Breaking News

యాక్సిడెంట్ తర్వాత

Oct 11, 2017 22:59 by Admin Admin

 ఇటీవల హీరో రాజశేఖర్ కారులో వెళ్తూ ఓ యాక్సిడెంట్ చేశారు. ఆదివారం రాత్రి పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళ్తూ రామిరెడ్డి అనే వ్యక్తి కారును ఢీకొట్టారు. తాగి డ్రైవింగ్ చేయడం వల్లే రాజశేఖర్ యాక్సిడెంట్ చేశారని బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రాజశేఖర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన పోలీసులు ఆయన డ్రింక్ చేయలేదని తేల్చారు. కానీ ఆ యాక్సిడెంట్‌ తర్వాత జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో రాజశేఖర్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం తను ఏ కారులో వెళ్తున్నారో కూడా తెలియని స్థితిలో రాజశేఖర్ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe