక‌త‌లు

తిరుమ‌ల‌, తిరుచానూరు, శ్రీ కాళ‌హ‌స్తీ, కాణిపాకం, శ్రీ‌నివాస మంగాపూరం, శ్రీ‌పురం (గోల్డెన్ టెంపుల్‌) మ‌రియు టూర్‌లో ఇంకోక ప్ర‌త్యేక‌త ఉంది. వెంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నం కోసం మీరు ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఈ టూర్ బుక్ చేసుకున్న వారికి ద‌ర్శ‌నం కూడా ఐఆర్‌సీటీసీ చేపిస్తున్నారు.

నార్త్ ఇండియా టూర్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి...

జై గంగామ‌యి (SHR034) , జ‌న్న‌తే కాశ్మీర్ (SHR035) , మాతా వైష్ణోవి దేవి (SHR036),  గోల్డెన్ ట్రైయాంగిల్ డెలిగేట్స్ (SHR037), హిల్ స్టేష‌న్ ఆఫ్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ (SHR038), రాయ‌ల్ రాజ‌స్థాన్ (SHR046),  జిమ్ కోర్బేట్- నైనిటాల్ (SHR47), జై కాశీవిశ్వ‌నాథ (SHR048), అయోధ్య (SHR061), హేరిటైజ్ టూర్ ఆఫ్ రాజ‌స్థాన్ (SHR062), హిమాచ‌ల్ ఫ్యాంట‌సీ (SHR063), హిల్ స్టేష‌న్ ఆఫ్ ఉత్త‌రాఖాండ్ (SHR064) శివ‌థామ్ ఆఫ్ ఉత్త‌రాఖాండ్ (SHR066)

స్టేట్ ప్యాకేజీలు ఇలా...

తిరుప‌తి టూర్ ...గోవిందం (SHR012) తిరుప‌తి-తిరుమ‌ల, తిరుచానూరు (ఆదివారం మ‌రియు గురువారం) ధ‌ర-2633.

తిరుప‌తి టూర్ ...అర్చ‌నం (SHR004) తిరుప‌తి-కాణిపాకం, శ్రీ‌పురం, తిరుమ‌ల, తిరుచానూరు, శ్రీ కాళ‌హ‌స్తి.  ( గురువారం మ‌రియు శుక్ర‌వారం) ధ‌ర-4681.

తిరుప‌తి టూర్ ..పూర్వ సంధ్యా (SHR001)...తిరుప‌తి, కాణిపాకం, శ్రీ‌నివాసా మంగాపూరం, తిరుమ‌ల, తిరుచానూరు, శ్రీ కాళ‌హ‌స్తి  (శుక్ర‌వారం మ‌రియు ఆదివారం) ధ‌ర-4172.

షిర్డీ టూర్‌...సాయి గౌత‌మి...(SHR08,10)..నాగ‌ర్‌సోల్‌, షిర్డీ, శ‌నిసింగాపూర్‌,, నాసిక్ (త్ర‌యంభ‌కేశ్వ‌రం-ముక్తిధామం మ‌రియు పంచ‌వ‌టీ)  (శుక్ర‌వారం మ‌రియు ఆదివారం) ధ‌ర-2812.

షిర్డీ టూర్‌...సాయి స‌న్నిధి...(SHR014)...నాగ‌ర్‌సోల్‌, షిర్డీ (శుక్ర‌వారం మ‌రియు ఆదివారం) ధ‌ర-2306

షిర్డీ టూర్‌...సాయి స‌న్నిధి...(SHR09c/s) నాగ‌ర్‌సోల్‌, షిర్డీ (బుధ‌వారం మ‌రియు శుక్ర‌వారం) ధ‌ర-2093

రాజ‌మండ్రి...గ‌ల‌గ‌ల గోదావ‌రి..(SHR007)..రాజ‌మండ్రి, పాపికొండ‌లు, కోరుటూర్ హంట్స్ (శుక్ర‌వారం మ‌రియు ఆదివారం) ధ‌ర-4088

రాజ‌మండ్రి...కోన‌సీమ మ‌రియు అన్న‌వ‌రం (SHR029) రాజ‌మండ్రి , ప‌ట్టీసీమ‌, పోల‌వ‌రం, పాపికొండ‌లు, రాజ‌మండ్రి, కోన‌సీమ (క‌డియం, రేల్‌, దిండి, అంత‌ర్వేది) అన్న‌వ‌రం టెంపుల్‌, ఫిఠాపురం, ద్రాక్షారామం, బిక‌న‌వోలు, క‌డియం (గురువారం) ధ‌ర-3441.

ఈ ఫ్యాకేజీలో మ‌రో ప్ర‌త్యేక‌త ఉంద‌ని రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం డిజిఎం పేర్కొన్నారు. అది ఏమిటంటే...రైల్వేస్టేష‌న్‌లో దిగ‌గానే ప్ర‌యాణికుల‌ను క్యాబ్ స‌ర్వీసు ద్వారా త‌క్కువ ధ‌ర‌లో ఫిక‌ప్ చేసుకొని డ్రాపింగ్ చేయ‌డం. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి..

small taxi- 0-10 కి.మీల వ‌ర‌కు-165 రూపాయ‌లు, 10-20 కి.మీల వ‌ర‌కు 330 రూపాయ‌లు, 20-30 కి.మీల వ‌ర‌కు-495 రూపాయ‌లు, 30-40 కి.మీల వ‌ర‌కు 660 రూపాయ‌ల‌ను వ‌సూలు చేస్తారు.

medium taxi-0-10 కి.మీల వ‌ర‌కు-200 రూపాయ‌లు, 10-20 కి.మీల వ‌ర‌కు 400 రూపాయ‌లు, 20-30 కి.మీల వ‌ర‌కు-595 రూపాయ‌లు, 30-40 కి.మీల వ‌ర‌కు 795 రూపాయ‌ల‌ను వ‌సూలు చేస్తారు.

ఈ క్యాట‌రింగ్ స‌దుపాయం

ఆన్‌లైన్‌లో మీరు మీకు న‌చ్చిన పుడ్ ఆర్డ‌ర్ చేసుకునే స‌దుపాయాన్నిక‌ల్పించిన‌ట్టు రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం డిజిఎం తెలిపారు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు విజ‌య‌వాడ‌లో రైలు ఎక్క‌గానే హైద‌రాబాద్ బిర్యాని తినాల‌నుకోండి వెంట‌నే మీరు హైద‌రాబాద్ చేరుకునే స‌మ‌యాన్ని ఆన్‌లైన్ ఎంట‌ర్ చేయ‌డ‌మే కాకుండా మీరు తినే ఆహార ప‌దార్థాల‌ను ఏ హోట‌ల్ నుంచి కావాలో (Sms : MEAL -PNR No-139 sms) చేయాలి. మీరు ప్ర‌యాణం చేస్తున్న రైలు హైద‌రాబాద్ రాగానే మీకు న‌చ్చిన ప‌దార్థాలు మీ ముందు ఉంటాయి.

 

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe