Breaking News

నేడే రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు

Oct 11, 2017 23:07 by Admin Admin

 ఇప్పటికే ఎన్నికల ప్రచార వేడి మొదలైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రకటించనుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేస్తుంది. కాగా, గుజరాత్ ఎన్నికలు రెండు దశల్లోనూ, హిమాచల్ ఎన్నికలు ఒక విడతలోనూ నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌లో బీజేపీ సర్కార్ అధికారంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం కావడంతో గుజరాత్‌ను తిరిగి నిలబెట్టుకునేందుకు బీజేపీ పట్టుదలగా ఉండగా, రిజర్వేషన్ వ్యవహారంలో అసంతృప్తిగా ఉన్న పటేళ్ల వర్గం తమవైపే ఉంటుందని, అందర్నీ కలుపుకొని ఈసారి ఎలాగైనా బీజేపీని మట్టికరిపించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌ విషయంలో సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను రాహుల్ ఇప్పటికే ప్రకటించి రెండు విడతల ప్రచారం కూడా సాగించారు. అయితే వీరభద్ర సింగ్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు, వాటిపై పలు ఏజెన్సీలు దర్యాప్తు జరుపుతుండంతో బీజేపేకే ప్రజలు పట్టం కట్టడం తథ్యమని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe