

నిజాయితీ పోలీస్ అధికారిగా 20 సంవత్సరాలుగా పలు హోదాల్లో ఆమె పనిచేశారు. వనితల భద్రతకు రక్షణ కవచంగా నిలిచారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రణకు ఆమె నడుంబిగించారు. షీ టీమ్స్ అంటూ ఆకతాయిల ఆగడాలకు చెక్‌పెట్టారు. గృహ హింస, అత్యాచారానికై గురైన మహిళల కోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఓ కార్యక్రమాన్ని చేపట్టి వారి జీవితానికి భరోసా ఇస్తున్నారు. అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే ఎదురించి పోరాడాలని నిరూపించారు మన ఐ.జి. (అడిషనల్ కమిషనర్) స్వాతిలక్రా. ఆమె సాధించిన విజయాలు ఆమె మాటల్లోనే...
బాధితులకు పక్కా న్యాయం...
అత్యాచారానికి, హింసకు గురైన మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించి భరోసా సెంటర్ ను ఏర్పాటు చేశాం. బాధితులు కోర్టుకు వెళ్లకుండా మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడానికి ఈ సెంటర్లో వీడియో లింకేజీ కూడా ఉంది. ఇక్కడ క్లీనిక్ ఉంది. ఒక నర్సు, ఒక లీగల్ అడ్వయిజర్, సోషల్ కౌన్సిలర్, క్లీనికల్ సైకాలజీలు ఇక్కడ పనిచేస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నదే సీఎం గారి కోరిక ఆ విధంగానే మేము ఇక్కడ వసతులను సమకూర్చాం. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ సెంటర్ ఏర్పాటుకు 2 కోట్లను మంజూరు చేసింది. ఈ భవనంలో అన్ని వసతులున్నాయి. బాధితులకు పక్కా న్యాయం జరిగేలా చూడాలన్నదే నా తాపత్రయం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఆస్ప్రతుల వారు కూడా మాకు సహకరిస్తున్నారు. బాధిత మహిళలకు షెల్టర్ ఇవ్వడానికి కొన్ని స్వచ్చంద సంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. భార్యాభర్తలకు, తాగి భార్యలను కొట్టే వారికి సైతం ఇక్కడ కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. ఏదైనా పోలీస్ స్టేషన్లో అత్యాచారానికి సంబంధించిన కేసు వస్తే ఎఫ్ఆర్ఐ అయిన తరువాత భరోసా సెంటర్ కు బాధితులను తరలించాలని ఆదేశిలిచ్చాం. బాధితులకు సంబంధించి ఫిర్యాదుపై వెంటనే స్పందించడానికి మేము శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. ప్రతి 498 ఎ కేసులో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ జరపాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఇది పోలీసుల తరఫున చేయకూడదు. స్వచ్ఛంద సంస్థలు చేయాలి. ఆ కౌన్సెలింగ్ దీనికి చాలా తేడా ఉంది. భరోసా సెంటర్ హింస, అత్యాచారానికి గురైన మహిళల గురించి పనిచేస్తుంది.
ఆ కమిటీలో నేను కూడా మెంబర్‌గా ఉన్నాను....
షీ టీమ్ రావడానికి కారణం మొదట సీఎంగారు మహిళల భ్రదతకు సంబంధించి ఓ కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను కూడా మెంబర్‌గా ఉన్నాను. అప్పడు పలువురి మహిళల అభిప్రాయాలను సేకరిస్తే ఎక్కువ ర్యాగింగ్ గురించి ఫిర్యాదు చేశారు. 2015 మార్చిలో ఈ షీ టీమ్స్ ను ప్రారంభించాం. 100 షీ టీమ్స్ ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయి. అన్ని కేసులను పూర్తిగా తెలుసుకున్న తరువాతే మా టీంలు ముందుకు వెళుతున్నాయి. షీ టీమ్స్‌కు చిక్కిన ఆకతాయిలకు మేము కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి మాట్లాడిస్తాం. తగిన ఆధారాలతో నిందితులను పట్టుకొని వారికి శిక్షపడేలా చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి మంచి నేర్పిస్తే కొంత వరకు సమాజంలో మార్పు వస్తుందని నేను నమ్ముతాను. మహిళలు కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తే మిగతావారు భయపడతారు. మహిళలు పనిచేసే చోట కచ్చితంగా వారి సమస్యలు తెలియచేయడానికి ఒక సెల్‌ను ఏర్పాటు చేయాలి. ఇది గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్‌లో ఉంది. కానీ చాలాచోట్ల సెల్ లేదు లేనిచోట హోం డిపార్ట్మెంట్ ను సంప్రదించాలి. 100 నెంబర్ కు మహిళలు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. షీ టీమ్స్‌కు సంబంధించి మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది. షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయాలంటే వాట్సప్ నంబర్ 9490616555 తో పాటు ఫేస్బుక్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. మొయిల్ ఐడి hidesheteam@gmail.comల ద్వారా మహిళలు ఫిర్యాదు చేయవచ్చు. మహిళా కానిస్టేబుళ్ల కోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మన సీఎంగారు పోలీసుల గురించి చాలా నిధులను ఖర్చు చేస్తున్నారు.
నా భర్త ఐఎఎస్....
కాలేజీలో చదువుకోవడానికి మా అమ్మానాన్నలు నన్ను ఢిల్లీకి పంపించారు. అక్కడ మా స్నేహితులు చాలా మంది ఐపీఎస్, ఐఎఎస్ కు ప్రిపేర్ అయ్యేవారు. అలా నాకు కూడా ఐపీఎస్ కావాలని కోరిక కలిగింది. అలా 1995 సంవత్సరంలో నేను ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. మా బ్యాచ్ ట్రైనింగ్ అప్పుడు 80 మంది గ్రూపులో ఉంటే వారిలో 13 మంది మహిళలు ఉండేవారు. నేను ఐపీఎస్ కావడానికి ఒక విధంగా కిరణ్‌బేడీ, మా నాన్న రోల్‌మోడల్స్‌గా చెప్పవచ్చు. మా సొంత రాష్ర్టం జార్ఖండ్. నా భర్త ఐఎఎస్. ఆయన పేరు బీ.ఎం.ఎక్కా మా ఇద్దరిది 1995 బ్యాచ్. అలా మా ఇద్దరికీ పరిచయం అయ్యింది. నాకు ఇద్దరు పిల్లలు. నా మొదటి పోస్టింగ్ (ఎఎస్పీ)గా రాంచీలో వస్తే మా వారికి సబ్ కలెక్టర్‌గా ఆంధ్రపదేశ్ పాడేరులో పోస్టింగ్ వచ్చింది. అప్పడు సెల్ఫోన్లు లేవు. నాకు అప్పట్లో తెలుగు రాదు. అప్పటి నుంచి తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను. నాకు ఎక్కువ చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. మా వారికి ఇండియన్ వంటకాలంటే ఇష్టం. మా పెద్ద పాప పుట్టినప్పడు నేను చాలా సంతోషపడ్డాను. ఖాళీ సమయం పిల్లలతో గడుపుతాను.
![]() |
|
![]() |
|
![]() |