Breaking News

క‌ష్టం, సుఖం విలువ‌ తెలిసిన‌ప్పుడే మ‌నిష

Jul 05, 2016 18:45 by Admin Admin
 క‌ష్టం, సుఖం విలువ‌ తెలిసిన‌ప్పుడే మ‌నిష

క‌ష్టం, సుఖం తెలిసిన‌ప్పుడే మ‌నిషి రాటుతేలుతాడ‌ని,  క‌ష్టాన్ని మ‌నం ఎంజాయ్ చేసిన‌ప్పుడే మ‌న‌కు సుఖం విలువ‌ తెలుస్తుంద‌ని న‌మ్మే ద‌ర్శ‌కుల్లో ఒక‌రు ఆయ‌న‌. ద‌ర్శ‌కుడిగా కావాల‌న్న కోరిక‌తో ఎంఎస్సీ (కెమిస్ర్టీ)ని మ‌ధ్య‌లోనే వ‌దిలివేశారు.  ఆ త‌రువాత‌  సినిమా చూపిస్త‌ మామ అంటూ ఒక పెద్ద హిట్టూ కొట్టి,  నాని హీరోగా దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న సినిమాకు  ద‌ర్శ‌కుడిగా చాన్స్ కొట్టేసిన త్రినాథ్ రావుతో మాటా ముచ్చ‌ట్లు.

నాలో టాలెంట్ గుర్తించింది ద‌ర్శ‌కులు ప్ర‌భాక‌ర్‌

మాది విశాఖ‌ప‌ట్నం జిల్లా కొట్లూరు గ్రామం. అమ్మానాన్న త‌మ్మ‌డూ  అంద‌రూ అక్క‌డే ఉంటారు. నేను హైద‌రాబాద్ వ‌చ్చి 18 సంవ‌త్స‌రాలు. నాకు  సినిమాలంటే ఇష్టం అదే మోజుతో ఇక్క‌డ చాలా సంవ‌త్స‌రాలు ప్ర‌య‌త్నం చేశా.  ఎవ‌రూ నాకు అవకాశాలు ఇవ్వ‌లేదు. స‌హ‌దేవ్ అనే ఒక వ్య‌క్తి వ‌ల్ల టి.ప్ర‌భాక‌ర్ గారు ప‌రిచ‌యం అయ్యారు.  నీవు బీఎస్సీ చ‌దివి సినిమాలో చేయ‌డానికి వ‌చ్చావా, టీచ‌ర్ ఉద్యోగం చేసుకోవ‌చ్చుగా  త్రినాథ్ అంటూ ప్ర‌భాక‌ర్ గారు నాతో అన్నారు. అప్పుడు నేను ఇలా అన్నాను. సార్ నాకు సినిమాలు అంటే ఇష్టం ఒక్క అవ‌కాశం ఇవ్వండి అన్నాను.  అలా నాకు మొద‌ట‌గా అవ‌కాశం ఇచ్చి, నాలో ఉన్న టాలెంట్‌ను గుర్తించింది  ద‌ర్శ‌కులు టి.ప్ర‌భాక‌ర్‌గారే. నేను మొద‌ట‌గా  టి. ప్ర‌భాక‌ర్ గారు తీసిన మీనాక్షి సినిమాకు నేను ఆయ‌న వ‌ద్ద అసిస్టెంట్‌గా చేరాను.  త‌రువాత బ‌తుక‌మ్మ సినిమాకు కూడా ప‌నిచేశాను. బ‌తుక‌మ్మ సినిమా త‌రువాత నేను 3 సినిమాల‌కు కో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాను.  పిల్ల జ‌మీందార్ ద‌ర్శ‌కులు అశోక్ గారి సినిమాకు కూడా  ప‌నిచేశాను. 

మొద‌ట‌గా ఈ క‌థ‌ను తెలంగాణ వెర్ష‌న్‌లో రాశాను

 సినిమా చూపిస్త మామ సినిమా ఇంత హిట్ అవుతుంద‌ని నేను అనుకోలేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే మాస్ ట‌చ్ హీరో అయితే బాగుంటుంద‌ని అని డిసైడ్ అయ్యాను. నేను మొద‌ట‌గా ఈ క‌థ‌ను తెలంగాణ వెర్ష‌న్‌లో రాశాను. కానీ రాజ్‌త‌రుణ్ హీరోగా చేసిన సినిమాలో ఆయ‌న శ్లాంగ్ వేరేలా ఉంటుంది. దీంతో రాజ్‌ను దృష్టిలో పెట్టుకొని కొంచెం మార్పులు చేశాను. 

ఆయ‌నంటే నాకు అభిమానం. 
నాకు తెలంగాణ‌కు చెందిన వ్య‌క్తులే స్నేహితులు ఎక్కువగా ఉన్నారు. వారితోనే నాకు ఎక్కువ‌ స‌త్స‌సంబంధాలున్నాయి. నా మొద‌టి సినిమా నిర్మాత‌ బెక్కం వేణుగోపాల్‌ కూడా తెలంగాణ వారే.  ఆయ‌నంటే నాకు ప్ర‌త్యేక‌మైన అభిమానం.  ద‌ర్శ‌కుడిగా చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ప్పుడు కేదారి లక్ష్మ‌న్ అనే స్నేహితుడు ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న నిర్మాత‌గా ఒక  సినిమా చేద్దామ‌ని తిరుగుతున్నాం. ఆ సందర్భంలోనే బెక్కం వేణుగోపాల్  ప‌రిచ‌యం అయ్యారు. దీంతో అప్ప‌డు మేంవ‌య‌స్సుకు వ‌చ్చాం సినిమా తీశాం. ఈ సినిమా బాగానే ఆడింది. దీంతో మా స్నేహం చాలా బ‌ల‌ప‌డింది. ఈ సినిమా త‌రువాత వేరే 2 సినిమాలు చేశాను. 

ఇద్ద‌రం క‌లిసి ప‌నిచేశాం.
ప్ర‌భాక‌ర్ గారి వ‌ద్ద అసిస్టెంట్‌గా చేసే సంద‌ర్భంలో ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది ప‌రిచ‌యం అయ్యారు. ఇద్ద‌రం క‌లిసి  ప‌నిచేశాం. మా ఇద్ద‌రి ఆలోచ‌లు ఒక్కేలా ఉండ‌డం వ‌ల‌న మా మ‌ధ్య స్నేహం బ‌ల‌ప‌డింది. ఇద్ద‌రం మా క‌ష్ట‌సుఖాల‌ను ఒక‌రికొక‌రం పంచుకుంటాం.  సంప‌త్‌నంది ఎప్పుడూ న‌వ్వుతూనే ఉంటారు. అదే ఆయ‌న విజ‌య‌ర‌హ‌స్యం అని చెప్ప‌వ‌చ్చు. మ‌న స‌క్సెస్సే మ‌న‌ను ఒక మెట్టు పైకి తీసుకెళుతుంద‌ని నేను న‌మ్ముతాను.ఇచ్చిన మాట మేర‌కు...
 సినిమా చూపిస్త మామ  రిలీజ్ కాక‌ముందు దిల్‌రాజు గారు ఈ సినిమా చూసి  నాతో ఓ సినిమా చేయాల‌ని అన్నారు. సినిమా హిట్ అయిన త‌రువాత చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి కానీ నేను  రాజు గారికి ఇచ్చిన మాట మేర‌కు ఆయ‌న‌తో కలిసి ఈ సినిమా చేస్తున్నా. ఈ సినిమాలో నాని, హీరోగా న‌టిస్తున్నారు. సంగీతం దేవిశ్రీ ప్ర‌సాద్ అందిస్తున్నారు. ఈ సినిమా త‌రువాత బెక్కం వేణుగోపాల్‌తో సినిమా చేయాల్సి ఉంది.అనంత‌రం మారుతి టాకీస్‌లో ఒక సినిమాకు సంత‌కం చేశాను. నేను ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సినిమాల‌కు నేనే క‌థ‌ను అందించాను. దిల్ రాజు గారి సినిమాకు మాత్రం ప్ర‌స‌న్న‌కుమార్‌ క‌థ‌ను అందించారు.  ఎప్పుడూ నేను రాసిన క‌థ‌ల‌తోనే సినిమా చేస్తానంటే కుద‌ర‌దు క‌దా.  

ప్రేక్ష‌కుల‌కు ఏది కావాలో అదే చూపిస్తా
నేను ఎక్కువ మాట్లాడ‌ను ప్రేక్ష‌కుల‌కు ఏది కావాలో అదే చూపిస్తా.   సినిమాలో కామెడీ ఒక భాగం మాత్ర‌మే అని న‌మ్ముతాను.  పెద్ద హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్‌ సినిమా చేయాల‌ని ఉంది. నేను చిరంజీవి అభిమానిని. ఆయ‌న‌తో ఓ సినిమా చేయాల‌న్న‌  ఆలోచ‌న ఉంది. నేను మొద‌ట‌గా ద‌ర్శ‌కుడిగా కావాల‌నే ఉద్ద‌శ్యంతోనే హైద‌రాబాద్ వ‌చ్చాను. మొత్తం మీద ఆ క‌ల నెర‌వేర్చుకున్నాను. నేను తీసిన సినిమాలో క‌థ‌ హీరో చుట్టూ  తిరుగుతుంది.


Facebook like
Google Plus Circle
Youtube Subscribe