Breaking News

కబాలి రివ్యూ...

Jul 22, 2016 16:14 by Admin Admin
 కబాలి  రివ్యూ...

  కబాలి  రివ్యూ... www.crazyenews.com రేటింగ్‌ : 2.5/5

తారాగ‌ణం.. ర‌జ‌నీకాంత్‌, రాధికా ఆఫ్టే, ధ‌న్సిక‌, కిషోర్‌, దినేష్ ర‌వి, నాజ‌ర్‌, విన్‌స్ట‌న్ చావ్ త‌దిత‌రులు.. 
మాట‌లు..పా.రంజిత్, సాహితి
సంగీతం..సంతోష్ నారాయ‌ణ్‌
కూర్పు..ప్ర‌వీణ్ కె.ఎల్‌.
ఛాయాగ్ర‌హ‌ణం..జి.ముర‌ళీ
నిర్మాత ...ఎస్‌.థాను
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం..పా.రంజిత్‌
 
కబాలి (రజనీ కాంత్).. మలేషియాలో ఓ పెద్ద గ్యాంగ్‍స్టర్. ఓ కేసులో పోలీసుల చేతికి చిక్కిన అతడు, 25 ఏళ్ళ పాటు జైలు జీవితం గడిపి, తిరిగి బయట ప్రపంచానికి అడుగుపెట్టడంతో కథ మొదలవుతుంది. కబాలి బయటకు రావడంతోనే అతడ్ని చంపాలని ఏళ్ళుగా ఎదురుచూస్తున్న వాళ్ళంతా తిరిగి దాడి చేయడం మొదలుపెడతారు. ఇక 25 ఏళ్ళ క్రితం తాను దేనికోసమైతే పోరాడాడో ఆ సమస్య ఇప్పటికీ అలాగే ఉండడం గమనించిన కబాలి, మళ్ళీ తన గ్యాంగ్‍స్టర్ జీవితాన్ని మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి?  మలేషియాలో ఏళ్ళుగా అలాగే ఉన్న సమస్యపై కబాలి ఎలా పోరాడాడు?  చివరకు కబాలి కథ ఏమైందీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
రజనీ గతంలో చేసిన సినిమాలన్నింటిలానే ఈ సినిమాలోనూ ఆయన చరిష్మానే ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. ఓ వయసైన గ్యాంగ్‍స్టర్‌గా, కబాలి అనే పాత్రలో రజనీ స్టైల్, నటన అన్నీ టాప్ క్లాస్ అనేలా ఉన్నాయి. ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ ఆవేశపరుడైన యువకుడిగానూ రజనీ చాలా బాగా ఆకట్టుకున్నాడు. రజనీ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆయన మ్యానరిజమ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుడు పా రంజిత్, మలేషియాలో జీవించే భారతీయుల బాగు కోసం పోరాడే సన్నివేశాలను, ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లోని ప్రధానమైన ఎమోషన్‌ను చాలా బాగా క్యాప్చర్ చేయగలిగారు.
ఇక తాను అనుకున్న కథను ఎక్కడా అతికి పోనివ్వకుండా వీలైనంత వాస్తవికంగానే ఉండేలా చూసుకోవడంలో పా రంజిత్ సాహసాన్ని మెచ్చుకోవచ్చు. 25 ఏళ్ల తర్వాత జైలు నుంచి రజనీ తన ఇంటికి తిరిగి రావడం, ఎన్నో ఏళ్ళకు కనబడిన కూతురితో అతడి ప్రయాణం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ బలమైన ముద్ర వేశాయి. ఇక రజనీ భార్యగా నటించిన రాధికా ఆప్టే తన నటనతో కట్టిపడేశారు. ధన్సిక తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. ర‌జ‌నీకాంత్ కూతురి పాత్ర  చాలా కీల‌కం.ఆ పాత్ర‌లో ధ‌న్సిక పూర్తిగా తేలిపోయింది.   విలన్స్‌గా నటించిన విన్‍స్టర్ చౌ, కిషోర్.. ఇద్దరూ మంచి ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా చౌ స్టైలిష్ నటన చాలా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథా వేగం చాలా నెమ్మదిగా నడవడాన్ని ప్రధానమైన ప్రతికూలాంశంగా చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో సినిమా మరీ నెమ్మదిగా నడిచి చాలాచోట్ల బోర్ కొట్టించింది. అదేవిధంగా ఓ బలమైన కథాంశాన్నే ఎంచుకున్న దర్శకుడు, దాన్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో విఫలమయ్యాడు. 
 
సంతోష్ నారాయణ్ అందించిన ఆడియోలో ‘నిప్పు రా’ ఇట్టే ఎక్కేస్తుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సంతోష్ నారాయణ్ ప్రతిభను ఈ సాంకేతిక అంశాల పరంగా మేజర్ హైలైట్‌గా చెప్పుకోవాలి. జి.మురళి సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన సినిమాటోగ్రఫీ స్టైల్‌తో దర్శకుడి ఆలోచనకు, కథ మూడ్‌కు మురళి ఓ సరికొత్త రూపాన్నిచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. కళైపులి థాను నిర్మాణ విలువలకు ఎక్కడా వంకన్నదే పెట్టలేం.
తీర్పు :
‘కబాలి’.. రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్‌ని పెట్టుకొని ఓ వాస్తవిక కథతో సినిమా తీయాలన్న దర్శకుడు పా రంజిత్ ఆలోచన నుంచి పుట్టిన సినిమా. ఈ ఆలోచన మెచ్చుకోదగినదే అయినా, అలాంటి వాస్తవిక కథలోనూ, రజనీ ఇమేజ్‌కు సరిపడేలా సన్నివేశాలు పెట్టుకునే అవకాశం ఉంటుందని తెలిసీ, వాటి జోలికి పోకపోవడం ఈ సినిమా విషయంలో జరిగిన తప్పిదంగా భావించొచ్చు. రజనీ సినిమాలో ఏయే అంశాలు ఉంటాయనుకొని ప్రేక్షకులు ఆశించి వెళతారో అవన్నీ ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో లేవు.  నిర్సుతాహ‌ప‌రిచేలా ఉన్న క‌బాలి రిలీజ్‌కు ముందు ఉన్న మెగా హైప్‌తో బాక్సాపీస్‌ని ఎన్ని రోజులు ఏలుతాడో చూడాలి. త‌న క‌థ‌ని ద‌ర్శ‌కుడు ఆస‌క్తిగా చెప్పేందుకు కాస్త‌యినా ప్ర‌య‌త్నించ‌లేదు. ఈ డొల్ల సినిమాను సినిమాను నిల‌బెట్ట‌డానికి ర‌జ‌నీకాంత్ త‌న వంతు ప్ర‌య‌త్నం చేశారు కానీ అది ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు ఆద‌రిస్తారో చూడాలి మ‌రీ...

Facebook like
Google Plus Circle
Youtube Subscribe