Breaking News

అప్యాయ‌త‌ల‌కు బ‌లం తగ్గింది.

Mar 07, 2016 19:32
అప్యాయ‌త‌ల‌కు బ‌లం తగ్గింది.

నోటికి బ‌లం పెరిగింది..అప్యాయ‌త‌ల‌కు బ‌లం తగ్గింది..మ‌నిషిలో అంత‌రిస్తున్న అనుబంధాల‌ను గుర్తుకు తేవ‌డానికి నిర్వాణ సెంట‌ర్‌ను ప్రారంభించామ‌ని లీలా గారు  పేర్కొంటున్నారు...మాన‌వ జ‌న్మ ఎత్తిన ప్ర‌తి మ‌నిషికి మాన‌సికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండ‌డానికి ఈ సెంట‌ర్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆమె తెలిపారు. నిన్ను నీవు తెలుసుకో.. నీ లోప‌ల ఉన్న శ‌క్తిని తెలుసుకోన్న‌ప్పుడే నీవు ఆనందంగా జీవిస్తావ‌న్నారు ఆమె.  ప్ర‌తి నెల 3 ఆదివారం ఇక్క‌డ ఏదో విష‌యంపై చ‌ర్చించుకుంటాం. దేవుడు మ‌న‌ను మ‌నిషిగా పుట్టించాడు. కానీ మ‌నం దానిని డ‌బ్బుతో ముడిపెట్టి మాన‌వ‌సంబంధాల‌ను దూరం చేసుకుంటున్నామ‌ని అలా కాకుండా ఆ సంబంధాల‌ను పున‌రుద్ధ‌రించ‌డానికి మేము ఈ సంస్థ‌ను ప్రారంభించామ‌న్నారు. ప్ర‌తినెల ఇక్క‌డ జ‌రిగే స‌త్స‌సంగ్ కార్య‌క్ర‌మంలో డ‌బ్బుతో అవ‌స‌రం లేకుండా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. అదేలా అంటే ఇక్క‌డ‌కు వ‌చ్చే వారు త‌మ‌కు తోచిన విధంగా ఏదో ఒక‌టి కూర‌గాయ‌లు, పండ్లు, పాలు ఇంకా ఏదైనా తీసుకువ‌స్తారు. ఇక్క‌డ‌కు వ‌చ్చిన వారు ఎంత‌టి హోదాలో ఉన్నా ఏదో ఒక ప‌నిచేయాల్సిందే. కూర‌గాయ‌లు కోయ‌డం నుంచి ఏ ప‌నైనా చేయాల్సిందే. అంటే ఎవ‌రికీ ఎలాంటి ఫీలింగ్ లేకుండా మ‌న‌మంతా ఒక్క‌టేన‌న్న భావ‌న‌లో ఉంటారు. 2 సంవ‌త్స‌రాలుగా అనేక కార్య‌క్ర‌మాల‌ను ఇక్క‌డ నిర్వ‌హించాం. ముద్ర‌, ఆరోగ్యం, వంట‌, మెడిటేష‌న్‌ ఇంకా అనేక వాటి గురించి ఇక్క‌డ చ‌ర్చించుకుంటాం.అప్యాయ‌త‌తో ప‌నిచేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఇక్క‌డ‌కు వ‌చ్చిన వారిని చూస్తే తెలుస్తుంద‌ని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం, ఆహారం, ఆనందమే మ‌నిషికి కావాల్సింది. ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ ఉద్దేశ్యంతోనే మేము ఈ సెంట‌ర్‌ను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.

అప్యాయ‌త‌ల‌ను దూరం చేసుకుంటున్నారు....

 ప్ర‌తి సంవ‌త్స‌రం ఇక్క‌డ సంక్రాంతి ఘ‌నంగా ఇక్క‌డ జ‌రుపుకుంటాం. ఎందుకంటే ఇప్ప‌డు న‌డుస్తున్న కాలం కంప్యూట‌ర్ యుగం. ఈ కాలం విద్యార్థుల‌ను తీసుకుంటే వాట్స‌ప్‌, ఫేస్‌బుక్, ఇంట‌ర్నెట్ అంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. అప్యాయ‌త‌ల‌ను దూరం చేసుకుంటున్నారు. అలాకాకుండా విద్యార్థి ద‌శ‌లోనే అంత‌రించిపోతున్న మాన‌వ‌సంబంధాలు, తెలుగు పండుగ‌ల గురించి వారికి తెలియ‌చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇక్క‌డ రావ‌డానికి ఫీజు అవ‌స‌రం లేదు. మెంబ‌ర్‌షిప్ లేదు.

మ‌నిషికి దుంఖః లేదు.

మ‌నిషికి దుంఖః లేదు..దుంఖః అనేది మ‌నిషి ఆలోచ‌న నుంచే వ‌స్తుంది. అలాంటి వాటిపై ఇక్క‌డ కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తాం..మ‌న స‌మ‌స్య‌ల‌పై ఇక్క‌డ కౌన్సెలింగ్ ఇవ్వ‌డానికి చాలామంది వ‌స్తుంటారు. 40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల వ్య‌క్తి ఇప్ప‌టివ‌ర‌కు ఆనందం అంటే తెలియ‌ద‌ని తెలిపారు. అత‌నికి మేము ఇచ్చిన కౌన్సెలింగ్‌తో అత‌ను జీవితంలో చాలా ఆనందం పొందాన‌ని తెలిపారు.

10సంవ‌త్స‌రాల‌ క్రితం...

నేను 10సంవ‌త్స‌రాల‌ క్రితం ఒక ఆశ్ర‌మానికి వెళ్లాను అక్క‌డ నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. అక్క‌డ ఒక్క రూపాయి తీసుకోకుండా ధ్యానం నేర్పించారు. ధ్యానం నుంచి జ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను. అదే ఉద్దేశ్యంతో నేను ఈ సంస్థ‌ను నెల‌కొల్పాను. మా సెంట‌ర్‌కు వ‌చ్చే వారు వెళ్లేట‌ప్పుడు స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేది ఏదో ఒక‌టి నేర్చుకోవాల‌న్న‌దే మా త‌ప‌న... దీంతోపాటు ఆహార ప‌ద్ధ‌తిలో ఆలోచ‌నా విధానంలో మార్పు రావాల‌నే ఉద్దేశ్యంతోనే మేము ఇక్క‌డ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాం. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ‌కు మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయ‌ణ‌, సంగీత ద‌ర్శ‌కులు కీర‌వాణి, హీరో గోపీచంద్‌, భాహుబ‌లి నిర్మాత ఇంకా అనేక మంది ప్ర‌ముఖులు ఇక్క‌డ‌కు వ‌చ్చారు. చిత్తూరు మ‌ద‌న‌ప‌ల్లిలో ఇంకో సెంట‌ర్‌ను ప్రారంభించాల‌నుకుంటున్నామ‌ని ఆమె తెలిపారు.

నాకు ఈ ఆలోచ‌న రాగానే...

నాకు ఈ ఆలోచ‌న రాగానే మా భ‌ర్త‌తో చెప్పాను. ఆయ‌న నాకు అన్ని విధాలా సాయాన్ని అందించారు. ఆయ‌న‌తో పాటు నా త‌మ్ముడు  రాంబాబు అన్ని ముందుండి న‌డిపించాడు. మేము స్థ‌లాన్ని మాత్ర‌మే సేక‌రించాం. రాంబాబు మాత్రం 2 సంవ‌త్స‌రాలుగా అన్నీ తానై ఈ కార్య్ర‌క‌మాల‌ను విజ‌య‌వంతం చేస్తున్నాడు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe