Breaking News

బాల్యమునందు శిక్షణ --- వారి భవిత కు రక్షణ

Jan 02, 2015 00:00 by Admin Admin
బాల్యమునందు శిక్షణ --- వారి భవిత కు రక్షణ

తల్లీ--తండ్రి--ఆచార్యుడు(గురువు) అను ముగ్గురు ఉత్తమమైన బోధకులు గా ఉన్నపుడే మనిషి జ్ఞ్యాని అవుతాడు. ధర్మాత్ములు, విద్వాంసులైన తల్లి తండ్రులకు జన్మించుట అన్నది పూర్వ జన్మ అదృష్టమే.  అందుకే మన భారతదేశ సంప్రదాయంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని ఈ ముగ్గురిని దేవుని తో సమానము అని వర్ణించారు.

మాతృదేవోభవ :- సంతానానికి తల్లి చేసే భోధన మరియు ఉపకారం ఇంకెవరు చేయలేరు. ఏ తల్లి చిన్ననాటి నుండి తన సంతానాన్ని తీర్చిదిద్దుతుందో ఆ తల్లి ధన్యవతురాలు. శివాజీ లాంటి వీరులను తీర్చి దిద్దినా సమాజానికి చెడు కలిగించే చీడ పురుగులను కని పెంచినా అది కేవలం తల్లి పెంపకము మీద నే ఉంటది ఎందుకంటే సంతానానికి మొదటి గురువు తల్లే కదా! అమ్మ నేర్పే అడుగు వేయుట నుండి అక్షరాభ్యాసం వరకు తల్లిగా, యవ్వనం లో అడుగిడి విద్య పూర్తి అయ్యేవరకు మంచి స్నేహితురాలి గా వారికి తోడు గా ఉండుట తల్లి యొక్క కర్తవ్యమని మరచిపోవద్దు. ఉద్యోగానిర్వహణలో కాని, గృహిణి గా కాని సమయం లేకున్నా వారి కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి.

తన సంతానము మంచి నాగరికులు కావడానికీ, పిల్లలు తమ యొక్క ఏ అవయవము చేతను చెడు చేష్టలు చేయకుండా ఉండునట్లు తల్లి ఎల్లపుడు వారికి ఉత్తమమైన హితబోధ చేయాలి. మాటలు వచ్చే సమయం నుండే పిల్లలు నాలుకతో సుస్పష్టముగా ఉచ్ఛరించేటట్లు తల్లి ప్రయత్నం చేయాలి, మంచి మాటలే నేర్పియాలి.       పెద్దవారితో, చిన్నవారితో, అధికారులతో, గురువులతో, పండితులతో, ఎలా మాట్లాడాలో, ప్రవర్తించే తీరు భోదించాలి.

పితృదేవోభవ :- వృత్తి వ్యవహారకపట్ల అవగాహన ఏర్పరచాలి, సంతానము యొక్క నడవడిని గమనిస్తూ ఉండాలి. వివాహానికి ముందు బ్రహ్మచర్యమును కాపాడుకొనుటయందు ఆనందమున్నదనే విషయాన్ని పిల్లవానికి బోధించాలి. విషయాల గురించి మంచి స్నేహితునివలె చెర్చించాలి. 

ఆచార్యదేవోభవ :- గురువులు ఎప్పుడు సత్య విషయాలను గురించి భోదించాలి. మూడనమ్మకాలను తొలగించాలి. తాను నియమాలను పాటిస్తూ విద్యార్థులచే కూడా పాటించేటట్లు చేయాలి. మంచి చెడుల వ్యత్యాసాల గురించి తెలియజేయాలి.

పిల్లలకు విద్య, సంస్కారము  అందజేయలేని తల్లి , తండ్రి, గురువులు సమాజానికి శత్రువులు.

          ఉపాధ్యాయుల జయశ్రీ


Facebook like
Google Plus Circle
Youtube Subscribe