Breaking News

బ్రేక్ వద్దన్న అగ్రహీరో

Aug 11, 2017 22:06 by Admin Admin

 అతనొక సూపర్‌స్టార్... ఇటీవల షూటింగ్‌లో భాగంగా అతని కాలికి గాయమైంది. పైగా నడుమునొప్పితో కూడా బాధపడుతున్నాడు. అటువంటి పరిస్థితిలోనూ షూటింగ్ ఆగిపోకూడదని అంకిత భావంత పనిచేశాడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు ఈ మధ్య సినిమా షూటింగ్‌లో భాగంగా కాలికి గాయమైంది. దీనికితోడు గత కొన్నాళ్లుగా ఆయనను నడుం నొప్పి వేధిస్తోంది. అయినప్పటికీ షూటింగ్‌కు బ్రేక్ రానివ్వలేదు. షెడ్యూలు ప్రకారం షూటింగ్‌లో పాల్గొని మిగిలిన నటులకు ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం అబితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’తో పాటు ‘టగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. పనిలో అంకిత భావానికి అమితాబ్ ప్రతిరూపమని అందరూ అంటుంటారు. బిగ్ బీ సారధ్యంలో వచ్చే ‘కేబీసీ’ తదుపరి సీజన్ త్వరలో సోనీ టీవీలో ప్రసారం కానుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe