Breaking News

రహస్య ప్రాంతంలో నిల్వ

Oct 11, 2017 22:58 by Admin Admin

 భారత్‌కు చేరువలో పాకిస్తాన్‌ అణ్వాయుధాలను మోహరి స్తోందా? పెద్ద మొత్తంలో క్షిపణులను సిద్ధం చేస్తోందా? అంటే పలు అంతర్జాతీయ రిపోర్టులు అవుననే అంటున్నాయి. దాదాపు 140 అణ్వాయుధాలను తయారుచేసిన దాయాది.. వాటిని దాచేందుకు రహస్య ప్రాంతంలో సొరంగాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని థేమ్‌వాలీ ప్రాంతంలో కొండల కింద మూడు భారీ సొరంగాలను తవ్వుతున్నట్లు ఓ అం తర్జాతీయ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఆ కథనం ప్రకారం... పాకిస్థాన్‌ నిర్మాణాల్లో 10 మీటర్ల ఎత్తు, 10 మీటర్ల వెడల్పు ఉండే పొరంగాలు ఉంటాయి. ఒక్కో సొరంగంలో 12 నుంచి 24 అణ్వాయుధాలు, లాంచింగ్‌ వాహనాలను దాచవచ్చు.

 
ఒక సొరంగానికి, మరో సొరంగానికి మధ్య 450 నుంచి 750 మీటర్ల దూరం ఉంటుంది. వాటిలోకి లాంచర్లను తీసుకెళ్లేలా 20 మీటర్ల వెడల్పు గల భారీ రోడ్లను కూడా నిర్మిస్తోంది. పాకిస్థాన్‌ ఆర్మీ పర్యవేక్షణలో 2009లో ప్రారంభమైన సొరంగాల నిర్మాణ పనులు 2016 డిసెంబరు వరకు జరిగాయని తెలుస్తోంది. కాగా, ఈ ప్రాంతానికి అన్నివైపులా కంచెను ఏర్పాటుచేశారు. లోపలకు వెళ్లేందురు రెండు ప్రవేశ మార్గాలు ఉంటాయి. ఇక అ డ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌లో సిబ్బంది వాహనాల పార్కింగ్‌ కోసం భవనాలను కట్టారు. ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మధ్యలో మసీదును కూడా నిర్మించారు. అంతేకాదు క్షిపణులను ప్రయోగించే వాహనాలు దిశను మార్చుకునేదుకు వీలుగా 80మీటర్ల వ్యాస మున్న వృత్తాకారంలో టర్నింగ్‌ ఏరియా ఉంది.
 
థేమ్‌వాలీలోనే ఎందుకు?
థేమ్‌వాలీ.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు 350 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి భారత్‌పై సులువుగా దాడిచేయ వచ్చనే ఉద్దేశంతోనే, అక్కడ సొరంగాలను నిర్మిస్తోందనేది నిపుణుల అభిప్రాయం.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe