Breaking News

యువతి వీడియో సాక్ష్యం

Feb 12, 2018 21:00 by Admin Admin

తాను యూనివర్శిటీ నుంచి ఇంటికి బస్సులో వెళుతుండగా ఓ ప్రయాణికుడు తన నడుముపై చేయి వేసి, అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధించాడని ఓ యువతి వీడియో సాక్ష్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన న్యూఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న ఓ యువతి 774 రూట్ నంబరు బస్సులో ఇంటికి వెళుతోంది. యువతి కిటికీ పక్కన సీటులో కూర్చొని పుస్తకం చదువుకుంటుండగా పక్కన కూర్చున్న 40 ఏళ్ల ప్రయాణికుడు యువతి నడుముపై చేయి వేసి లైంగికంగా వేధించాడు. యువతి ఈ విషయాన్ని బస్సులో ఉన్న ప్రయాణికులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో యువతి ప్రయాణికుడి వేధిస్తుండగా తన మొబైల్ ఫోన్ కెమెరాతో వీడియో తీసింది. అనంతరం యువతి బస్సులో ప్రయాణికుడి లైంగికవేధింపుల గురించి వీడియో సాక్ష్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.పట్టపగలే బస్సులో అసభ్యంగా తాకుతూ వేధించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంలోనూ తాత్సారం చేశారు. దీన్ని ట్విట్టర్ లోనూ పోస్టు చేసింది. దీంతో కదిలిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన ప్రయాణికుడి కోసం తాము గాలిస్తున్నామని ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్ చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe