Breaking News

అన్నయ్యా అని పిలిచినా వదలకుండా నాపై పలుస

Jul 04, 2018 11:54 by Admin Admin
అన్నయ్యా అని పిలిచినా వదలకుండా నాపై పలుస

తెలిసి తెలియని బాల్య దశలో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఓ యువతి ఎట్టకేలకు పెదవి విప్పింది.ఢిల్లీలోని కళాశాలలో ఓ స్వచ్ఛంద సంస్థ ‘నిశబ్ధం వీడండి’ అంటూ చేపట్టిన చైతన్య కార్యక్రమంలో ఓ యువతి బాల్యదశలో తనపై సాగిన లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు. లైంగిక వేధింపుల బారి నుంచి అమ్మాయిలను పరిరక్షించేందుకు వారిని చైతన్యవంతులను చేయాలని బాధిత యువతి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల పర్వాన్ని వెల్లడించింది. లైంగిక వేధింపులపై యువతి ఆవేదన ఆమె మాటల్లోనే...
‘‘హర్యానా రాష్ట్రంలోని మా గ్రామంలో నివాసమున్నపుడు నా వయసు పదేళ్లు ఉంటుంది...మా సమీప బంధువుల అబ్బాయి కళాశాలలో చదివేవాడు. నాకు వరసకు అన్నయ్య కావడంతో నేను తనని అన్నయ్యా...అంటూ సంబోధించేదాన్ని. నా తల్లి నన్ను పాలు తీసుకురమ్మని బంధువుల ఇంటికి పంపేది. పాలకోసం వెళ్లిన నన్ను అన్నయ్యా అని పిలిచినా వదలకుండా నాపై పలుసార్లు అత్యాచారం జరిపాడు. పదేళ్ల వయసులో అన్నయ్య వరసయ్యే సమీప బంధువు ఏం చేస్తున్నాడో నాకు తెలిసేది కాదు...పాలు తీసుకువచ్చేందుకు బంధువుల ఇంటికి వెళ్లనంటే అమ్మ ఊరుకునేది కాదు. నాపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి నా తల్లిదండ్రులకు చెప్పాలంటే భయమేసేది. అలా నాపై కొనేళ్లపాటు సాగిన లైంగికకాండ...మేం నగరానికి వలస పోవడంతో ఆగిపోయింది...
 
నాకు గత సంవత్సరం 18 ఏళ్ల వయసు రావడంతో కళాశాలలో చేరాను. కళాశాలలో లైంగిక వేధింపులపై ‘నిశబ్ధం వీడండి’ అంటూ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమంలో నాపై జరిగిన లైంగిక కాండ గురించి చెప్పి ఇకముందు నాలా ఇతర అమ్మాయిలపై జరగకుండా నివారించాలనే లక్ష్యంతో పెదవి విప్పాను. బాల్య దశలో నాపై సాగిన అత్యాచార పర్వంపై భయపడి తల్లిదండ్రులకు కూడా చెప్పలేక పోవడం నేను చేసిన పెద్ద తప్పు. నాలా మరో అమ్మాయి ఇలా వేధింపుల బారిన పడకూడదనే నాపై సాగిన లైంగిక వేధింపుల గురించి ప్రపంచానికి చెప్పాలనే ఈ విషయం వెల్లడిస్తున్నాను. నాకు ఎదురైన అనుభవం మరొకరికి ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను’’ అంటూ రేప్ బాధిత యువతి తన దీనగాథను వివరించింది.
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe