Breaking News

ఈనాడు భారతావని ఆవేదన!

Dec 21, 2014 00:00 by Admin Admin
ఈనాడు భారతావని ఆవేదన!

ఈనాడు భారతావని ఆవేదన చెందుతూ, భావితరాలను ప్రశ్నిస్తుందేమో అనిపిస్తుంది. ఆవేదన, ఆక్రోశంతో ఆరతపడుతునట్టుగా ఉంది.
ఆర్యవర్తనమైన మన దేశం పోకడలు నాగరికత పేరుతో ఎక్కడికోవెళ్ళుతుంటే , పర్యావరణము నిర్వీర్యంయ్యే
చర్యలతో ప్రకృతి ప్రకోపిస్తుంది. ప్రకృతినే ఆరాధించే ప్రవృత్తిగల ఉన్నతమైన దేశం మనది. అటువంటిది భగీరధుని ప్రయత్నంతో భాగిరథిగా ఖ్యాతిగాంచిన పవిత్ర గంగా నదిని కూడా కలుషితం చేసిన ఘనత కూడా మనదే. మనుగడ కోసం అరణ్యాలను నరికివేస్తుంటే ప్రకృతియొక్క అరణ్య రోదన మనవులకెంత వరకు తెలుసు .ఇప్పుడు పతనమైన పర్యావరణాన్ని రక్షిస్తామని దీక్షలు బూనితే ఏమి లాభం.

 పాశ్చాత్య నాగరికత పోకడాలెన్నొ దిగుమతి చేసుకొని ప్రగతి చెందామని అనుకుంటున్నాము.
మన మానవత విలువలను విదేశాలకు ఎగుమతి చేసి వారు మన సంస్కృతి ని గౌరవిస్తుంటే విస్మయము పొండుతున్నాము. వేష భాషలను మార్చుకొని కాలం కన్నా వేగంగా పరిగేత్తున్నమనుకొని వెగటును కలిగించే అలవాట్లకు బానిసలై కుటుంబాలే కాక సమాజానికి, దేశానికి భారుముగా మారుతున్న యువతను చూస్తుంటే ఇదేనా ప్రగతి అని అనిపిస్తున్నది.

ప్రేమతో స్నేహామృతం పంచాల్సిన చోట అదే ప్రేమ పేరు తో ఆసిడ్ దాడి చేసి పెద్ద ఘనకార్యము చేసామనుకొంటున్నారు కొందరు..
మరి కొందరు కొన్ని రోజులో, నెలల ప్రేమ తనను 9 నెలలు మోసి, కని, సంవత్సరాలు పెంచిన ప్రేమ కంటే గోప్పదనుకొని...తన ప్రేమను వద్దునుకున్న వారి కోసం తనును ప్రేమించే  కన్నతల్లితండ్రులను  మరచి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు...
బ్రతుకు బాటలో భంగ పడినామని కొందరు, ప్రగతి సాధించలేక పోయామని కొందరు, పరీక్షలో తప్పామని కొన్ని పసి మొగ్గలు నేల రాలుతుంటే మనుసు ఘోషిస్తుంది....మన దేశ ధీరుల చరితలు, వారు ధైర్యం తో విజయాలను సాధించిన తీరు తెలుసుకుంటే ఇలాంటి పిరికి చర్యకు పూనుకోరు..బ్రతికి ఉంటే ఎన్ని తప్పులైన సవరించుకొని, ఓటమిలను ఎదురుకొని, ఎప్పటికైనా విజయం సాధించవచ్చు..కాని క్షణికావేశము లో విడిచిన ప్రాణము ఎన్నటికి తిరిగిరాదు, ఎప్పటికి గెలువలేదు..
ఒక్కోసారి మనుసులేని మనిషికన్నా అడుగుకు అధరమౌతున్న రాయే మిన్న అనిపిస్తుంటది...  
మహానీయులం కాకపోయినా మానవత తో మంచి మనిషిగా బ్రతుకుదాం.....జై హింద్

    యు .జయశ్రీ

Facebook like
Google Plus Circle
Youtube Subscribe