Breaking News

చెట్లు పెంచడం వలన ఆరోగ్యానికి ఎన్ని లాభా

Apr 07, 2017 11:05 by Admin Admin
చెట్లు పెంచడం వలన ఆరోగ్యానికి ఎన్ని లాభా

చెట్లు పెంచడం వలన పర్యావరణానికి,ఆరోగ్యానికి ఎన్ని లాభాలో చూడండి.


1)చెట్లు అన్ని ప్రాణులకు ప్రాణవాయువు(ఆక్సిజన్) నిచ్చి,మనము విడిచే ,మతరియు వాతావరణములోని

కార్భన్-డై-ఆక్సైడును (బొగ్గుపులుసు వాయువు)పీల్గచుకొని వాతావరణ సమతుల్యతను కాపాడతాయి.


2) చెట్లు వర్షము పడునట్లు చేస్తాయి.ఉష్ణోగ్రత తగ్గిస్తాయి.


3)చెట్లు భూసారము రక్షిస్తాయి.భూమిని సారవంతము చేస్తాయి.


4)చెట్లు పండ్లను,పూలను ఇస్తాయి.ప్రాణులన్నింటికి ఆహారము అందిస్తాయి. 


5)చెట్లు అన్ని కాలుష్యాలను నివారించి, వాతావరణాన్ని పరిశుద్దము చేస్తాయి.


6)చెట్లు క్రిమి,కీటకాలకు,పక్షులకు ,జంతువులకు నివాసమిస్తాయి.


7)చెట్లు మందులను ఇచ్చి ఆరోగ్యాన్ని,ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.


8)చెట్లు కలప నిస్తాయి ఆకులు ఎరువుగా ఉపయోగపడతాయి.


9)చెట్లు వరదలు రాకుండా కాపాడతాయి. నిలువకు ఉపయోగపడతాయి
చెట్లు లేనినాడు సృష్టి ఉండదు.సృష్టి

లేనినాడు ఏ ప్రాణి ఉండదు చెట్లు పెంచండి.ప్రాణికోటిని రక్షించండి.ప్రపంచాన్ని కాపాడండి.

ప్రతి మనిషి తన ధర్మంగా,ప్రకృతి రక్షణకు,తన ఆరోగ్యానికి ఈ క్రింది నియమాలు పాటించండి.

1)ప్లాస్టిక్ వాడకండి.


2) చెట్లు పెంచండి.


3) నీటిని నిలువ చేయుటకు నీటి గుంతలు, వరదలు వచ్చే చోట తవ్వండి.

4) ఇందన వనరులు(పెట్రోలు,డీజిలు,కరంటు) పొదుపు చేయండి.


5)పంటలపై రసాయనిక,క్రిమి సంహారక మందులు చల్లకండి.


6)శాకాహారము స్వచ్చమైన,సహజమైన ఆహారం మాత్రమే తీసుకోండి. 


7)వ్యాయామము చేయండి.


8)ఏ జీవిని చంపకండి .హింసించకండి.


9)సామాజిక సేవ చేయండి.


10) నైతిక విలువలు పాటించండి.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe