Breaking News

.రియల్ హీరో

Jan 01, 2018 10:34 by Admin Admin

 లోయర్ పరేల్‌లోని కమలా మిల్స్ కౌంపౌండ్‌లో గత సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం 14 మందిని అగ్నికి ఆహుతి చేయగా, 21 మంది గాయపడిన ఘటన దేశవ్యాప్తంగా ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏం జరుగుతోందో తెలియక మంటల్లో చిక్కుకున్న పలువురిని ముంబై కానిస్టేబుల్ ఒకరు అత్యంత సాహసంగా కాపాడి 'భళా' అనిపించుకున్నాడు. అతను ఆ సాహసం చేయికపోయి ఉంటే మరిన్ని నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవే. కానిస్టేబుల్ సుదర్శన్ షిండే ప్రమాదంలో స్పృహ కోల్పోయిన ఒకరిని భుజం మీద వేసుకుని ప్రమాదస్థలి నుంచి తరలిస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. సాహస కానిస్టేబుల్‌కు ముంబై మేయర్ ఇవాళ ఘనసన్మానం చేశారు.

 
 
 
వోర్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన సుదర్శన్ షిండే ఆ రోజు అర్ధరాత్రి జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్టు వివరించారు. 'దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఘటనా స్థలికి చేరుకున్నాను. అగ్నిమాపక సిబ్బందికి సాయం చేసేందుకు మెట్లపైకి పరుగులు తీశాను. అప్పుడు నా మనస్సులో ఉన్నది ఒక్కేటే...సాధ్యమైనంత మందిని ప్రాణాలతో బయటపడేయాలని. మెట్లపైకి స్ట్రెచర్లు తీసుకువెళ్లలేం. ఇక ఉన్నది ఒకటే మార్గం. గాయపడిన పలువురుని భుజాలమీద వేసుకుని కిందకు తీసుకువచ్చాను' అని సుదర్శన్ సిండే తెలిపారు. విధి నిర్వహణలో షిండే సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలపై నాటి ఘటనలో ప్రాణాలతో బయటపడిన పలువురు ప్రశంసలు కురిపించారు. నిజమైన హీరో అంటూ అభినందలతో ముంచెత్తారు. సాహస కానిస్టేబుల్‌కు ముంబై మేయర్ స్వయంగా ఘనసన్మానం చేశారు.
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe