Breaking News

సోషల్‌మీడియాతో జర జాగ్రత్త

Oct 11, 2017 23:04 by Admin Admin

 సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త..! పోస్టులు, కామెంట్లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందికదా అని ఆన్‌లైన్‌లో హద్దులు దాటారో అంతే సంగతులు. నెట్టింట్లో చెలరేగిపోతే జైల్లోకి నెట్టేసే పరిస్థితి రావచ్చు. అందుకు నిదర్శనమే ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన. జకీర్‌ అలీ త్యాగి(18) ఫేస్‌బుక్‌లో గంగానది, రామ్‌ మందిర నిర్మాణం, ముస్లింలకు హాజ్‌సబ్సిడీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడిని అరె్‌స్ట చేసి ఐపీసీ 420తో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 42 రోజుల జైలు శిక్ష అనంతరం బెయిల్‌పై ముజఫర్‌నగర్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే జకీర్‌ను అరెస్టు చేయడం.. తీవ్రనేరాలు చేసిన ఖైదీలతో పాటు ఉంచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 
సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకే నేరగాడిగా పరగణించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్‌ మీడియాలో అభ్యంతర పోస్టులపై కేసుల నమోదు గతంలోనూ జరిగింది. గతంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే మరణించినప్పుడు ముంబై నగరం స్తంభించింది.దీనిపై ఓ అమ్మాయి సోషల్‌ మీడియాలో వెటకారపు పోస్టు పెట్టింది. దానికి మరో అమ్మాయు లైక్‌ కొట్టింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగి కేసులు, అరె్‌స్టలు కూడా అయ్యాయి. ఆ మధ్య ఓ వ్యక్తి ప్రధాని మోదీ ఫొటోను స్నాప్‌చాట్‌లో మార్ఫింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేశాడు. దీంతో అత డు ఊచలు లెక్కపెట్టాడు. ఏపీలో శాసనమండలిపై అభ్యంతరకర ఫొటో షేర్‌ చేసినందుకు ఓ వ్యక్తిపై కేసుపెట్టారు. ఇక తాజాగా వరంగల్‌లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓ బస్‌ కండక్టర్‌ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టాడు. ఈ వ్యవహారం విచారణ దాకా వెళ్లింది. అందుకే డేటా ఉంది కదా అని ఆన్‌లైన్‌లో రెచ్చిపోకండి. కామెంట్లు పెట్టేముందు ఆలోచించండి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe