Breaking News

ప్రకృతిధర్మము ప్రతిక్షణం 1

Nov 15, 2014 00:00 by Admin Admin
ప్రకృతిధర్మము ప్రతిక్షణం 1


మతాలన్నిమరచిపోండి, మతాలేవియూమనిషినిబాగుచేయలేవు ప్రపంచనాశనాన్నిఆపలేవు నవీన ప్రపంచానికి నూతనధర్మము 

ప్రపంచ ప్రజలందరినీ ఏకంచేసి,అందరూఆచరించదగిన 

 "మనసు"అనే దివ్యమైన వరాన్ని పొందిన మనిషి ఒంటరివాడు కాడు."నేను ఒంటరివాన్ని అని ఎవరూ,ఎప్పుడూ అనుకోకూడదు.చుట్టూ వేలాది ప్రాణులతో జనాలతో కలిసి జీవిస్తున్నసంఘజీవి మనిషి.ఆలోచన,విచక్షణ,భాషణ సామర్థ్యాలు కల ఏకైక ప్రాణిగా ప్రపంచములో తనకంటూ విభిన్నశైలిని,నడవడినిపొందుపరచుకొని బాగా సుఖపడాలనే తపనతో ఆరాటపడిపోతున్నాడు.మిగతాప్రాణులకు ఆలోచన ఉంది కాని అవి కొన్ని కోట్ల సంవత్సరాలనుండి అదే ఆలోచనలో బతుకుతున్నాయి.తినడం,పడుకోవడం పనిచేయిస్తే చేయడం అవే వాటికి తెలిసింది. పశుపక్ష్యాదులు జీవించడానికి ప్రత్యేకంగా" ఇది ధర్మము,ఇది మతము" అని చెప్పాల్సిన అవససరం లేదు.వాటి

జీవన విధానము ప్రకృతియే నిర్ధేశిస్తుంది కనక.కాని మనుష్యులకు చెప్పాలి ఎందుకంటే వారు క్షణానికొక ఆలోచన చేస్తారుకాబట్టి.

అసలు మతమంటే ఏమిటి? నిజమైన మతమేది?మనం జీవించడానికి మతం అవసరమా? అని ఒక్కసారి చర్చించుకుందాము.మతం అర్థమేమిటో చూద్ధాం.

మతంఅంటేఅందరికిసమ్మతంగాఉండాలి.హితంకూర్చేదిగాఉండాలి.అందరియోగక్షేమాలనాలోచించేదిగా యుండాలి.ప్రపంచప్రజలందరు ఒకటే అనే భావన కలిగించాలి.పైలక్షణాలుకలిగినమతమేమనిషిమనుగడకుఅత్యంతావశ్యకము.

ఎందుకంటే మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో బతకడానికి మార్గం చూపిస్తుంది కాబట్టి.మతమంటే"ఒకజీవనవిధానము"అనిచెప్పడమేసరియైననిర్వచనమవుతుంది.అదిఅందరికిఆమోదయోగ్యమవుతుంది.మతముఅనేదానిని"ధర్మము"అనడంఇంకాబాగుంటుంది.మనమిప్పుడు ధర్మము అను పదము తోనే చర్చించుకుందాము.ఎందుకంటే మతం అనేది సమాజాన్ని నాశనం చేసింది.గతచరిత్ర గమనించినా,వర్తమాన చరిత్రపరిశీలించినా మతం పేరుతోమారణకాండలు,యుద్ధాలు,సామాజికఅశాంతి,ప్రజలజీవనందుర్భ్రరంగామారినవేలాదిసంఘటనలుజరిగాయి.జరుగుతున్నాయి.మతం మనిషిని మహనీయునిగామార్చాలికానిమారణకర్తగామార్చింది.మతంమనుష్యులందరినిఏకత్రాటిపైనిలపగలిగేదిగాయుండాలి.మేధావులకు,విజ్ఞానవంతులకు పిలుపునిచ్చేదిగా యుండాలి. మనిషైనా,తన ప్రవర్తనవల్ల,సమాజానికి గాని తనకు గాని హాని,నష్టము జరుగుతున్నప్పుడు అతనికి తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకునేందుకు మతం తగు సలహాలతో మార్పును సూచించాలి.అతని ప్రవర్తన మార్చుకొనుటకు మత(ధర్మ)విధానాలే పనికివస్తాయి.మతవిధానాలే అతనిని రక్షిస్తాయి.మనశాస్త్రవేత్తలుఎన్నోప్రకృతిరహస్యాలనుశోధించికొత్తవిషయాలను,

ఆవిష్కరణలనుసాధించారుకానిమనిషిలోతునుకనిపెట్టలేకపోతున్నారు.మానవజీవితనిజమైనపరమార్థమును,బాధ్యతలనుమనిషికితెలిసేవిధంగా,ఆచరణలో

పెట్టేవిధంగామనిషిఆలోచనలనుమరల్చలేకపోయారు.

మతం మానవతావిలువలను,సామాజికవిలువలను ప్రతిబింబించేదిగా యుండాలి.ఒక వర్గానికో,కులానికో,ప్రాతినిధ్యం వహించేదిగా యుండరాదు.ఒక సమూహంగా విడదీయబడి  యుండరాదు.నేడు మనిషి మతపు సంకెళ్ళలో బంధించబడియున్నాడు.మత విషవలయంలొ చిక్కుబడిపోయాడు. ప్రయత్నం మీద తెంచుకున్నా,ఒంటరిగా మిగిలి పోతున్నాడు.అలాగని స్వేచ్చావాయువులు పీల్చుకోవద్దని అనడంలేదు.

సమాజముఒంటరివానిగాచేసినా,నిలువరించి,నిలదొక్కుకునేమానసికస్తైర్యం,తనమీద తనకు విశ్వసనీయత కలిగియుండాలి.తను నమ్మిన సిద్ధాంతానికి,ధర్మానికి కట్టుబడియుండే మానసిక దృఢత్వం పెంచుకోవాలి.ఇప్పటికైనా మనిషి వాస్తవమైన,హేతుబద్ధమైన ప్రాతిపదిక గల ధర్మాన్ని ఎన్నుకోవాలి.హేతుబద్ధంగా చెప్పగలగాలి.ఆచరణయోగ్యమైన మతమే (ధర్మము)అందరికి సుఖశాంతులు అందజేయగలదు.

ఎవరైనా మతం పేరుతో నిరుపేద,అమాయక,ప్రజలను ఆర్థికంగా,సామాజికంగా దోచుకునే విధానాలు ఆచరించకూడదు.డబ్బుఎరగా చూపి  "మా మతములో చేరండి"అని ఎవరినీ మోసం చేయకూడదు.మనిషి,శరీరాన్ని,మనస్సును రెండింటినీ పోషించాలి.ఏది బలహీనమైనా,మనిషి అస్థిత్వానికే ముప్పు కల్గుతుంది.సహజమైన,స్వచ్చమైన ఆహారముతో శరీరాన్నిపోషిస్తే, మహోన్నతా,మానవతావిలవలతో మనసును పోషించాలి.

విచక్షణాశీలుడైనమనిషేశాస్త్రీయంగా,హేతుబద్ధంగాఉన్నధర్మాన్నిమాత్రమే

అనుసరించగలడు.ప్రస్థుతం ప్రపంచములో అనేక మతాల ధర్మాలు ప్రచారములో ఉన్నాయి.ఎవరి మతo వారిదే గొప్ప అనిచెప్పుకుంటుంటారు.

తమ మతాచార్యుడో,తాము పూజించే దేవుడో,మాత్రం గొప్పవాడని,ఇతర మతాలన్ని తక్కువగాచూస్తుంటారు.తమ మత ధర్మాలే శ్రేష్టతమములని వాదిస్తుంటారు.మాది,మేము అంటూ ప్రత్యేకవర్గంగా తయారవుతారు.ఇతర మతాలను ఖండిస్తుంటారు.ఇలాంటి భావనలే విషపూరితాలయ్యాయి.మతం పేరుతోఅనేకవిధ్వంసకాండలు,అశాంతిచరిత్రలోజరిగాయి.జరుగుతున్నాయి.

మనిషిని మానవత్వాన్ని,శాంతిని నెలకొల్పలేని,మానవునిలో సత్ప్రవర్తన కలిగించలేని మతాలెందుకు? ప్రపంచప్రజలందరిని ఐక్యభావనతో మెలిగేటట్టుచేయలేనిధర్మాలెందుకు?ప్ర్జలందరినిఆందోళనలోపడవేయడ

మెందుకు?మతం పేరుతో ఒక దళారీవ్యవస్థను తయారుచేయగలిగాయి.

నా వ్యాసములో మీకు చెప్పబోయే ప్రధానాంశము మతాలు ఇంకా వెయ్యేండ్లకైనా సన్మార్గాన్ని,శాంతిని సాధించలేవు.మనిషిని మనిషిగా తీర్చిదిద్దలేవు.మతములన్నీ మధ్యలో పుట్టుకొచ్చినవే. మతాలు,దేవుళ్ళు,దేవతలుసృష్టించబడి కేవలము కొన్నివేలసంవత్సరాలే  జరిగినవి.భూఆవిర్భావము జరిగి ఇప్పటికి సుమారు 450 కోట్ల సంవత్సరాలయిందని శాస్త్రవేత్తల అంచనా.అయితే మనిషి పరిణామము చెంది కొన్ని లక్షల సంవత్సరాలు గడిచినవి.అప్పటి మనిషి ఎట్టి మతాన్ని అవలంభించాడు?వారు జీవించలేదా? దీనికి ఆధునికులు అంటారు"అప్పటి మనిషి జంతువులాగా జీవించాడు?అని  అంటే జంతువు అంటేఇప్పటి మనిషికి అంత చులకన భావమెందుకు? నేటి స్వార్థపూరిత మానవునికన్నా జంతువు మేలు కాదా? నాటి మనిషి మన కన్నామెరుగైన జీవితాన్ని అనుభవించాడు.ప్రకృతితో మమేకమై జీవించాడు.ప్రకృతితో సహజీవనము సాగించాడు.ప్రకృతి ధర్మాలను అనుసరించాడు. మతాలకన్నా ముందు ప్రకృతి ధర్మప్రకారమే మనిషి జీవించాడు.ఆనాడు సృష్టిచక్రము నడవలేదా?మతాలకన్నా ముందే ప్రకృతి ధర్మమున్నది.సకల ప్రాణికోటి మనిషికన్నా ముందే ఆవిర్భవించినవి.నాడు సూర్యచంద్రులు లేరా? గ్రహ నక్షత్రాలు లేవా?ప్రకృతి సంపద లేదా? గాలి వీచలేదా? వర్షము పడలేదా?ఆధునిక మనిషి పుట్టిన నుండే సృష్టి ఆరంభమయిందా?

మనిషి ఇంతలా విచక్షణ కోల్పోయాడెందుకు? మనిషి ఇలా విర్రవీగుతున్నాడేం? తాను ఎన్నో సాధించానని!అంతా నా వల్లనే సాధ్యమవుతుందని,తన కంటె ఇంకేదీ గొప్పది కాదని ప్ర్గగల్భాలు పలుకుతున్నాడెందుకు? మనిషి సాధించలేనివి ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి.సింధువులో బిందువంత పరిమాణము కూడా తెలుసుకోలేదు.

ఆత్మీయబంధువులారా!ఇకఇప్పుడున్నమతాలతోవిసిగిపోయాము.అలసిపోయాము.అమూల్యమైన సమయాన్ని వృధాచేశాము.ఇవన్నీ నిరర్థకమైనవని తెలుసుకున్న తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? వాటినుండి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తారు.ప్రస్థుతము మనం చేయాల్సింది అదే! హేతుబద్ధమైన,శాస్త్రీయ ద్క్ప్థక్పథముగల వాస్తవమైన ధర్మాన్ని ఆచరించాలి.

దశాబ్ధము కిందట ప్రకృతిమాత నాయొక్క మనోమందిరములో మెరుపులా మెరిసి,ప్రవచించిన అనుగ్రహభాషణములతోదివ్యానుభూతితో ఉత్తేజితుడనై, అట్టిమాత సూచించిన వాక్కులే నా జీవన పథ మార్గదర్శకములై,అచంచల దీక్షాబద్ధుడనై,మాతను ఏమరుపాటులేక సదా ఆత్మలో నిలిపి తల్లి సూచించిన మార్గములోనడవాలనేతలంపుతోఏకాగ్రతతోప్రయత్నించుచున్నాను.విమర్శలు,హేళనలు,ఈసడింపులు,దూషణములు,అన్నియు భూషణములుగా స్వీకరించి ఎన్నుకున్నమార్గములోనడవడానికికంటకములనుతొలగించుకుంటూ ,

ఆయమ్మఎలాచెపితే అలా నడచుకుంటున్నాను.

ప్రకృతిధర్మము స్వచ్చమైనజీవనమార్గాన్నిసూచిస్తుంది.నీతి,న్యాయము,విచక్షణ లాంటి ఆలోచనలు కలుగజేస్తుంది.సమాజ వాంచిత స్వేచ్చా,స్వాతంత్ర్యాలకు ఇది అడ్డురాదు.

1)మనిషి తన మనుగడ,ఉనికిని శాంతిమార్గములో నడుపుచూ,

2)తనతో పాటు జీవించే అనేకానేక జీవులను కాపాడుకుంటూ,

3)ప్రకృతి శాసించు,అవలంభించు విధానాలతో మమేకమై,ప్రకృతికి

విధేయంగా సహజీవనము చేయాలని దర్మము ప్రబోధిస్తుంది.

నేను ప్రవచించే,సూత్రీకరించే, నెలకొల్పే ప్రకృతిధర్మము కొత్తదేం కాదు!ఇప్పుడున్న మతాల ఆవిర్భావము కన్నా ముందే నాటి జనులు ఆచరించినది.మనిషిఅతితెలివిప్రదర్శించి,అహంకారపూరితుడైననుండి

ప్రకృతిధర్మముమరుగునపడిపోయింది.తననుతానుఅతిగాఊహించుకున్న

మనిషితాను ప్రకృతిని జయించలేననితాను నిస్శహాయుడనని,శక్తిహీనుడననే వాస్తవాన్ని గ్రహించి కళ్ళుతెరిచేసరికి ఇప్పుడున్న పర్యావరణముబాగుచెయలేని స్థితికి చేరుకుంటుంది.శిథిలావస్థకు చేరుకుంటుందిఅప్పుడు దేవుడు కాపాడలేడు!

ఆధునిక,సాంకేతికవిజ్ఞానమునుసద్వినియోగపరచుకోనట్టయితేజరిగేపరిణామాలుదారుణంగాఉంటాయన్నసత్యాన్నిమనిషిఇప్పుడిప్పుడేగ్రహించుచున్నాడు.లాభమేమిటి?"చేతులుకాలినతరువాతఆకులుపట్టుకోవడమవుతుంది.

"స్పృహలోకి వచ్చిన మనిషి "ప్రకృతి,పర్యావరణము చెడిపోయిందే" అని నెత్తీ,నోరు మొత్తుకుంటున్నాడు. ICU లోఉన్న నేటి ప్రపంచము ఇక రోజులను లెక్కపెట్టుకోవలసిందే గదా? అని వాపోతున్నాడు.కేవలము నేను చెప్పేది ఆలోచించకుండా గుడ్డిగా ఆచరించమని,నా మాటలను విశ్వసించడానికి మిమ్మల్ని బలవంతపెట్టడంలేదు.నేను మతప్రచారకుడినో,మతస్థాపకుడినో కాదుగదా?మిమ్మల్నిబలవంతపెట్టడానికి.నేనువాస్తవవాదిని.ప్రకృతిధర్మానికి

వాస్తవికతఉందని,విజ్ఞానయుక్తమైన ఆధారముందని మీరు ధర్మాన్ని గురించిఆలోచించాలని కోరుతున్నాను. ప్రకృతి ధర్మాన్నిమీరు వినగానే మీలోతప్పకుండాఒకఆలోచనవస్తుంది.మనసులోఒకసంఘర్షణమొదలవుతుంది.గాఢంగాపేరుకుపోయినఆందోళనమటుమాయమైపోతుంది.సందేహాలన్నీనివృత్తి అవుతాయి.తానెవరు? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.తానే ప్రకృతి,ప్రకృతే తను అను వాస్తవ విషయము బోధపడుతుంది.తన దేహము పూర్తిగా ప్రకృతియందలి పంచభూతాలలోని ధరణితత్వము నుండి తయారయిందని,గాలి తనలోని ఉచ్చ్వాసనిశ్వాసాలని,నీరుతనదేహప్రతికణములోనిండియున్నదని,

అగ్నితత్వము ఉష్ణోగ్రతగా,ఆకాశతత్వమే మనస్సుగాపరివర్తన చెందినదనే ప్రకృతిధర్మాన్ని తేలికగా అర్థం చేసుకుంటాడు.ఆచరించాలనే నిర్ణయానికి వస్తాడు. అప్పటి వరకు మెదడులోచిక్కు ప్రశ్నలన్నిటికీ సమాధానము లభిస్తుంది.

అనావశ్యకమైనకర్మకాండలుఆచరించమనిప్రకృతిధర్మముచెప్పదు.ముహూర్తాలు మంచివి,చెడ్డవి అనే తారతమ్యాలు ఉండవు.మంగళవారం మంచిది కాదని,శనివారం శనిలాంటిదని చెప్పదు.మన ఆచరించు పనులనుబట్టే మంచిచెడులుజరుగుతాయని ఈ ధర్మము ప్రబోధిస్తుంది.

అన్నిరోజులు అన్నిపనులకు మంచివే.ఎందుకంటే ప్రకృతి, ముహూర్తము చూసి ప్రాణిరక్షణ చేయదు.అష్టమి,మూఢము ఉందని ఏదీ చేయకుండా ఊరుకోదు.ప్రకృతికి లేని పట్టింపు ,ప్రకృతి బిడ్డలమైన మనకు ఎందుకు?ప్రకృతి తన ధర్మాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తుంది.అది క్షణం ఎవరికోసం ఆగదు.భూవలయం సదా తిరుగుతూనే ఉంటుంది.రాత్రింబవళ్ళు

ఏర్పడుతూనేయుంటాయి.అమావాస్య,పౌర్ణమిలుకలుగుతూనేయుంటాయి.

ఉదయాస్తమయాలు సమయం తప్పకుండాజరుగుతూనేయుంటాయి.

మూఢనమ్మకాలనుగాని,మానవాతీతశక్తులనుగానిసాధనచేయుటకు,సంపాదించుటకుగాని ధర్మములో అబద్దాలుగాకొట్టివేయబడ్డాయి.అలాంటివి గతంలోను,ప్రస్థుతంలోను,భవిష్యత్తులోను జరగవని ధర్మము చెబుతుంది.

ప్రకృతి ఆవిర్భావము జరిగినప్పటినుండి నేటివరకు కూడా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఏదీ జరగలేదు.జరగదుకూడా.ప్రకృతి ధర్మములోరహస్యంలేదు.ఇతర మతాల్లోలాగా గురూపదేశాలు,అర్థంలేని మూఢాచారాలు ఉండనే ఉండవు.అంతా బహిర్గతమే.కనుల ముందు సాక్షాత్కారమే.ప్రకృతే గురువు,తల్లి,తండ్రి అన్నీనూ.

ప్రకృతిధర్మముమానవజీవితములోఅందరూగురయ్యేదుశ్శీలత,అనారోగ్యాల

నుండి విముక్తిచెందడానికి అద్వితీయమైనమార్గాన్ని తెలియజేస్తుంది.

ప్రకృతిధర్మము ఒక్కవాదాన్ని సమర్థించదు.లోబడదు.తత్వవిచారణకు మాత్రమే లోబడియుంటుంది.పిడివాదానికిగాని,ఈశ్వరవాదానికిగాని ఒకరి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికిగాని,శూన్యవాదానికిగాని,ఇతరులను అవమానపరచడంగానీ ధర్మములొ తావులేదు. శాశ్వతవాదానికి బలం చేకూరుస్తుంది.

మనిషికి బాహ్య,అంతర జ్ఞానోదయాన్ని కలుగజేసి,దు:ఖము నుండి విముక్తి కలుగజేయు ఏకైక ధర్మమే ప్రకృతిధర్మము. భూమిమీద మనుష్యులు ఈనాడు దు:ఖపడుతున్న,కష్టాలననుభవిస్తున్నదంతా గతజన్మదుష్కృతాలమూలంగానే

అని ధర్మము చెప్పదు.గతంలోని తమ పూర్వుల పాపఫలితమనికూడా ధర్మము నిర్ధారించదు.

ప్రతిమనిషితానుఇప్పుడుచేస్తున్నమంచిచెడులఫలితముఅనుభవించకతప్పదు.ప్రస్థుత కార్యాలలోని ఫలితాలను బట్టేసుఖశాంతులు ఉంటాయి.మనిషే తన సుఖశాంతులకు బాధ్యుడని ప్రకృతిధర్మము ఘంటాపథంగా చెపుతుంది.

ప్రకృతిధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు సుఖశాంతులతో జీవిస్తారు.

               సత్కార్యాల్ని బట్టి సత్ఫలితాలు-దుష్కార్యాల్ని బట్టి దుష్పలితాలు కలుగుతాయని ప్రకృతిధర్మములోని మూలసూత్రము.

నేటిమానవులమనస్సుదుర్భలమైనది.శక్తిహీనమైనది.ఏచిన్నసంఘటననైనా,మాటకైనా ఓర్చుకునేశక్తిలేదు.అందుకేమనస్సులోకివచ్చేకోరికలను,

అహంకారాన్ని,అజ్ఞానాన్ని,కోపాన్ని,మోహాన్ని,లోభం లాంటి దుర్గుణాలను అణచివేసి సక్రమ ఆలోచనలు చేయలేని అశక్తుడయ్యాడు.

అందుకే అత్యాచారాలు,ఆత్మహత్యలు,అన్యాయాలు,హత్యలు ,నేరాలు చేస్తున్నాడు.దాని ఫలితంగా మనిషి దు:ఖానికి అశాంతికి లోనవుతున్నాడు.ఆర్థిక,సామాజిక హోదా పొ0దలేక అగౌరవం పాలవుతున్నాడు.

తాను కష్టపడడమే కాక తనవారిని,సమాజాన్ని అస్థిరపరుస్తున్నాడు.

ప్రకృతిధర్మాన్ని అనుసరిస్తూ,ప్రకృతినియమాల్ని పాటిస్తూ,ప్రకృతితో సహజీవనము సాగిస్తూ ఉన్నట్టైతే మనస్సు ఆహ్లాదభరితమవుతుంది.చెడు ఆలోచనలకు దూరమై,చెడుకార్యాలు,చెడునడతలు దరిచేరనందు వలన దివ్యమైన అనుభూతి పొందుతాడు.అమోఘమైన సుఖ,శాంతులు లభిస్తాయి.

దైనందిన జీవితములో ఎన్నో ఆటుపోట్లు,సుఖదు:ఖాలుకలుగుతుంటాయి.కొన్ని చేతులారా తెచ్చుకున్నవి,(దురలవాట్లు, నిర్లక్ష్యధోరణి) కొన్ని ప్రకృతి ప్రమేయమో,పరిసరాలప్రభావమో,(కాలుష్యము)వారసత్వలక్షణాలు

సంక్రమించడమో,(కొన్నివ్యాధులు,శారీరక మానసిక లక్షణాలు) రాజకీయ,సాంఘిక వ్యస్థవల్లనో అయి ఉంటాయి.కాని మనమనుకున్నటువంటి దైవఘటనలు కాదు.గతజన్మలపాపఫలితమూ కాదు.

ప్రకృతిధర్మము ఆచరిస్తే దు:ఖోపశమనము కలుగుతుంది. ధర్మము చెడును నిర్మూలించి మంచిని పెంచుతుంది.

బలహీనులకు బలాన్నిపెంచుతుంది.అజ్ఞానులకు జ్ఞానోదయము కలిగిస్తుంది.కులమత ప్రసక్తి ఉండనే ఉండదు.మనిషి,మనిషికి మధ్య ద్వేషబావాన్నితొలగించి,ప్రేమభావాన్ని,భూతదయనుపుట్టిస్తుంది.హెచ్చుతగ్గులు లేని సమానత్వభావనను పెంచి అంధకారములో ఉన్నవారికి వెలుగునిస్తుంది.

ప్రకృతిధర్మము స్పష్టముగాను,తర్కబద్ధముగాను,సందేహాస్పద ప్రశ్నలన్నిటికి పరిపూర్ణమైన సమాధానాన్నిఇస్తూమహోన్నతమైన జీవితానికి ఒక బలమైన "మానవతావిలువల పునాది"ని నిర్మించడంలో మనిషికి ఉపయోగపడుతుంది.

మానవజాతిని మరియు ఇతర జీవరాశిని రక్షించే,ప్రేమించే తత్వము కన్నా "నీతి" ప్రపంచములో మరొకటి లేదు.

మనశ్శాంతికి మించిన ఆనందము మరొకటి లేదు.సహజంగా,సాక్షాత్తు కనులకు కనిపించే ప్రకృతిని కాదని,నిర్లక్ష్యము చేసికనబడే సత్యాన్ని అవగాహన చేసుకోకుండా,కనబడని దైవం కోసము ప్రాకులాడడం అవివేకుల లక్షణం.కళ్ళముందు సహజసిద్ధమైన ఫలితాలను,వాస్తవాలను నిరూపించే గొప్ప ధర్మము ప్రపంచములో ఏదీలేదు ఒక ప్రకృతిధర్మము తప్ప!

ధర్మమెప్పుడు ఇతర మతాల బోధనలను వినవద్దని,అధ్యయనం చేయవద్దని ఎవరినీ నిర్భంధించదు.మీరు కొద్దిగా ఆలోచించగలిగితే,అవాస్తవ విషయాలన్నీ మరుగునపడి విశ్వసనీయమైన,సార్వజనీనమైన పవిత్రజ్ఞానము

కళ్ళముందు సాక్షాత్కారిస్తుంది.ఎవరికీ తెలియని,ఎవరూ చూడని అకారణమైన,అతీతశక్తిగా భగవంతుడున్నాడని మనుష్యులను భక్తి సంకెళ్ళలో బంధించే బదులుగా,మానవుడే అతీతశక్తిగా రూపుదిద్దుకొనుటకు ధర్మము సహకరిస్తుంది.ఫలాపేక్షరహితంగా,నిస్వార్థంగా సేవలు చేయాలని,త్యాగబుద్దిని కలిగియుండాలని ధర్మము ప్రభోధిస్తుంది. ధర్మము ఆచరించువారు ఎప్పుడూ చెడుపనులు చేయరు.చెడును తలంచరు. ధర్మములో ప్రకృతి తప్ప ఇతర దేవతలు,భగవంతుడు లేరు కాబట్టి భగవంతుడనే అతీతశక్తి లేదు కావున ఆయనకు భయపడకుండా తోటిజీవరాశులు,మనుష్యులు బాధపడతారని,దు:ఖిస్తారని చెడుచేయకుండా ఉంటారు.తమ స్వార్థం కోసం భగవ0తునికి కానుకలను(లంచం) ఇస్తే సంతృప్తిపడతాడని,తమకుమేలు చేస్తాడని ఎక్కడాలేని ఆయనకు తమకోర్కెలను నివేదించి,అట్టి కోర్కెలను నెరవేరుస్తాడనే భ్రమలో,మాయలో చిక్కి,తమపాపాలు పోయాయనే అవాస్తవ ఆలోచనలతో కాకుండా ఇతరుల కష్టసుఖాలకు స్పందించి,స్వార్థరహితంగా వారియందు దయ,సానుభూతి చూపించిమానవతాదృక్పథంతో సేవించాలని ధర్మము ప్రభోధిస్తుంది.

ప్రకృతిధర్మము ప్రతిక్షణం మన క్షేమాన్ని కాంక్షిస్తుంది.మన యోగక్షేమాల్ని కాపాడుతుంది.ప్రాణప్రదాతగా మన వెంటేనడుస్తుంది.

ప్రతి మనిషికి ఇష్టదైవమంటూ ఉంటారంటారు కాని ప్రకృతి అందరికీ ఇష్టదైవమే ఎందుకంటే ప్రకృతి తత్వమే మన దేహమందలి ప్రతికణములొ ఉంది కాబట్టి.

ధర్మము కార్యాచరణను మాత్రమే ప్రతిపాదిస్తుంది అవాస్తవవిషయాలకు తావివ్వదు.తపస్సులు,యజ్ఞాలు,యాగాలు,హోమాలు,ఊహాలోకాలు,స్వర్గం,

నరకం,చతుర్ధశభువనాలు ధర్మములో ఉల్లేఖించబడవు.మనిషి ప్రవర్తనలె సుఖశాంతులకు మూలమని,మంచిచేస్తే సుఖం,చెడుచేస్తే దు:ఖం కలుగుతుందని ధర్మము చెపుతుంది.

మనిషిసచ్చీలతమరియుజ్ఞానమార్గముద్వారాఉత్తమోత్తమమైనమహనీయుడౌతాడని ధర్మము తెలుపుతుంది.

ధర్మమే కులాలను,మతాలను నిర్ధ్వంద్వంగా ఖండిస్తుంది.సకల జీవరాశుల వలనే మనిషి కూడా ఒక జీవిగా,ద్విపాదజంతువుగా ప్రకృతిధర్మము అభివర్ణిస్తుంది.స్త్రీ,పురుష,భేదము లేకుండా ధర్మము గురించి ఆలోచించడానికి,ఆచరించడానికి ప్రపంచ ప్రజలందరిని ఒకే నీడన ఉండాలనే సిద్ధాంతాన్నిప్రతిపాదన గావించి సామాజిక న్యాయాన్ని కలుగజేస్తుంది.

గతంలొ అనేక మతధర్మాల్లో కూరుకొనిపోయి,వారి అమూల్యమైన జీవితాలను భగ్నం చేసుకున్నవారు,ఉన్నతులు,పేదవారు,వివేకులైనా,అవివేకులైనా,

ఇదివరకు నిరంతర పాపకార్యాలు చెసినవారైనా,దు:ఖితులైన వారు కూడా ధర్మాన్ని స్వీకరించి పవిత్రులుగా,జ్ఞానవంతులుగా మారవచ్చు.ఇతరులను సులభంగా మార్చవచ్చు.జీవన సాఫల్యము పొందవచ్చు.ఇందుకోసము

ఇళ్ళు,ఒళ్ళు గుల్ల చేసుకొని ధనము ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు.

ధర్మం ఊహాజనితంకాదు.అగోచరమైనదికాదు.అంతాదృగ్గోచరమే.స్వచ్చమైన,

నిష్కళంకమైనజీవితాన్నిగడపడానికివిశిష్టమార్గాన్నిసూచిస్తుంది.చారిత్రాత్మకంగా ఇది పురాతనధర్మమే.గతంలో ధర్మమే తప్ప వేరే మతమేదీ లేదు.

పురాతనమైనా కోణము నుండి చూసినా నిత్యనూతనంగా భాసిస్తుంది.

స్వార్థపరులు,దళారీలయిన మతబోధకుల మాటల్ని విశ్వసించి భగవంతుడనే ఊహాస్వరూపాన్ని నమ్మి ఒక్కరు బానిసలుగాబతకవద్దని సలహాయిస్తుంది ధర్మము.కష్టాలను .....................

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe