Breaking News

లివర్‌ను కాపాడుకుందాం..!

Aug 31, 2015 20:31
లివర్‌ను కాపాడుకుందాం..!

జీర్ణక్రియ సాఫీగా జరిగినపుడే మిగతా క్రియలు సాఫీగా సాగుతాయి. నచ్చిన ఫుడ్‌ను అమితంగా తిన్నా.. డైట్‌ కంట్రోల్‌ పేరిట కడుపును ఎండబెట్టినా.. జీర్ణక్రియ గాడితప్పుతుంది. పోషక విలువలు మెండుగా ఉన్న ఆహారం మితంగా తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యంతో పాటు మీ జీర్ణాశయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు.  కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా.. వాటిని అరిగించడంలో లివర్‌ ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. ఫైబర్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే.. జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. 

  • పాలకూర, క్యాబేజీలను డైట్‌లో భాగంగా చేసుకుంటే.. లివర్‌ సురక్షితంగా ఉంటుంది. వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే సల్ఫర్‌ జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది. 
  • క్యారెట్‌ ఎక్కువగా తీసుకున్నా జీర్ణాశయానికి మేలు జరుగుతుంది. క్యారెట్‌ ద్వారా లభించే ప్రొటీన్లు లివర్‌లో ఉండే టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. 
  • జీర్ణాశయంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ద్రాక్షపండ్లు విశేషంగా పనిచేస్తాయి. ద్రాక్షలు ఆకలిని కూడా నియంత్రిచగలవు. 
  • కడుపులో మంటకు, అజీర్తికి పసుపు దివ్యఔషధంగా పనిచేస్తుంది. లివర్‌ ఇన్‌ఫెక్షన్స్‌ను అరికట్టడంలో పసుపు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. 
  • ఆల్కహాల్‌ వల్ల జీర్ణాశయానికి కలిగే నష్టాన్ని జింక్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌తో చెక్‌ పెట్టొచ్చు. జింక్‌ పాళ్లు అధిక మోతాదులో ఉండే జీడిపప్పు, గుమ్మడికాయ, సీఫుడ్‌, మష్‌రూమ్స్‌ను డైట్‌లో చేర్చడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు రావు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe