Breaking News

నిప్పులాంటి నిజం

Jan 16, 2015 00:00 by Admin Admin
నిప్పులాంటి నిజం

ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది. పర్యావరణము కోలుకోనిస్థితిలో శిథిలమవుతున్నది.ఆరోగ్యం ఆకాశమంత ఎత్తులో అందని ఫలమవుతున్నది. ప్రతి మనిషిలో స్వార్థం,ధనదాహం అనే విషపుపొరలు మానవత్వమనే కళ్ళను కప్పేస్తున్నాయి. భవిశ్యత్ తరాల బంగారుబతుకులు కలగా మిగిలిపోనున్నాయి. మనిషి తాను తీసిన గోతిలో తానే పడబోతున్నాడు.కూర్చున్నకొమ్మనే నరుక్కుంటున్నాడు. కోరికోరి తన వినాశనానికే కాకుండా, ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్నాడు. మనిషి,మనిషికీ మధ్య అగాధం పెరిగిపోతున్నది. నమ్మకం,విశ్వాసం,విధేయత,ప్రేమ,అనురాగం,ఆత్మీయత,జాలి,కరుణ,దయ,సానుభూతి,శాoతి,సామరస్యం,సౌభ్రాతృత్వం లాంటి మాటలు చేతకానివారివిగా భావించబడుతున్నాయి. మానవ సంబంధాలు వ్యాపారసంబంధాలయినాయి. మీఇంటికి వస్తే ఏమిస్తావు? మాఇంటికి వస్తే ఏమితెస్తావు? అనే ధోరణి బాగా ప్రబలిపోతున్నది. భక్తి,దేవుడు,పూజలు,వ్రతాలు పేరుతో కనిపించని, మాట వినిపించని,ఊహాతీత దైవానికి మధ్య మతమనే ఒక దళారీ వ్యవస్థ కొందరి స్వార్థపరుల కనుసన్నల్లో నడుపబడుచున్నది. ప్రపంచాన్ని శాసిస్తున్నది.అదే ప్రపంచనాశనానికి కారణం కాబోతున్నది. మనిషి తాను తన మనస్సు ఆధీనములో లేడు.గాలి వాలులో కొట్టుకుపోతున్నాడు. వాస్తవాన్ని కనలేకపోతున్నాడు. "నాకెందుకు,లే నేను నాసంపాదన నాకుటుంబం నా పిల్లలు బాగుంటే చాలు .ఏవరు ఏమైతేనేం,ఎవరెట్లాపోతేఏం" అనే సంకుచిత మనస్తత్వాన్ని అలవరచుకుంటున్నాడు.అప్పుడప్పుడు "అయ్యో! లోకం ఇలా తయారయిందేమిటి? అంటూ వాఫొతున్నాడు. కాని తనుకూడా సంఘజీవినని మరచిపోతున్నాడు. ప్రకృతినియమానుసారం మనిషి సకలప్రాణికోటిలోతానూ ఒక జంతుజాతికి చెందినవాడనని మరచిపోయాడు.కాకుంటే తెలివి,మాట,వ్యక్తీకరణ లాంటివిఅదనంగాఉండవచ్చు.అంతమాత్రానఅన్నింటిలోఅధికుడనని,అన్ని

ప్రాణులను చంపవచ్చని,అన్నింటిపై ఆధిపత్యం చెలాయిస్తానని అనుకోవడం పొరపాటు. అలా అనుకోబట్టే సమాజం అశాంతి పాలవుతున్నది. ప్రకృతికి, మనిషికి మధ్య దూరం పెరిగిపోతున్నది. మనిషైనవాడుఅన్నిప్రాణులనుకాపాడాలి. మనిషి ప్రకృతి తత్వాన్ని మరచినందువల్లే ప్రపంచాన్ని, స్మశానానికి దగ్గరగా తీసుకుపోతున్నాడు.తనసహజతత్వాన్నిమరచి కృత్రిమత్వానికి,క్షణికానందానికి.స్వలాభానికి,స్వార్థచింతనకు,స్వసుఖానికి ప్రాధాన్యమిస్తున్నాడు. అబద్ధాలాడడానికి,మోసానికి పాల్పడడానికి

ఏమాత్రం వెనుకడుగువేయడంలేదు. నేటి మనిషి మెదడులో ఒకేఒకలోచన ఉంది అదే "డబ్బు అన్యాయంగానైనా,అబద్ధాలాడైనా ఎలాగైనాసంపాదించాలని మరియు దానిని బాగా కూడబెట్టాలని" తత్వం సృష్టిలో ప్రాణికి లేదు. ఒక్క మనిషిలోనేవుంది.దానికోసంహింసించినా,బాధించినా,చంపినా,ప్రకృతివిధ్వంసానికైనాసిద్ధమవుతున్నాడు.పీల్చేగాలిచెడిందన్నా,తాగేనీరుపాడైందన్నా,తినేఆహారం

కల్తీ అయిందన్నా,నివసించే నేల కాలుష్యములో చిక్కుకుందన్నా,కళ్ళుండీ గుడ్డివాడులా,చెవులుండీ చెవిటివాడిలాగా తనకేమీ పట్టనట్టుగా,

నిద్రలోనడుస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నాడు.నేడు కొందరు తాము మతప్రభోధకులమని,ప్రచరకులుమని,తామేదైవాంశసంభూతులమని,దైవప్రతినిధులమని,చాటుమాటుచీకటివ్యాపారాలతో, సన్యాసులుగా,సాధువులుగా,కోట్లు కూడగట్టుకొని,ప్రజలబలహీనతలను తమకనుకూలంగా మలచుకొని మాయమాటలు,కల్లబొల్లికబుర్లతో భక్తి పేరుతో ఒక భయంకర విషవలయంలో పడేసి అమాయకప్రజలు ఇల్లు,ఒళ్ళు గుల్ల చేసుకొని విలవిలలాడుతుంటే శాడిస్టుల్లా గలగలానవ్వుతుంటారు. మేధావులు,రాజకీయనాయకులు వీరి అడుగులకు మడుగులొత్తుతుంటే సామాన్య ప్రజల విషయం చెప్పేదేముంది? అందుకే వీరి ఆటలు యధేచ్చగా సాగిపోతున్నాయి. నల్లేరుమీదబండిలా ఉంది వీరి ప్రయాణం. ఎవరైనా "ఇదేంవిధానమని "ప్రశ్నిస్తే వారిని పిచ్చిప్రజలే బతకనివ్వరు. మతోన్మాదులు ప్రజల్ని ఇంతగా ప్రభావితం చేస్తున్నారు.మానసికంగా బలహీనపరుస్తున్నారు. దైవంపేరుతో దొంగల్లాగా,మోసకారుల్లాగా,పైకిమాత్రం సత్యానికి,ధర్మానికి ఆదర్శవంతులుగా చలామణి అవుతున్నారు. అప్పుడప్పుడు వీరి నిజరూపాలు బయటకొచ్చినా అవన్నీ తమపై కుట్రచేస్తున్నారని ప్రజల్ని నమ్మిస్తారు. ప్రజలు వారి మాటలగారడికి మోసపోయి నమ్మేస్తారు. ప్రస్థుతం,మనం పూజిస్తున్న,కోట్లాదిరూపాయలు ఖర్చుపెట్టి,భజనలు చేస్తున్న,దేవతలుగా పూజలందుకుంటున్న వారు ఒకనాటి మానవులే. వారు జీవితకాలమంతా యుద్ధాలుచేసి,పరులను హింసించినవారే.ఎవరెక్కువమందిని చంపితే అంతగొప్పదేవుడై మననెత్తినెక్కి కూర్చున్నారు. వారుగతించి వేలసంవత్సరాలు గడచిపోయినవి. మనమెంత అరచినా,గీపెట్టినా వారు రారు, మనబాధలు తీరవు. ఇదిముమ్మాటికీనిజం.నిప్పులాంటినిజం.ఇచ్చేదేదైవం,రక్షించేదిదైవం,అడగకుండానేఅన్నీసమకూర్చేదిఅమ్మ.ఫలితమాశించకుండాత్యాగం,సేవ,రక్షణ,కాపాడడం,ఇవి దైవలక్షణాలు.కంటికి కనిపించేది ప్రత్యక్షదైవం.కుల,మత,బీద,ధనిక భేదము చూపకుండా రక్షించునదే దేవత. పైన చెప్పిన సంపూర్ణలక్షణాలు ప్రకృతియందు ఉన్నవి.అందుకే ప్రకృతియే ప్రత్యక్షదైవం. మనకన్నీఇస్తుంది.మనల్ని కన్నబిడ్డల్లా కాపాడుతుంది.అడగకుండానే,ఫలితమాశించకుండా, అమ్మలా సమకూరుస్తుంది.సమానత్వం,సహకారం,దయ,జాలి,కరుణ కలిగినది ప్రకృతిమాత. దేవుణ్ణి శరణు వేడినా,ఎవ్వరు ఏమీ ఇవ్వరు.ప్రకృతిని శరణు వేడండి. ప్రకృతిని ఆరాధించండి. ప్రకృతి ధర్మాన్ని పాటించండి. ప్రకృతిశాసనాలనతిక్రమించకుండా సహజీవనం సాగించండి.ప్రకృతి తప్ప మనకింకెవరూదిక్కులేరనితెలుసుకోండి.అన్నిమతవిధానాలు,ధర్మాలు,సందేశాలు,నియమాలుకేవలంమనిషిమనిషికిమధ్యద్వేషభావానికి,అశాంతికి,సందేహానికి,మతోన్మాదుల స్వార్థలాభానికిమాత్రమే పనికివస్తాయి. కానీ "వసుధైక కుటుంబమనే" భావనకు పనికిరావు. ప్రకృతిధర్మాలు తెలుసుకోవాలంటే నేను రాసిన "ప్రకృతిధర్మము"అనే స్క్రిప్టు చదవండి. తెలుసుకొని ఆచరించండి.

- ప్రకృతానంద.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe