Breaking News

నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలపై ఆగ్రహం

Aug 11, 2017 22:08 by Admin Admin

 వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తనకు ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న ప్రశాంత్‌ కిశోర్‌ అలియాస్‌ పీకేపై పోలీస్‌ కేసు దాఖలుకు తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. పీకే బృందం సామాజిక మీడియాలో వేల నకిలీ ఖాతాలను తెరిచి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టింగులు పెడుతోందని టీడీపీ ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించి బయటపెట్టింది. ఆ వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. ఈ నేరానికి ప్రశాంత్‌ కిశోర్‌పై సైబర్‌ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారమిక్కడ డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌పై ఏడు కేసులు నమోదయ్యాయని, ఇందులో ఒకటి సైబర్‌ కేసని తెలిపారు. ఆ కేసుల వివరాలు తెప్పించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe