Breaking News

రహస్యాలు

Nov 30, 2014 01:21
 రహస్యాలు

ఏ స్వీట్స్ చేసినా సరే ఇలాయిచీలు యాడ్ చేస్తే ఆ టేస్టే వేరు. ఫుడ్‌కి టేస్ట్‌ను ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. ఇవి శరీరానికి చలువనిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్న వారు ఏదో ఓ రూపంలో ఇలాయిచీలను తినాలి. వికారం, ఆకలిలేకపోవడం, కడుపుబ్బరం లాంటి వాటి సమస్యలతో బాధపడుతుంటే వీటిని తింటే తగ్గుంది. నోటి దుర్వాసనను తగ్గించడమే కాదు నోటి అల్సర్లు, ఇన్‌ఫెక్షన్స్ కూడా నయం చేస్తుంది. దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలాయిచీ తరుచూ తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. యాలకుల తైలం పంటినొప్పిని తగ్గిస్తుంది. ఆస్తమా రోగులు యాలకులు, తులసి, అల్లం ముక్క, లవంగాలు కలిపిన కషాయాన్ని కలిపి తాగితే ఉపశమనం దొరుకుతుంది. యాలకులను బాగా నూరి నుదురుకు పూతగా పూస్తే తలనొప్పి చిటికెలో మాయం అవుతుంది. యాలకుల కషాయం తాగితే దగ్గు తగ్గుతుంది. అంతేకాదు రోజూ ఇలాయిచీలను తింటే బరువు తగ్గుతారు.

లవ్లీ లవంగాలు

గుండెల్లో మంటగా అనిపిస్తోందా? పంటినొప్పి బాధిస్తోందా? జలుబుతో సతమతమవుతున్నారా? ఇకపై ఆందోళన చెందకండి. ఒకసారి మీ వంటింట్లోని పోపుల పెట్టెలోకి చూడండి. నల్లని పూమొగ్గల్లాంటి లవంగాలు కనిపించాయిగా. లవంగాలు అద్భుత ఔషధ సుగంధ ద్రవ్యాలు. వీటిలో వాసనే కాదు విలువైన పోషకాలు కూడా ఉంటాయి. మొటిమలు, రాషెస్, దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు లవంగం నూనె ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. 

<span style="\&quot;font-size:13px;" line-height:1.6em\"="">దోమల్ని దరి చేరనివ్వదు. లవంగాల్లోని యుజెనాల్ దగ్గుకు విరుగుడుగా పని చేస్తుంది. రోజుకు రెండు లవంగాలు తింటే తెల్ల రక్తకణాలు పెరుగుతాయి. మూడు లీటర్ల నీళ్లలో నాలుగు గ్రాముల లవంగాలు వేసి మరిగించిన ఆ కషాయాన్ని తాగితే కలరా, విరేచనాలు తగ్గుతాయి. పాలలో లవంగం పొడి, ఉప్పు కలిపి నుదుటి మీద ప్యాక్ వేసుకుంటే తలనొప్పి దరి చేరదు. లవంగాల డికాషన్‌లో కొంచెం తేనె కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. అయితే లవంగాలను రోజుకు ఐదు మాత్రమే తీసుకోవాలి లేకుంటే వేడి చేస్తుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe