

నటుడు గొల్లపూడి కన్నుమూత...టాలీవుడ్ ప్రముఖ నటుడు, గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. కొన్ని...
బహుముఖ ప్రయోజనాలు...గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతున్నా వ...
టీమ్ఇండియా చాంపియన్...ఆఖరి పోరాటంలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలుత టాస్ గెలి&...
సూర్యుడివో... చంద్రుడివో....మహేశ్‌బాబును ‘సూర్యుడివో... చంద్రుడివో...’ అంటున్నారు గేయ రచయిత రామ...
తప్పంతా అభిమానులదే...‘తప్పంతా ఈ దరిద్రపు అభిమానులదే. 100% అభిమానులదే. వాళ్ల అభిమాన హీరో బాధ...
ప్రైవేట్ ఆసుపత్రులు : క్షయ వ్యాధిని నిర్ధారించడానికి రోగి కళ్ళేని పరీక్షిస్తే చాలు.కానీ చాలఖరీదైన టిబి గోల్డ్ , టిబి ప్లాటినం పరీక్షలు రాస్తున్నారు. జ్వరం వచ్చిన ఐదో రోజుకంటే ముందు రక్త పరీక్షలు చేయించినా టైఫాయిడ్ ని నిర్ధారించలేము.కానీ రోజు మార్చి రోజు రక్తపరీక్షలు చేయిస్తున్నారు. ఎంత ఖరీదైన పరీక్ష రాస్తే అంత కమిషన్ వస్తుంది. ఇంకో కొత్తపరీక్ష ఉంది.దాని పేరు " సింక్ పరీక్ష " .అంటే సేకరించిన నమూనాలను పరీక్షించకుండానే సింకు లో పడేస్తారు. అంతా బాగానే ఉందని డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు ఆయన కమిషన్ వచ్చేస్తుంది.
కార్పొరేట్ ఆసుపత్రిలో ఒకరోగికి ఎదో అవసరం కోసం పొట్ట భాగంలో ఆల్ట్రా సౌండ్ స్కాన్ నిర్వహించే టప్పుడు గాల్ బ్లాడర్ లో రాయి కనిపించింది.దానివల్ల రోగికి ఏ బాధా లేదు.అయినా సరే రోగిని భయపెట్టి హెర్నియా ఆపరేషన్ చేసి లక్షన్నర రూపాయలు వసూలు చేశారు.
హాస్పిటల్ ప్రారంభించేటప్పుడే దాని యజమాని డయాగ్నోస్టిక్ సెంటర్ ,మందుల షాపుకి స్థలం కేటాయించి వాటిని నడిపేవారి దగ్గర్నుంచి 75 లక్షల రూపాయల వరకూ డిపాజిట్ కట్టించుకుంటాడు.ఆసుపత్రి నిర్మాణానికి అప్పు సమస్య ఉండదు.
డెంగ్యూ వ్యాదే కాదు ఎలాంటి వైరల్ జ్వరం వచ్చినా ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోతుంది. అలాంటి వెయ్యి మందిలో ఒక్కరు మాత్రమే హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది.మిగతావారందరికీ కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలూ ,మందులతో సరిపోతుంది.కానీ చాలామంది డాక్టర్లు రోగులను భయపెట్టి ఆసుపత్రిలో చేర్చుకుని సెలైన్ బాటిల్ తగిలించేస్తున్నారు.సాధారణ ప్రసవానికి కూడా 'ప్రొజెస్టెరాన్ అనే మందు వాడుతున్నారు.వైద్య శాస్త్రం దీన్నంగీకరించదు.బీ కాంప్లెక్ ,సి విటమిన్ ల వలే శరీరంలో అదనంగా ఉన్న డీ విటమిన్ మూత్రం ద్వారా పోకుండా శరీరంలో పేరుకుపోతుంది.కాబట్టి దీర్ఘ కాలం డీ విటమిన్ మాత్రలు వాడితే కేన్సర్ కి దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
షాపింగ్ మాల్ సంస్కృతి : మాస్టర్ హెల్త్ చెకప్ పేరుతో తక్కువ రేటుకి ఎక్కువ టెస్టులు చేస్తున్నారు.అర్ధం చేసుకోవలసిందేమిటంటే వాటిలో చాలావరకూ అవసరం లేనివే.
డాక్టర్లకు టార్గెట్ : O.P .లో చూసిన రోగుల్లో 40 శాతం మందిని హాస్పిటల్లో జాయిన్ చెయ్యకపోతే ఆ డాక్టర్ ఉద్యోగం పోతుంది.
"నేనుమీకంపెనీ మందులు రాస్తాను.నన్నుయూరప్ టూర్ కి పంపించాలి " అని డిమాండ్ చేసే డాక్టర్లున్నారు.
శవాలతో వ్యాపారం : ఏ ఆసుపత్రిలో అయినా ఒక రోగి మరణిస్తే శవాన్ని పోస్టుమార్టం కోసం గవర్నమెంట్ ఆసుపత్రికి పంపిస్తారు.ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమి రాయాలి ? అనేదానిపై బేరసారాలు జరుగుతాయి.
మన వైద్య వ్యవస్థ గురించి 78 మంది వైద్యులతో సంభాషించి రాసిన పుస్తకం " వైద్యానికి సుస్తీ " నుండి.
(ఈ పుస్తకం చదవని వారికోసం ఈ పోస్ట్* )
![]() |
|
![]() |
|
![]() |