Breaking News

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Aug 11, 2017 22:18 by Admin Admin

 విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా చరిత్ర ముంగిట నిలిచింది. విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్‌ను తొలిసారి వైట్‌వాష్‌ చేసిన జట్టుగా నిలిచేందుకు మరో విజయం దూరంలో ఉంది. ఇప్పటికే 2-0తో సిరీస్‌ నెగ్గి జోరు మీదున్న కోహ్లీసేన.. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు రెండు వరుస ఓటములను ఎదుర్కొన్న ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది. పిచ్ బౌలింగ్‌కు సహకరించే అవకాశం ఉన్నందువల్ల పాండ్యా స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంటారని భావించినా.. కోహ్లీ మాత్రం యంగ్ ఆల్‌రౌండర్‌ పైనే నమ్మకముంచాడు. శ్రీలంక మాత్రం మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ధనుంజయ, హెరాత్, ప్రదీప్ స్థానంలో సండకన్, కుమారా, ఫెర్నాండోలను జట్టులోకి తీసుకుంది.

 
 
 
జట్లు
భారత్‌: ధవన్‌, రాహుల్‌, పుజారా, కోహ్లీ(కెప్టెన్‌), రహానె, అశ్విన్‌, సాహా(కీపర్‌), హార్దిక్‌, కుల్దీప్‌, ఉమేష్‌, షమి.
 
శ్రీలంక: తరంగ, కరుణరత్నె, కుశాల్‌ మెండిస్‌, చాందిమల్‌(కెప్టెన్‌), మాథ్యూస్‌, డిక్‌వెలా(కీపర్‌), పుష్పకుమారా, దిల్‌రువాన్‌ పెరీర, లక్షణ్ ‌సండకన్, ఫెర్నాండో, లాహిరు కుమార.
 
 
పిచ్‌/వాతావరణం
పల్లెకెలె పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలిస్తుంది. మంచి పేస్‌తోపాటు బౌన్స్‌ లభిస్తుంది. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ఉంది. మ్యాచ్‌ రోజుల్లో ఎంతో కొంత వర్షం కురిసే అవకాశం ఉంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe