Breaking News

సామాన్యుడికి సైతం కంప్యూట‌ర్‌

Apr 14, 2016 00:00 by Admin Admin
 సామాన్యుడికి సైతం కంప్యూట‌ర్‌

 

డిజిట‌ల్ ఇండియా ప్ర‌స్తుతం అంద‌రి నోటా ఇదే మాట‌....ప్ర‌ధాని నుంచి సామాన్యుడి దాకా ఇదే జ‌పం...సామాన్యుడికి సైతం కంప్యూట‌ర్‌ను  అందించాల‌న్న‌దే విద్యాయంత్ర ధ్యేయం. దీనికోసం జ‌గ‌దీష్, మిథున్ అనే ఇద్ద‌రు మిత్రులు నడుంబిగించారు. ప్ర‌స్తుతం కంప్యూట‌ర్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు కొనాలంటే సామాన్య జ‌నానికి త‌ల‌కు మించిన భారంగా మారింద‌ని అలాకాకుండా అంద‌రికీ కంప్యూట‌ర్ విద్య‌ అందించాల‌న్న ఉద్దేశ్యంతో ఈ సంస్థ‌ను నెల‌కొల్పామ‌ని మిథున్‌గుప్తా తెలిపారు. 
 
సాఫ్ట్‌వేర్ కంపెనీల నుంచి 
సాఫ్ట్‌వేర్ కంపెనీల నుంచి కొన్ని వేల కంప్యూట‌ర్‌ల‌ను కొనుక్కుంటామ‌ని మిథున్ తెలిపారు. వాటిలో ప‌నికిరాని వాటిని స్క్రాప్ కింద విపియోగిస్తామ‌ని మాములు రిపేర్ ఉన్న వాటిని త‌క్కువ ధ‌ర‌కు అంద‌చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా 100 కంప్యూట‌ర్‌ల‌ను పేద విద్యార్థుల‌కు ఉచితంగా అందించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు.
 
అక్టోబ‌ర్ 2015 సంవ‌త్స‌రంలో ప్రారంభం
అక్టోబ‌ర్ 2015 సంవ‌త్స‌రంలో విద్యాయంత్ర‌ సంస్థ‌ను ప్రారంభించామ‌ని జ‌గ‌దీష్, మిథున్ తెలిపారు. 2 జీబీ-రామ్‌, 160 హార్డ్‌డిస్క్ గ‌ల ల్యాప్‌ట్యాప్‌ను 9999 రూపాయ‌ల‌కు విక్ర‌యిస్తామ‌ని, పెయింట‌మ్‌-1 జిబి రామ్‌, 80 జిబి హార్డ్‌డిస్క్‌గ‌ల కంప్యూట‌ర్‌ను 2999 రూపాయ‌ల ధ‌ర నిర్ణ‌యించామ‌ని వారు తెలిపారు.దీనికోసం గ‌చ్చిబౌలిలో కంప్యూట‌ర్‌ల‌ను, ల్యాప్‌ట్యాప్‌ల‌ను నిల్వ‌చేయ‌డానికి ఒక గోడౌన్ అద్దెకు తీసుకున్నామ‌ని వారు తెలిపారు.
4000 ద‌ర‌ఖాస్తులు
నిరుపేద మెరిట్ విద్యార్థుల‌కు కంప్యూట‌ర్ల‌ను ఉచితంగా అంద‌చేయాల‌న్న సంక‌ల్పంతో మేము ముందుకు వెళుతున్నామ‌ని మిథున్ తెలిపారు. అందులో భాగంగా 4000 మంది నిరుపేద విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌న్నారు. ఆ ద‌ర‌ఖాస్తులను ప‌రిశీలించి అర్హులంద‌రికీ ఉచితంగా కంప్యూట‌ర్ల‌ను అంద‌చేస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్‌లో ఓ ఇల్లును అద్దెకు తీసుకొని అక్క‌డి నుంచే మా సంస్థ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.
త‌క్కువ లాభంతో ఎక్కువ మందికి కంప్యూట‌ర్లు
త‌క్కువ లాభంతో ఎక్కువ మందికి కంప్యూట‌ర్ల‌ను అందించాలన్న‌దే మా సంస్థ‌ ఉద్ధేశ్య‌మ‌న్నారు, కానీ మా ఉద్దేశ్యం వేరే వాళ్ల‌కు అర్థంకావ‌డం లేద‌ని,  మార్కెట్‌లో వీటిని అమ్మాలంటే చాలామంది వ్యాపారులు దీనిపై ఎంత‌లాభం వ‌స్తుంద‌ని అడుగుతున్నార‌ని వేల రూపాయ‌లు లాభానికి అమ్ముకుంటే పేద‌వాళ్ల‌కు ఎలా కంప్యూట‌ర్ అందుతుంద‌ని మిథున్ వాపోయారు. ఈ విష‌య‌మై వ్యాపారులు అర్థం చేసుకుని త‌క్కువ లాభంతో అంద‌రికీ కంప్యూట‌ర్లు, ల్యాప్‌ట్యాప్‌ల‌ను అందించ‌డానికి క‌`షి చేయాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఎవ‌రైనా ముందుకు వ‌చ్చి త‌క్కువ లాభంతో పేద‌ల‌కు కంప్యూట‌ర్ల‌ను అందించాల‌న్న ఉద్దేశం ఉన్న వారు mithunguptag@gmail.com లేదా 7893334222లో సంప్ర‌దించాల‌ని మిథున్‌గుప్తా తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe