Breaking News

ఫొటో తీసి తినండి

Oct 11, 2017 23:06 by Admin Admin

 ఇటీవలి కాలంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య స్థూలకాయం. దీనిని అదుపులో ఉంచాలంటే ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసం క్యాలరీలు కౌంట్‌చేసి మరీ ఆహారం తీసుకోవడం ఉత్తమం. అయితే ఎప్పటికప్పడు క్యాలరీలు తెలుసుకోవడం, గుర్తుంచుకోవడం కష్టమైన పనే! తాజాగా గూగుల్ దీనికి పరిష్కారాన్నిసూచిస్తూ ‘ఐఎం2కేలరీస్‌’ అనే యాప్‌ను రూపొందించింది. ముందుగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత ఆహారపదార్థాలకు ఫొటో తీసి పరీక్షిస్తే దానిలో ఎన్నికేలరీలు ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇది ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ ద్వారా ఆహార పదార్థాలను గుర్తిస్తుంది. ఒకవేళ ఆహార పదార్థాలను ఈ యాప్‌ గుర్తించకపోతే అందుకు అనువైన సాప్ట్‌వేర్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe