Breaking News

ఆదిత్యనాథ్ అత్యవసర సమావేశం

Aug 11, 2017 22:05 by Admin Admin

 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. గోరఖ్‌‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందించని కారణంగా 30 మంది చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. రోగుల సమస్యలపై ఆయన ఈ ఆస్పత్రిని సందర్శించి వెళ్లిన రెండు రోజుల్లోనే ఈ ఘోరం జరగడంతో యోగి సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.

 
 
శనివారం ముఖ్యమంత్రితో సమావేశం అయిన తర్వాత యూపీ ఆరోగ్యమంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్, మెడికల్ విద్య మంత్రి అశుతోష్ టాండన్‌ ఇద్దరూ గోరఖ్‌పూర్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. కాగా శనివారం ఉదయం ఆక్సిజన్ అందని కారణంగా మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ అందని కారణంగా పిల్లలకు ఎన్సిఫలిటిస్ సోకినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మెదడుపై అత్యంత వేగంగా ప్రభావం చూపే ఈ వ్యాధి కారణంగానే ఒక్కరోజులో 30 మంది పిల్లలు బలయ్యారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe