Breaking News

సీఎస్ డబ్ల్యూబీలో సభ్యురాలిగా ఎంపీ

Feb 12, 2018 20:51 by Admin Admin

 కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు పదవీ గండం పొంచి ఉందా? ఎంపీగా ఉంటూ.. మరో లాభదాయక పదవిని ఆమె అనుభవిస్తున్నారా? అంటే ఔననే అంటోంది పార్లమెంటరీ స్థాయీ సంఘం. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు(సీఎస్ డబ్ల్యూబీ) జనరల్‌ బాడీ సభ్యులలో బుట్టా రేణుక కూడా ఉన్నారు. వాస్తవానికి సీఎస్ డబ్ల్యూబీ జనరల్‌ బాడీలో ఒక చైర్‌పర్సన్‌, వివిధ రంగాల్లో ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు.

 
 
వీరితోపాటు లోక్‌సభ నుంచి బుట్టా రేణుక, రావత్‌లను కూడా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ 2016 జూలై 26న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా, పార్లమెంటరీ కమిటీ అధ్యయనంలో ఇవి లాభదాయక పదవులని తేలడంతో ఈ బోర్డులో సభ్యులుగా ఉన్న ఎంపీలపై అనర్హత వేటుకు సిఫారసు చేసింది. దీనికి ముందు ఈ అంశంపై కేంద్ర న్యాయ శాఖ అభిప్రాయాన్ని కూడా స్థాయీ సంఘం కోరింది.
 
 
ప్రభుత్వమే నియమించింది: రేణుకా
ప్రభుత్వమే తమను బోర్డులో నియమించిందని, తాము కానీ తన పార్టీ కానీ బోర్డులో నియమించమని విజ్ఞప్తి చేయలేదని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. తనపై అనర్హత వేటు వేయవచ్చని కమిటీ చేసిన సిఫారసు గురించి తనకు తెలియదని చెప్పారు. ‘‘సాధారణంగా ప్రతి బోర్డులోనూ ఇద్దరు ఎంపీలను ప్రభుత్వమే నియమిస్తుంది. బోర్డు జీతభత్యాలు ఏమీ చెల్లించదు. గతంలో నన్ను జూట్‌ బోర్డులో నియమించారు. ఇటీవల ఆరోగ్య శాఖకు సంబంధించిన బోర్డులో సభ్యురాలిగా నియమించారు. మరి ప్రస్తుతం సభ్యురాలిగా ఉన్న సీఎ్‌సడబ్ల్యూబీ నుంచి తొలగించి కొత్త బోర్డులో నియమించారా? లేదా రెండింటిలో కొనసాగుతున్నానా? అన్న అంశంపై నాకూ స్పష్టత లేదు’’ అని వ్యాఖ్యానించారు.
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe