Breaking News

ఒక‌రు ప‌ల్ల‌వి....మ‌రొక‌రు చ‌ర‌ణం...

Jul 07, 2016 01:36 by Admin Admin
 ఒక‌రు ప‌ల్ల‌వి....మ‌రొక‌రు చ‌ర‌ణం...

ఒక‌రు ప‌ల్ల‌వి అయితే మ‌రొక‌రు చ‌ర‌ణం. ఒక‌రు ఎంబీఎ చేస్తే మ‌రొక‌రు ఎంసీఎ చేశారు. ఇద్ద‌రిది వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట మండ‌లం కొమరంవంచ‌ గ్రామం. వీరి స్నేహం మాత్రం హైద‌రాబాద్‌లో బ‌ల‌ప‌డింది.. వారే సిద్దూ, వీరులు.  సినిమాను ప్రాణంగా ప్రేమించే వీళ్లు స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం వారు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి ఫిలింన‌గ‌ర్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక మంచి సంగీత ద‌ర్శ‌కుడు త‌గిలితే దుమ్ము రేపుతామ‌ని ఘంటాప‌థంగా చెబుతున్నారు. 

 
ఇద్ద‌రం క‌లిసి రాసిన మొద‌టి పాట
 
మ‌నిషి...మ‌నిషి మ‌న‌సును తెర‌చి చూడ‌ర లోకాన్ని... నేల‌ను విడిచి సాము చేయ‌త‌ల‌చి చేర‌కు చుక్క‌ల‌నీ..నీకు నీవు రాజ‌నుకుంటే త‌ప్పేమీ కాదురా...ఎదుటివారిని ఎర్రోని చేసి పిచ్చోడి అవ‌కురా... అంటూ  మేము ఇద్ద‌రం క‌లిసి మొద‌ట‌గా రాశాం. ఈ పాట రాయ‌డం వెనుక కార‌ణం  స‌మాజానికి మా ఫీలింగ్ చెప్పాల‌న్న‌దే మా కోరిక‌. మాకు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రీ గారంటే చాలా ఇష్టం. ఆయ‌న పాట‌లు విన్న‌ప్పుడ‌ల్లా మా లో ఉత్తేజం క‌లుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే  ఆయ‌నే మాకు ప్రేర‌ణ‌. సంగీత ద‌ర్శ‌కుల్లో ఇళ‌య‌రాజా గారి త‌రువాత దేవిశ్రీ‌ప్ర‌సాద్ గారంటే  చాలా ఇష్టం. 
 
10 సినిమాలకు వ‌ర‌కు పాట‌లు రాశాం...
ఇప్ప‌టికే 10 సినిమాలకు పాట‌లు రాయ‌డంతో పాటు కొన్ని ప్రైవేటు ఆల్భ‌మ్‌ల‌కు సైతం మేము ప‌నిచేశాం.  ఇప్ప‌టివ‌ర‌కు  అనఅన‌గా అలా జ‌రిగింది, ఐస్‌క్రీమ్‌-2, ఖ‌న‌నం, క‌న్న‌య్య‌, నేనొర‌కం, కోమ‌లి, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ‌ల‌తో పాటు ప‌లు ప్రైవేటు ఆల్బ‌మ్‌ల‌కు పాట‌లు రాశాం. మేము ఎక్క‌డా శిక్ష‌ణ తీసుకోలేదు. మ‌మ్మ‌ల్ని మొదట భాస్క‌ర‌భ‌ట్ల గారు ప్రోత్స‌హించారు. ఆయ‌న ఇచ్చిన ప్రోత్సాహంతో మా క‌లానికి ఇంకా ప‌దునుపెట్టాం. 
 
చాలామంది సంగీత ద‌ర్శ‌కులను క‌లిశాం
మేము చాలామంది సంగీత ద‌ర్శ‌కులను క‌లిశాం. మేము రాసిన పాట‌ల‌ను చాలామందికి వినిపించాం. కొన్నిచోట్ల మాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చినా కొన్నిచోట్ల అస‌లు మా పాట‌ను విన‌ని వాళ్లు కూడా ఉన్నారు. మ‌న ద‌గ్గ‌ర రాసే స‌త్తా ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా ఆద‌రిస్తార‌ని మేము న‌మ్ముతున్నాం. అదేవిధంగా మేము ప్ర‌తి పాట విష‌యంలో క‌ష్ట‌ప‌డుతాం.  అన్ని ర‌కాల పాట‌లను రాయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం.
 
భార‌తీయ సంస్కృతి గురించి ఒక పాట‌ను రాశాం
భార‌తీయ సంస్కృతి గురించి ఒక పాట‌ను రాశాం. దిగ‌జారిపోతున్న విలువ‌లు మ‌న క‌ట్టుబాట్ల‌ను తెలియ‌చెప్ప‌డానికి ఈ పాటను రాయాల్సి వ‌చ్చింది. రెహ్మాన్ గారి సినిమాకు పాట‌ల‌ను రాయాల‌ని మా చిర‌కాల‌ కోరిక. మేము రాసే ప్ర‌తిపాట సంగీత ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌రికి వెళ్ల‌లోపు మాకు మేమే జ‌డ్జిమెంట్ చేసుకుంటాం. ఎక్క‌డ పాట‌ను మార్చాలో ఇద్ద‌రం క‌లిసి చ‌ర్చించుకొని మార్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం.
 
మా బాధ‌లు పాట‌ల రూపంలో....
మా కుటంబ ప‌రిస్థితుల నేప‌థ్యం వ‌ల్లే మా నుంచి ఈ పాట‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మా బాధ‌ల‌ను ఇలా పాట‌ల రూపంలో రాస్తున్నామ‌ని ఒక విధంగా చెప్ప‌వ‌చ్చు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని పాట‌ రూపంలో రాశామ‌ని ఆయ‌న‌కు ఆ పాట వినిపించాల‌ని ఉంద‌న్నారు. ఒక్కోసారి సంగీత ద‌ర్శ‌కులు ఒక్క పాట రాయ‌మ‌ని చెప్పి మాతో ఎక్కువ పాట‌ల‌ను సైతం రాయించుకున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe