Breaking News

మన సంప్రదాయం

Oct 31, 2016 03:21 by Admin Admin
మన సంప్రదాయం

దీపావళి అందరు బాగా జరుపుకున్నటున్నారు.ధన త్రయోదశి నాడు బంగారు వస్తువులు కొన్నారా?అమ్మాయిలు బాగా కొనుంటారు.నరకాసురుడి వధ చూశారా?నాకు తెలిసి  చాలా తక్కువ మంది చూసుంటారు.దీపావళి నాడు లక్ష్మీ పూజ చేశారా?గుళ్ళలో,షాపుల్లో చేసుంటారు.ఏంటి ఇంకా ముఖ్యమైనది టపాసులు పేల్చారా అని అడగలేదనుకుంటున్నార?ప్రకృతిని నాశనం చేయడం మనకు చాలా ఇష్టం కాబట్టి అడిగిన అడక్కపోయిన ఆ పని కచ్చితంగా చేసే ఉంటారు అందుకే అడగలేదు.సరె సరె దీని గురించి వదిలేయండి.గుడికి వెళ్ళారా? అయితె ఏ  దుస్తులను ధరించి వెళ్ళారు?నాకు తెలిసి అందరు భారతీయ సంప్రదాయ దుస్తులు జీన్స్,టీ షర్టు ,త్రీబైఫోర్త్ ధరించి వెళ్ళారు కదా !అమ్మాయిలు మీరు కూడా అవే ధరించారు కదా !గ్రేట్ అయితే వినండి .

ఈ ఫోటోలోని ఇద్దరు మన దేశం వారు కాదు కానీ మన దేశ సంప్రదాయాల పై మక్కువతో మన దేశానికి వచ్చి  వాటన్నిటి గురించి తెలుసుకొని,వాటిని అనుసరించడం మొదలు పెట్టారు .దీపావళి సందర్బంగా చిలుకూరు బాలాజీ గుడిలొ మన సంప్రదాయ దుస్తులు ధోతి ధరించి సంకీర్తనలు చేశారు .నేను "మీరు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు "అని అడిగితే.మాకు భారతీయ సంప్రదాయాలన్న భారతదేశమన్న ఎంతో ఇష్టం అని తెలుగులొ అచ్చమైన తెలుగులొ చెప్పారు.దీన్నిభట్టి తెలుస్తుంది నిజమైన భారతీయులు ఎవరో!ఫారిన్ కల్చర్ అంటు మన సంప్రదాయాలను మనం మర్చిపోతుంటె ఎక్కడ్నుంచో వచ్చినవారు మనకు మన సంప్రదాయాలనే నేర్పిస్తున్నారు.ఇది మనం సిగ్గు పడవలసిన విషయం.కల్చర్ అనేది మొదలైందే మన భారతదేశంలో అలాంటి కల్చర్ ని వదిలేసి ఇతర దేశాల వైపు చూస్తున్నాం.ఇకనైనా మేల్కోండి గుడికైన మన సంప్రదాయ దుస్తులలో వెళ్ళండి .
               ఏ దేశమేగిన ఎందు కాలిడిన
               పొగడర నీ దేశ భుమి భారతిని
               నిలపర నీ దేశ నిండు గౌరవము 
                              జై హింద్

                                      
            
                                               BY
                                     SAAI GIREESH

Facebook like
Google Plus Circle
Youtube Subscribe