Breaking News

రైడ్ చేయండి ఇలా.....

Jan 23, 2016 23:41
రైడ్ చేయండి ఇలా.....

మీరు ఒక్క‌రే రైడ్‌కు వెళుతున్నారా....ఎవ‌రైనా మీతో ఉంటే బాగుండేద‌ని అనిపిస్తుందా. ఇలాంటి వారికోసం . రైడ్‌మిక్స్  అనే సంస్థ కొత్త ఆలోచ‌న‌తో ముందుకొచింది..ఎవ‌రైనా త‌న సొంత వాహ‌నంలో ఒక్క‌రే ప్ర‌యాణించాల్సి వ‌చ్చిన‌ప్పుడు  రైడ్‌మిక్స్ అనే సంస్థ‌ను సంప్ర‌దించండి. రైడ్‌మిక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రైడ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను దానిలో అప్‌డేట్ చేయండి. దీనిద్వారా మీ తోటి ప్ర‌యాణికులు మిమ్మ‌ల్ని సంప్ర‌దిస్తారు. ఆఫీసుల‌కు వెళ్లేవారికి ఇది మంచి అవ‌కాశం. కాలుష్యం బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

 రైడ్‌మిక్స్ ప్ర‌స్థానం

సుమంత్ అనే వ్యక్తి ఏలూరు ప్రాంతానికి చెందిన వారు. అత‌ను 12 సంవ‌త్స‌రాలుగా బెంగుళూరులో సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.అత‌ను కొన్నిసార్లు త‌న సొంత ఊరికి వెళ్ల‌డానికి ఎలాంటి వాహ‌నాలు దొర‌క‌లేదు. బ‌స్సులు సైతం చాలా ర‌ద్దీగా క‌నిపించాయి. దీంతో అత‌ను ఎలాగైనా ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించాల‌ని ఇలా ఎవ‌రూ ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌ని ఈ సంస్థ‌ను ప్రారంభించారు. దీనికోసం సూర్య ఎలివేష‌న్ అనే కంపెనీ యజ‌మాని కె.అరుణ్ గారితో క‌లిసి 3 నెల‌ల క్రితం బెంగుళూరులో రైడ్‌మిక్స్ సంస్థ‌ను ప్రారంభించారు.

సంస్థ ఉద్ధేశ్యం

కొంద‌రు ప్ర‌యాణాన్ని స‌ర‌ద‌గా చేస్తారు..మ‌రికొంద‌రు అవ‌స‌ర నిమిత్తం చేస్తారు....ప్రయాణం చేస్తున్న‌ప్పుడు మ‌నం చేరాల్సిన టైంకు మ‌న గ‌మ్య‌స్థానానికి చేరిన‌ప్పుడు మ‌నకు సంతోషం వేస్తుంది.ఇదే సంద‌ర్బంలో మ‌న‌కు స‌రైన టైంకు వాహనాలు దొర‌క్క ఇబ్బందులు ప‌డ‌తాము.అలాకాకుండా ప్ర‌యాణికులను ద్శ‌ష్టిలో పెట్టుకొని ఈ సంస్థ సేవ‌ల‌ను నిర్వ‌హిస్తోంది.

అది ఎలా అంటే....

ఉదాహ‌ర‌ణ‌కు ..ర‌మేష్ అనే వ్య‌క్తి పండుగ‌కు హైద‌రాబాద్ నుండి విజ‌య‌వాడ‌కు వెళ్లాలి. బ‌స్సులు అన్ని పుల్‌గా ఉన్నాయి. ప్రైవేటు వాహ‌నాలు సైతం నిండుకున్నాయి. రైడ్‌మిక్స్ అనే సైట్‌లోకి వెళ్లి లాగిన్‌లో మ‌న వివ‌రాల‌ను అక్క‌డ ఉంచిన‌ట్ట‌యితే మ‌న మాదిరిగానే బైక్‌, జీపు, కారు ఇంకా మిగ‌తా వాహ‌న‌దారులు వారు వెళ్లే ప్ర‌దేశం, స‌మ‌యం, చార్జీల వివ‌రాలు మ‌రియు ఫోన్ నెంబ‌ర్లును న‌మోదు చేస్తారు. మ‌నం వాటి ప్ర‌కారం వారితో ఫోన్‌లో మాట్లాడుకొని జాలీగా రైడ్‌లో పాలుపంచుకోవ‌చ్చు. దీనివ‌ల‌న వాహ‌న‌దారుల‌కు ప్ర‌యాణికుల మ‌ద్య మంచి సంబంధాలు నెల‌కొంటాయి. రైడ్‌మిక్స్‌లో ట్యాక్స్‌ బుకింగ్ సౌక‌ర్యం కూడా ఉంది.

లాగిన్ అవ్వండి ఇలా...

రైడ్‌మిక్స్ స‌ర్వీసును వాడుకునేందుకు http:/ridemix.comస‌భ్యులై పోండి. ప్రొపైల్ ఫొటోతో పాటు డాష్‌బోర్డు వ‌స్తుంది. దాంట్లో మీ వాహ‌నం వివ‌రాల‌తో పాటు రైడ్‌ని ఫోస్ట్ చేయండి.ఒక‌వేళ మీరు ప్ర‌యాణికులైతే వేళ్లాల‌నుకునే మార్గంలో ఎవ‌రెవ‌రు రైడ్‌లు పోస్ట్ చేశారో చూసేందుకు find ride ఆప్ష‌న్ ఉంది. వివ‌రాల్ని ఎంట‌ర్ చేసి తేదీని సెల‌క్ట్ చేసుకుని సెర్చ్ చేయాలి. హోం పేజీలో విభాగాల వారీగా అందుబాటులో ఉన్న రైడ్‌ల‌ను బ్రౌజ్ చేసి చూడొచ్చు. కేవ‌లం స్త్రీల‌కు మాత్ర‌మే ఉన్న రైడ్‌ల‌ను ladies only విభాగంలో చూడ‌వచ్చు.

ట్యాక్సీ స‌ర్వీసుల నిమిత్తం

హోం పేజీలోని taxi మోనులో ప్ర‌త్యేక క్యాబ్ స‌ర్వీసుల్ని ప్ర‌వేశ‌పెట్టారు. మోనులోకి వెళ్లి క్యాబ్ బుక్ సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు. outstation మోనులో బుకింగ్  submit చేయ‌వ‌చ్చు. రైడ్‌మిక్స్ నిర్వాహ‌కులు 10 శాతం డిస్కౌంట్‌తో బుకింగ్ స్వీక‌రించి క్యాబ్‌ల‌ను అందుబాటులోకి తెస్తారు. return empty cab సేవ‌ల‌ను వాడుకొని 50 శాతం డిస్కౌంట్‌తో రైడ్‌ను బుక్ చేసుకోవ‌చ్చు.మొబైల్ యాప్ రూపంలో సేవ‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.అండ్రాయిడ్‌, యాపిల్ ఓఎస్‌ల‌పై యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe