Breaking News

నవంబర్ 28న మెట్రో ప్రారంభం

Sep 08, 2017 10:33 by Admin Admin

 నవంబర్ 28న మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభంకానున్నాయని మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 30 కిలోమీటర్ల మేర ట్రాక్ సిద్ధం చేస్తున్నామన్నారు. పాతబస్తీ మినహా మిగిలిన ప్రాంతాల్లో 2018 నవంబర్ లోగా మెట్రో రైల్ పనులు పూర్తవుతాయన్నారు. అలాగే త్వరలో అమీర్‌పేట్ ఇంటర్ స్టేట్ చేంజ్ స్టేషన్ పనులు పూర్తవుతాయని, ఎల్అండ్ టీ ప్రతినిధులను సంప్రదించాక చార్జీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కాగా... ఆర్టీసీ బస్సులకు, మెట్రో రైలు సర్వీస్‌లు అనుసంధానం చేస్తున్నామని,

మినీ బస్సులు ఏర్పాటుచేయడమేగాక ప్రత్యేకంగా బస్ బేలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, మెట్రో రైలుకు స్మార్ట్ కార్డ్, యాప్ ను రూపొందిస్తున్నామన్నారు. ప్రతి స్టేషన్ వద్ద 600 మీటర్ల పరిధిలో వైట్ టాపింగ్ రోడ్లు నిర్మిస్తామని, ప్రతి ఐదవ స్తంభాన్ని కళాత్మకంగా సిద్ధం చేస్తామని ఎండీ తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe