Breaking News

మతమంటే మనిషికి,మనిషి మధ్యన ఒక అడ్డుగోడ

Apr 07, 2017 10:55
మతమంటే మనిషికి,మనిషి మధ్యన ఒక అడ్డుగోడ

"మతి"నుండి పుట్టినది "మతం" అంటారు కొందరు. 
మతమంటే అందరికీ సమ్మతమంటారు కొందరు.
నేనంటాను....... 
మతమంటే మనిషికి,మనిషి మధ్యన ఒక అడ్డుగోడ.దూరాన్ని
పెంచిన ఒక అగాధలోయ.మానవత్వాన్ని మసిచేసి,దానవత్వాన్ని పెంచిన ఒక విషభీజము. హింసను ప్రేరేపించి,ఉన్మాదము నింపిన
ఒక విష గులిక,మానవ సమూహాన్ని నిట్టనిలువున చీల్చిన కఠినకరవాలము. మతోన్మాదములో మనిషి మానవవాదాన్ని మరిచి
పోయాడు. 
ప్రకృతిలో ఏ క్రిమి,కీటక,జంతువులు తమ జాతిని ద్వేషించవు. చంపవు. కాని మతవిషజ్వాలల్లో చిక్కినమనిషి తన జాతి పైననే పగ పెంచుకుంటున్నాడు. తోటి మనిషినే అసహ్యించుకుంటున్నాడు. పక్క వాడు ఏమైనా సరే తన స్వార్థము.తన లాభము తన సంపాదన,తన కోసము డబ్బు సంపాదింఛుకుంటున్నాడు. పీల్చే గాలి పాడైనా సరే,తినే ఆహారము కల్తీ అయినా సరే,తాగడానికి నీటి కరువు వచ్చినా సరే, డబ్బు కూడబెట్టుకోవడంలోనే అలోచిస్తున్నాడు. "మతం"సెంటిమెంటుతో,అర్థములేనిఆచారాలతో,అనవసరనియమాలతో,ఊహల్లోనే ఉన్నదేవుడిని అడ్డం పెట్టుకొని ఆయన పేరుతో అనేక
దారుణాలకు ఒడిగడుతున్నారుమతపెద్దలు. మతప్రచారకులు, 
మతగురువులమని దోపిడీకి ఎగబడుతున్నారు.దైవసేవల పేరిట జేబులు ఖాళీచేస్తున్నారు. ఇంటికి రమ్మంటే ఇరవైవేలు,కాళ్ళుపట్టుకుంటే పదివేలు,ఆశీర్వచనానికి ఒకరేటు ఇలా ధరలు కూడా నిర్ణయించేస్థాయికి వీళ్ళ స్వార్థంపరాకాష్టకు
చేరుకుంది. అమాయక ప్రజలు వారు చెప్పింది అంతా నిజమని,
పై వేషాలు చూసి "భ్రాంతి" పడుతున్నారు. మత చాందసవాదులు తమ మత గ్రంథాల్లోని విషయాలను పదే పదే వల్లిస్తూ,అవే నిజమైన మానవధర్మాలుగా కంఠం తెగేటట్టు వాదిస్తుంటారు. ప్రజలను మూర్ఖులుగా తయారుచేస్తారు. వారి అనర్గళ వాగ్ధాటికి ప్రజలు నోళ్ళు కట్టుబడిపోతాయి. పేరుమోసిన మేధావులు,పండితులు, రాజకీయనాయకులు,ధనవంతులు సైతం వీరి మాటల మాయలో సర్వం మరిచి సాష్టాంగ దండాలు పెడుతున్నారు. వీరు ఆడిందే ఆట.పాడిందేపాట. ఇదేమంటే వారిని తొక్కేస్తారు. సన్యాసుల, సాధువులనీచ,స్వార్థపూరిత,వ్యాపార అశ్లీల,నేరపూరిత లావాదేవీలు
భయటపడినా ప్రజలు ఇంకా వారినే నమ్మడంచాలా ఆశ్చర్యకరమైన విషయం.శాస్త్రీయత అద్భుతంగా పెరిగిపోయినా
ప్రజల్లో మూఢాచారాలు,అశాస్త్రీయ నమ్మకాలు,అహేతుక విధానాలు,పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. పాలకులకు,పండితులకు ప్రజలు మూర్ఖులుగా,మూడులుగా ఉండడమే ఇష్టం..ప్రజలకు తెలివి పెరిగితే తమను ప్రశ్నిస్తారని భయపడతారు.తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని వణికిపోతారు. అందుకే మిత్రులారా!
వాస్తవదృష్టిని అలవరచుకోండి. వివేకాన్ని,విచక్షణతో ఆలోచించండి. మిమ్మల్ని మోసగించే వారినిజస్వరూపాన్నితెలుసుకోండి. అప్రమత్తంగా ఉండండి. వేషాలను చూసి మోసపోకండి. మాటల మత్తులో మునిగిపోకండి.వారి ప్రవర్తనలను,జీవనవిధానాన్ని గమనించండి. అంతిమ నిర్ణయం మీదే. మీకు మీరే న్యాయాధికారులు.మీ మనస్సే మీకు సాక్షి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. కర్తలు మీరే. కర్మ(పని)మీదే. ఫలితము అనుభవించేది మీరే.అలోచించండి. అడుగేయండి. ఆదర్శంగా నిలవండి.--అడియాల శంక

Facebook like
Google Plus Circle
Youtube Subscribe