Breaking News

సీతమ్మ పేరున పుట్టిన ఫలం

Nov 24, 2014 00:00 by Admin Admin
సీతమ్మ పేరున పుట్టిన ఫలం

పండు.. ప్రకృతి ప్రసాదించే వరం. అందులోనూ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన సీతమ్మ పేరున పుట్టిన ఫలం గురించి చెప్పాల్సింది ఏముంటుంది. చెట్టుమీదే మక్కిన సీతాఫలం.. అందులో రామసీతాఫలం కమ్మదనం మధురాతి మదురం. మత్తెక్కించే ఆ తియ్యదనాన్ని కృత్రిమంగా సృష్టించడం ఎవరి తరంకాదు.

Custard Apples


సీతాఫలాన్ని పేదోడి యాపిల్ అంటారు. శాస్త్రీయంగా సీతాఫలం చెట్టు అనోనాషియా అనే కుటుంబానికి చెందింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలకు పైగా రకాలు ఉన్నాయి. పింక్స్ మమ్మూత్ సీతాఫలాలైతే మరీ పెద్దగా ఉంటాయి. సీతాఫలం చర్మం సన్నగా ఉన్నా గట్టిదనం ఎక్కువే. చెట్టుకు పూసే పూలన్నీ కాయలై అవి ఎదిగి పక్వానికి రావడానికి 20 నుంచి 25 వారాల సమయం పడుతుంది. కాయ పండు అయ్యాక లోన తెల్లని గుజ్జు ఏర్పడి ఒక్కో గింజ చుట్టూ విడివిడిగా అందంగా అతుక్కుపోతుంది. సీతాఫలం చెట్టు రెండేళ్ల నుంచే పూత పూసినప్పటికీ పూత నిలుపుకొని కాయలు కాయడానికి మరికొన్ని సంత్సరాలు పడుతుంది.

సీతాఫలం.. పోషకాలకు నిలయం


Custard Apples


సీతాఫలంలో పోషకాలు పుష్కలం. మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థకు బాగా ఉపయోగపడే విటమిన్ సీ వంటి యాంటీ ఆక్సిడెంట్‌లు వీటిలో ఉంటాయి. హృద్రోగ సమస్యల నుంచి పొటాషియం, మెగ్నీషియం అధిక పాళ్లల్లో లభిస్తాయి. మెగ్నీషియం మన దేహంలోని నీటి సమతుల్యతను కాపాడడమే కాక కీళ్లలోని అవాంఛనీయ రసాయనాలను తొలగిస్తుంది. ఫలితంగా కీళ్లవ్యాధి, కీళ్ల వాతం లక్షణాలు తగ్గుముఖం పడుతాయి. సీతాఫలం గుజ్జులో కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, క్యూడ్‌ఫైబర్, ప్రొటీన్లు, కాల్షియం, పాస్ఫరస్, స్వల్ప పాళ్లలో ఐరన్, కెరోటిన్, దియామైన్, రైబోఫ్లెవిన్, నియాసిన్, ఆఫారిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్‌లు ఉంటాయి.
ఫలాలతోపాటు ఆ ఆకుల బెరడు దాక అన్నీ వివిధ రకాల వ్యాధుల సీతాఫలం ఆకును డికాషిన్ తాగితే జీర్ణాశయంలోని సమస్యలు తొలిగిపోతాయి. ఆకులను నూరి లేదా గుజ్జు పేస్టును కురుపులు, పొక్కులు, అల్సర్ పుండ్ల చికిత్సకు ఉపయోగిస్తారు. దీని పక్వం కాని కాయ గుజ్జును అతిసార వంటి రోగాల చికిత్సలో వాడుతారు.

సీతాఫలాన్ని వీరు తీసుకోకూడదు


Custard Apples


అస్తమా, మధుమేహం ఉన్నవారు మాత్రం సీతాఫలం తీసుకోకూడదు. బాగా పండిన పండును తిన్నట్లయితే అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు హాని చేస్తుంది. మూత్రపిండాలు, కాలేయ వ్యాధితో బాధపడేవారు సీతాఫలానికి దూరంగా ఉండాలి.

తగ్గిన దిగుబడి, అందని రాబడి


జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఈ సంవత్సరం సీతాఫలాల దిగుబడి గణనీయంగా తగ్గింది. గత సంవత్సరం సీతాఫలాలు మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వ్యాపారులు కూడా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి సీజనల్ వ్యాపారాన్ని జోరుగా కొనసాగించారు. ఈసారి ఫలాల దిగుబడి చాలా తగ్గింది. నాణ్యత కూడా తగ్గడంతో వాటిని మార్కెట్లో విక్రయిస్తున్న రైతులకు గిట్టుబాటు కావడం లేదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు సీతాఫలాలు తెచ్చి విక్రయించేవారు. నేడు వారికి కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. గతంలో దేవరకొండ, మల్లేపల్లి ప్రాంతాల నుంచి ఇక్కడి వ్యాపారులు సీతాఫలాలను ఇతర ప్రాంతాలకు ద్వారా తరలించేవారు. ఈ ఏడాది వ్యాపారం తగ్గడంతో ఎగుమతులు తగ్గించేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe