Breaking News

సునీల్ సొంత అన్న‌య్య లాంటివాడు

Jul 07, 2016 01:39 by Admin Admin
సునీల్ సొంత అన్న‌య్య లాంటివాడు

  మ‌హ‌ర్షి పెద్ద వంశీ గారి సినిమా పోస్ట‌ర్ చూసి సినిమాల్లోకి రావాల‌ని అనిపించింది. స్కూల్ కు  అని చెప్పి నేల టికెట్ కొని సినిమాలు చూసే వాడిని. ఒక్కో సినిమా 10-20 సార్లు చూసేవాడిని.  సినిమాలో న‌టించాల‌న్న కోరిక‌తో 4 సంవ‌త్స‌రాలు హైద‌రాబాద్‌లో అవ‌కాశాల కోసం తిరిగి విసిగిపోయి మ‌ళ్లీ  మా ఊరికి వెళ్లిపోయాను.  ఆల‌స్యంగా అవ‌కాశాలు వ‌చ్చినా మంచి పేరు తెచ్చే పాత్ర‌లే చేశాను.  చిరంజీవి 150 సినిమాలో న‌టించాల‌ని ఉంది అంటూ త‌న మ‌న‌సులోని భావాల‌ను మ‌న‌తో పంచుకున్నారు కామెడీ కింగ్‌ ప్ర‌వీణ్‌.

 
 
 కొత్త బంగారం లోకం  నా మొద‌టి సినిమా
సునీల్ షూటింగ్‌ల నిమిత్తం ఈస్ట్ గోదావ‌రి వ‌చ్చేవారు. రెగ్యుల‌ర్‌గా మా వైపు వ‌చ్చిన‌ప్పుడు నాకు ఫోన్ చేసి పిలిచేవారు. అలా మా మ‌ధ్య స్నేహం బ‌ల‌ప‌డింది. ఒక‌రోజు సునీల్ షూటింగ్ ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు దిల్ రాజు గారు న‌న్ను చూశారు. న‌న్ను సినిమాలో న‌టిస్తావా అని అడిగారు. అలా కొత్త బంగారం లోకం సినిమా నా మొద‌టి సినిమా అయ్యింది. 
 
చోటా కె.నాయుడు గారంటే భ‌యం....
మొద‌ట కెమెరా ముందుకు వెళ్ల‌గానే భ‌య‌మేసింది. ఎందుకంటే నాకు చోటా కె.నాయుడు గారంటే భ‌యం. అంత‌కుముందు ఆయ‌న ఇంట‌ర్వ్యూలు చూసి ఉన్నా కాబ‌ట్టి  మొద‌టి వారంరోజులు భ‌యంభ‌యంగా న‌టించాను. ఆ త‌రువాత దిల్ రాజు గారికి ఈ విష‌యం చెప్పాను. దీంతో ఆయ‌న చోటా గారికి ఈ విష‌యం చెప్ప‌డంతో ఆయన నాతో ప్రెండ్లీగా ఉండ‌డం ప్రారంభించారు దీంతో ఆయ‌నంటే నాకు భ‌యం పోయింది. కొత్త బంగారులోకం త‌రువాత పెద్ద వంశీ గారి ద‌గ్గ‌రి నుంచి నాకు పిలుపువ‌చ్చింది. దీంతో ఎగిరిగంతేసి ఆయ‌న్ను క‌లిశాను. గోపి..గోపిక‌..గోదావ‌రి సినిమాలో  నాకు ఆయ‌న‌ అవ‌కాశం ఇచ్చారు.
 
ఎలాంటి బాధ ఉన్నా ఆయ‌న‌తోనే షేర్...
సునీల్ సొంత అన్న‌య్య లాంటివాడు. నాకు ఎలాంటి బాధ ఉన్నా ఆయ‌న‌తోనే నేను షేర్ చేసుకుంటాను. అంద‌రూ క‌మెడీయ‌న్‌లు ఇష్టం.  సునీల్ లాగ పేరు తెచ్చుకుంటావ‌ని  అంద‌రూ అంటుంటే నాకు సంతోషంగా ఉంటుంది. సునీల్ ద్వారా నాకు ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్ గారు ప‌రిచ‌యం అయ్యారు. అలా  త్రివిక్ర‌మ్ గారిని రెగ్యుల‌ర్‌గా క‌లిసేవాడిని. ఆయ‌న న‌న్ను దృష్టిలో  పెట్టుకొని అ-ఆ సినిమాలో నా పాత్ర‌ను మ‌లిచారు.  
 
 ఇప్ప‌టివ‌ర‌కు 90 సినిమాలు....
 ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ నాకు బాగా పేరు తెచ్చింది. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ లో నా న‌ట‌న చూసి కృష్ణ‌వంశీ గారు మెచ్చుకున్నారు. అది నా జీవితంలో మ‌రిచిపోలేని అనుభూతి.  ఇప్ప‌టివ‌ర‌కు 90 సినిమాలు పూర్తి చేశాను. నారా రోహిత్తో రౌడీఫెలో అనే సినిమాలో చాలా క‌ష్ట‌ప‌డి పాత్ర‌లో న‌టించాను. ఆ సినిమా అనుకున్న విధంగా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో నిరాశ‌కు గుర‌య్యాను. చిరంజీవి 150 సినిమాలో న‌టించాల‌ని ఉంది. పెద్ద‌ ఎన్టీఆర్ గారితో న‌టించ‌లేక‌పోయాన‌ని అసంతృప్తి మాత్రం ఉండిపోయింది. ఇండ‌స్ర్టీలో ఎప్ప‌టిక‌ప్పుడు అఫ్‌డేట్ కాక‌పోతే వెనుక‌బ‌డి పోతాం.  
 
 కామెడీ అంటేనే ఇష్టం
హీరోగా చేయాల‌ని లేదు. నాకు కామెడీ అంటేనే ఇష్టం. మాది వ్య‌వసాయం కుటుంబం. మా నాన్న‌గారు చిన్న‌ప్పుడే చ‌నిపోయారు. ప్రేమం, మ‌న‌మంతాల‌తో పాటు రాజ్‌త‌రుణ్ హీరోగా రెండు సినిమాల్లో న‌టిస్తున్నాను. రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ గారి సినిమాలో న‌టించాల‌ని ఉండేది.  త్రివిక్ర‌మ్ గారి సినిమాలో న‌టించాల‌న్న కోరిక నెర‌వేరింది. కానీ రాజ‌మౌళి సినిమాలో మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈగ సినిమాలో నాకు అవ‌కాశం వ‌చ్చింది కానీ అప్ప‌డు నాకు డేట్స్ స‌ర్థుబాటు కాలేదు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe