Breaking News

పెను విషాదం

Feb 12, 2018 20:59 by Admin Admin

మహాశివరాత్రి పర్వదినాన చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బిఎన్ కండ్రిగ మండలం మయూర షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఆటోను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. తెల్లవారుజామున శ్రీకాళహస్తి వాయలింగేశ్వరుని దర్శించుకొని తిరిగి ఫ్యాక్టరీలో కూలి పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు రామారావు, కుమారిలతో పాటు.. ఆటో డ్రైవర్ వెంకట్రాయలు, చిత్తూరు జిల్లా యదమర్రి మండలానికి చెందిన అక్కాతమ్ముళ్లు బిందు, అనంత్‌లు ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పండుగ పూటే ఇలా జరగడంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe