Breaking News

క‌దిలివ‌చ్చిన క‌న‌క‌దుర్గ

Aug 14, 2016 10:04 by Admin Admin
 క‌దిలివ‌చ్చిన క‌న‌క‌దుర్గ

 

మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌డానికి క‌దిలివ‌చ్చిన క‌న‌క‌దుర్గ ఆమె. న్యూజిలాండ్‌లో 13 సంవ‌త్స‌రాలు కౌన్సెలింగ్ సెంట‌ర్‌లో ప‌నిచేసి ఇక్క‌డ‌కు వ‌చ్చారు. ఇండియా వ‌చ్చిన త‌రువాత ఇక్క‌డ మ‌హిళ‌ల గురించి ఏదైనా చేయాల‌న్న త‌ప‌న‌తో భ‌రోస సెంట‌ర్లో అడ్మినిస్ర్టేటీవ్ ఆఫీస‌ర్‌గా చేరారు. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను చూసి ఇంకా మ‌హిళ‌ల్లో, స‌మాజంలో మార్పులు రావాల‌ని ఆమె భావించారు. దానికోసం త‌న‌వంతు కృషి చేస్తూ భ‌రోస సెంట‌ర్‌ను ముందుకు తీసుకెళుతున్నారు క‌న‌క‌దుర్గ క‌లిదిండి. భ‌రోస సెంట‌ర్‌కు వ‌చ్చే కేసుల గురించి, ఇక్క‌డ వ‌స‌తుల గురించి ఆమె మాట‌ల్లోనే.....
 ఆ స‌మ‌యంలో చాలా ఇబ్బందులు...
 
13 సంవ‌త్స‌రాలు న్యూజిలాండ్‌లోని కౌన్సెలింగ్ సెంట‌ర్‌లో ప‌నిచేశాను. ఇండియాకు వ‌చ్చి 5 సంవ‌త్స‌రాలు అయ్యింది. 2 సంవ‌త్స‌రాల క్రితం మా భ‌ర్త అనుకోకుండా చ‌నిపోయాడు. ఆ స‌మ‌యంలో చాలా ఇబ్బందులు ప‌డ్డాను. ఆ త‌రువాత ఆస్ట్రేలియా ఇనిస్టిట్యూట్  ఆఫ్ ప్రోఫెష‌న‌ల్ కౌన్సిల‌ర్స్ కౌన్సెలింగ్‌లో డిప్ల‌మా పూర్తి చేశాను. మొద‌ట‌గా ఈ సెంట‌ర్ ప్రారంభం అయ్యిన‌ప్ప‌డు నేను ద‌ర‌ఖాస్తు చేసుకున్నాను. మ‌హిళ‌ల‌కు భ‌రోస ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌తో ఈ సెంట‌ర్లో చేరాను.
 
స‌త్వ‌ర న్యాయం అందించ‌డానికి....
 
 ఇక్క‌డ అన్ని ర‌కాల కేసులు వ‌స్తున్నాయి. అత్యాచారం, భార్యాభ‌ర్త‌లు, హింసకు సంబంధించిన కేసులు ఇక్క‌డ‌కు వ‌స్తున్నాయి. అత్యాచారానికి గురైన మ‌హిళ‌ల‌కు ఇక్క‌డ స‌త్వ‌ర న్యాయం అందించ‌డానికి మేము కృషి చేస్తున్నాం. బాధితులు కోర్టు చుట్టూ తిర‌గ‌కుండా, పోలీస్‌స్టేష‌న్ చుట్టూ తిర‌గ‌కుండా ఇక్క‌డి నుంచే వారికి న్యాయం అందేలా చూస్తున్నాం. బాధితులు త్వ‌ర‌గా కోలుకునేలా వారికి కౌన్సెలింగ్ ఇప్పించ‌డం లాంటివి చేస్తున్నాం. బాధితుల‌కు ఎలాంటి న్యాయం కావాల‌ని వారు చెబుతారో అలా మేము చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.  భార్యాభ‌ర్త‌లు గొడ‌వ‌ప‌డి వ‌చ్చిన‌ప్ప‌డు వాళ్ల‌ను క‌ల‌ప‌డానికే మేము ప్ర‌య‌త్నిస్తాం. 60 శాతం కేసులను కౌన్సెలింగ్ ద్వారా వారిని ఒక‌టి చేసి స‌క్సెస్ సాధిస్తున్నామ‌ని చెప్ప‌వ‌చ్చు.  ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవ‌ల‌ఫ్‌మెంట్ నుండి ఈ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశాం.ఇక్క‌డ‌కు వ‌చ్చే కేసులు చాలెంజ్‌గా ఉంటున్నాయి. అలాంటి వాటిని ప‌రిష్క‌రించ‌డానికి మేము శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాం. న్యూజిలాండ్‌లో మ‌హిళా స‌మ‌స్య‌లు ఎలా ఉన్నాయో ఇక్క‌డా అవే క‌నిపించాయి. అక్క‌డ  ఆ సెంట‌ర్‌ను ప్ర‌భుత్వ‌మే న‌డిపిస్తుంది.  ప్ర‌స్తుతం ఈ సెంట‌ర్లో  వ‌స‌తులు బాగా ఉన్నాయి. 24 గంట‌లు ఈ సెంట‌ర్ తెరిచే ఉంటుంది.  మా ద‌గ్గ‌ర ఉన్న కౌన్సిల‌ర్లంద‌రూ సీనియ‌ర్లే.  కౌన్సిలింగ్ గురించి వ‌చ్చిన వాళ్లు చాలామంది మేము చెప్పేది విన‌రు.. అలాంటి వారికి న‌చ్చ‌చెప్పి మా ప‌ద్ధ‌తిలో కౌన్సెలింగ్ ఇస్తాం. గ‌తంలో ఎన్జీఓస్‌లో ప‌నిచేసిన వారే ఎక్కువ‌గా ఇక్క‌డ ప‌నిచేస్తున్నారు. స‌మ‌స్య‌ల‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు వారి విజ్ఞ‌ప్తి మేర‌కు షెల్ట‌ర్ హోంలో చేర్పించి వారికి పున‌రావాసం క‌ల్పిస్తున్నాం. 
 
త‌రుణి  మాకు టెక్నిక‌ల్ భాగ‌స్వామి.
 
భ‌రోస‌లో త‌రుణి అనే ఎన్జీవో సంస్థ మాకు టెక్నిక‌ల్ భాగ‌స్వామి. భ‌రోస ఏర్పాటులో ఈ సంస్థ ముఖ్య పాత్ర పోషించింది. ఈ సంస్థ‌తో వేరే ఎన్జీవో సంస్థ‌లు ఈ సెంట‌ర్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ప్రొఫెష‌న‌ల్స్‌, లాయ‌ర్స్, డాక్ట‌ర్స్ ఈ సెంట‌ర్‌కు స‌పోర్టుగా ఉంటున్నారు.  కొంద‌రు మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌లు మ‌ద్యం తాగి కొడుతున్నార‌ని వారితో అది మాన్పించాల‌ని కోరుతున్నారు.  దీనికోసం రిహాబిలిటేష‌న్ కార్య‌క్ర‌మాన్ని సైతం ఇక్క‌డ నిర్వ‌హిస్తున్నాం. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ స్వాతిల‌క్రా 15 రోజులకో సారి ఇక్క‌డ ప‌రిస్థితుల‌ను స‌మీక్షిస్తుంది. రాష్ర్టంలో అన్నిచోట్ల ఇలాంటి భ‌రోస్ సెంట‌ర్‌ను ప్రారంభిస్తే బాగుంటుంద‌ని నా ఆలోచ‌న‌.  చ‌దువ మ‌ధ్య‌లో ఆపేసిన ఆడ‌ పిల్ల‌ల‌కు వారి చ‌దువు ఆపకుండా త‌గిన విధంగా ఈ సెంట‌ర్‌ను నుంచి కృషి చేస్తున్నాం. మ‌హిళ‌లు వారి కాళ్ల మీద నిల‌బ‌డాల‌న్న‌దే ఈ సెంట‌ర్ ధ్యేయం. బాధితుల‌కు సంబంధించిన స‌దుపాయాలు ఇక్క‌డ క‌ల్పిస్తున్నాం. బేసిక్ వ‌స‌తుల‌ను పోలీసులు ఇక్క‌డ ఏర్పాటు చేశారు.  

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe